వొక్కొక్కరి ఆకాశానికి మబ్బులను అతికించి
వాన కోరుకుని
రాత్రంతా అట్లా చూపుల ఖాళీదారంతా చూస్తూ
రాదు వాన యెంతకీ.
యిద్దర్లో వొకరికి నిద్ర వొస్తుంది చాలాసేపటికి
నేనో నువ్వో ముందుగానే రెప్పలు మూస్తాము,
యెప్పటికో నిద్ర సమయంలో
మధ్యలో
వానపడి
కళ్ళు తెరిచీ
మొఖం మీదనుండి పడిజారే చినుకులను కొన్ని తాగి
పగిలిన
నిన్ను చూసి
నవ్వి
పరిగెత్తి దూరంగా
కాళ్ళకు రెక్కలు వొచ్చినట్టే వొక నీటిగుంతలో యెగిరి దూకి
చూస్తే
మళ్ళీ నిద్ర కమ్ముకుంది నిన్ను తడిముద్దలా
మట్టి కరిగినట్టు నువ్వున్నావు.
ఆకాశమేం మాట్లాడదు నల్లగా చూస్తూ
యెన్ని చుక్కలో మెరుస్తూ బాధగా
లేచాను వింతగా
కల అదీ,
తెలుస్తుంది.
నేను నేనే,
నువ్వు నా నేల.
యిద్దరి కోరిక
లోపలి వాన.
మొఖం నిండా వాన తడిపినట్టే యెంత తడో.
*
Lovely poem esvi
thank you sir… 🙂
మొహం నిండా వాన తడిపినంత బావుంది
thank you…
కాళ్లకు రెక్కలు వచ్చినట్టు…
thank you…
ఇద్దరి కోరిక లోపలి వాన!. బాగుంది కవిత.జీ!
thank you…