యాజ్ఞి నిరాడంబరమైన తాజ రచన. యిది విదేహ శూన్యమౌతూనెే తన మౌలిక రచనా ధర్మాన్ని అత్యంత లోతుగా సాగిన వో స్వేఛ్చా అవధారణ. యీ కవిత్వంలోకి సాగే పాఠకుడి యాత్ర కవి అస్మితను నిర్మిస్తుంది. యీ కవిత్వంలోని యాజ్ఞి ప్రపంచం ఆ ప్రపంచంలోని స్వతంత్రం,మానవత్వం,స్వప్నాలు, అయితే-
యాజ్ఞి కవిత్వం గురించి మాట్లాడడం, రాయడం దుస్సాహసమే. వొక దశాబ్దం అంతకంటే ఎక్కువ సమయపు వ్యవధిలో లిఖింపబడిన యీ కవిత్వంలోకి ప్రవేశించడం సామాన్యమైన విషయమేమి కాదు. యాజ్ఞి యిన్ని రోజులు పలవరించిన, అనుభవించిన, శోకించి దుఖించి ఆవిష్కరించుకున్న క్షణాల సంక్షిప్తతతలను అసాంతం యింత తక్కువ వ్యవధిలో చెప్పేయడమ్ కుదరని పని.
పాఠకుడిగా కవిత్వ ప్రేమికుడిగా నాకున్న సౌలభ్యాలు యాజ్ఞి కవిత్వాన్ని తాగితూగేలా చేసాయి. యీ కవిత్వమ్ చేతికందాక దాని వున్మత్తపు అలలలో తేలియాడుతూనే వున్నాను.
యాజ్ఞి కవిత్వమ్ కౌతుకమైనదైతే కాదు.కళాత్మకతతో నిండుగా వుంటున్నప్పుడు అర్థం సూక్మస్థాయిలో నిలిచి వుండి దాదాపు క్రమంగా అదృశ్యమై కవి మనసు నిలబడి వుంటుంది.నిష్పక్షపాతంగానూ యే నోషన్ లేకుండా పాఠకుడి ప్రవేశమ్ వుండాలి. అప్పడే ఆ ట్రాన్స్ఫార్మేషన్ సాధ్యమౌతుంది. కవి కర్మ వొక ప్యూర్ హ్యూమన్ యేక్టివిటి గా ప్రతిబింబిస్తుంది ప్రతి కవితలో. యీ యేక్టివిటిలో మానవత్వం, ప్రేమ నిండుగా కనిపిస్తాయి. యీ కవిత్వంలో లాక్షణికత్వం యేకపక్షమై వుండే వుదాత్తత. యీ వుదాత్తతలో మనిషే వుంటాడు. ప్రేమ కూడా..
లీనాలీనం కవిత్వ సంకలనంలోని కవితలను నాలుగు భాగాలుగా విభజించుకోవచ్చు.అవి 1. నేను, తనను తాను తరచు చూసుకొని నిర్వచించుకొంటాడు. 2. ప్రేమ, తనలో నిండుగా నింపుకొని వుంటాడు. 3. సమాజం, నిష్పక్షపాతంగా మానవీయ దృష్టితో చూస్తాడు. 4. అనువాదాలు, తన విస్తృత అధ్యయనాన్ని తెలియజేస్తాయి.
యాజ్ఞి కవిత్వంతో గరిపే మానసిక సంభాషణలు నన్ను యెవరినైనా అతనితో ప్రేమలో పడెేట్టు చేస్తాయి. మానసిక కేంద్రమైన ప్రతి కవిత యిందుకు నిదర్శనమ్. బయొలాజికల్ గా యెప్పుడో పుట్టిన యాజ్ఞి బుధ్దిజీవిగా, నిజమైన మనిషిగా పుట్టింది మరో జన్మ యెత్తింది మాత్రం లీనాలీనం రూపంలో. యీ జన్మను తనకత తానుగా శోధించి సాధించుకున్నది. అందుకే అంత సాధికారిత యితని కవిత్వంలో. .. ఈ రో జు పుట్టిన వాడెవడు?/ ప్రేమ ప్రళయ కాళేయకేళీయుడు/ శివాశ్రు గర్భితుడు/ నేనైక మానవుడు. (ఎవడు) యీ కవితలోనే ప్రేమను సాధించుకున్న ఏకైక మానవుడిగా,శివుడి ఆశ్రువు గర్భంలోనికి ప్రవేశించేంత సూక్మ్షదృష్టిని సాధించుకున్నావాడు.
ప్రేమ, పీడనలతో వైయక్తిక సంబంధం అనివార్యమై వుంటుంది. సునిశిత వివేచనతో ప్రేమకు విలువనిస్తూ పీడనలను కార్యాకారణాలతో సమాధాన పరుస్తూ ముందుకు సాగే వారు అరుదే. యాజ్ఞి యిలాగే తన వ్యక్తిత్వం నిండా ప్రేమను నింపుకొన్నాడు. యాజ్ఞి అంతర్మధనం అంతర్ముఖీయంగా సాగిన యాత్రలో యెన్నో వైయక్తిక వైరుధ్యాల,విప్లవాలనరంతరం ప్రేమే సమాధానంగా ఆశ్రయించిందనిపించింది. యీ ప్రేమకు ప్రాతిపదిక మానవత్వం. “నా మనసు/ మంచుకొండమీద/ నీలపు నెలవంక/ ఆమె ఎవరు?/ ప్రేమగాక/ ఇంకెవరు?/ “అని సరి చూసుకొని దాని అవసరాన్ని ప్రకటిస్తాడిలా – ” ప్రేమ ప్రళయాగ్ని క్షణిక నేత్రం/ సర్వమానవ సమాన క్షేత్రం. ” యిదే కవితలో తన భావోద్వెేగాలను రాల్చేస్తాడిలా- వొక క్షణం దుఖం/ ఇంకొక క్షణం చండకోపం/ మరుక్షణం మహానందం.(ప్రేమ)
మనుషుల మందలో నిజమైన మనిషి కోసం వెతికాడు, తనతో మాట్లాడడానికి,తిరగడానికి,కలిసి నడవడానికి …మరో చోట ప్రేమతో పాటు చైతన్యాన్ని ప్రకటిస్తాడిలా..’కాలగర్భాన్ని చీల్చుకొచ్చిన కాంతిరేఖ / ఆకాశం భుూమికి పంపిన ప్రేమ లేఖ.’
ప్రకృతితో మమేకమై దాని సుఖదుఖాల్లోకి మానవీయ సంవేదనతో… రాలే పూల సడిలోని దుఖాన్ని వింటాడు…ఆకురాలు కాలం కడుపున/ఆరని చిచ్చును నేను/ చిగురాకు నేను. ప్రకృతి పట్ల తన తన్మయతను తెలియజేసే మరో కవిత లో తుమ్మద ఝంకారంతో సృష్టి సంగీతాన్ని విన్పిస్తాడు. “ప్రకృతి పురుషుల పూదోటలో / ఓంకారాన్ని పోలిన/ తుమ్మెద ఝంకారం”.
మనిషి పరిమితిని గుర్తుచేసి విశృంఖలతకు కళ్ళెం వేసే కవిత -లేమి ‘ అది సముద్రమైనా/ ఉప్పునీటి చెరువైనా/ చివరికి రక్తమైనా/ వలల్ని విసిరి/ చేపలు పట్టేవాడే కానీ/ అలల్ని పట్టే మొనగాడు/ ఇంకా పుట్టలేదు.’ ప్రతి కవితలో యేదో వొక కదిలించే మెలిపెట్టే గంభీరతకు గురిచేసే పంక్తి వుంటుంది..పై కవితలో ‘చివరికి రక్తమైనా ‘ అనే పంక్తి యిలాంటిదే.
యాజ్ఞిలో విప్లవం వుంది. విప్లవ ఆచరణ పట్ల విమర్శనాత్మక దృష్టి కూడా వుంది. ఆ దృష్టిలో మనిషి మానవత్వాలు ప్రేమ వున్నాయి. భావజాలపు మూర్ఖత్వం చాల సార్లు మానవత్వపు హద్దులు అతిక్రమిస్తుంటుంది. కనీస మనిషి స్థాయికి దిగిరాని అ బానిసత్వపు ఆలోచనను అభ్యాసాన్ని ‘కావలెను’ అనే కవితలో యెండగడుతాడు. సమస్యకు సమాధానం వెతకాలనే మార్గాలను సూచిస్తాడిలా…”జీవించటానికి కాదు/ మరణించటానికి / శరిీరాలు కావలెను.’
యిదే కవితలో ” మనం సమస్యల కోసమే తప్ప / పరిష్కారాల కోసం/ పోరాడేవాళ్ళం కాదు.”
ప్రేమ కోసం
నిజమైన యుధ్దం కోసం
శోకమై
జీవన మధుకోశమై
బతికే వుంటాను
మనకోసమై …
అని చెప్పిన యాజ్ఞి యీ సృజన రూపంలో బతికే వున్నాడు. ప్రేమలేఖ అందించిన యీ సంకలనం ప్రశంశనీయమైన పనిగా భావిస్తున్నాను. చాల కవితలు అద్భుతంగా వున్నా యిది వేదిక సమయం కానందున కాస్తా పరిచయం తో ముగించాల్సొచ్చింది.
*
|
యాజ్ఞి కవిత్వం మనకో ఆత్మీయ లేఖ
యాజ్ఞిలో విప్లవం వుంది. విప్లవ ఆచరణ పట్ల విమర్శనాత్మక దృష్టి కూడా వుంది.
యాజ్ఞి నిరాడంబరమైన తాజ రచన. యిది విదేహ శూన్యమౌతూనెే తన మౌలిక రచనా ధర్మాన్ని అత్యంత లోతుగా సాగిన వో స్వేఛ్చా అవధారణ. యీ కవిత్వంలోకి సాగే పాఠకుడి యాత్ర కవి అస్మితను నిర్మిస్తుంది. యీ కవిత్వంలోని యాజ్ఞి ప్రపంచం ఆ ప్రపంచంలోని స్వతంత్రం,మానవత్వం,స్వప్నాలు, |
చేపల్ని పట్టేవాడేగానీ..అలలని పట్టే మొనగాడు ఇంకా పుట్టలేదు..👌👌మీరన్న దుఖఃమ్ రహస్యంగా ఉన్నప్పటికీ….దాని స్పటీక పరిణతి పాఠకుడిని మరో సుదూర తీరాలకు తీసుకెళుతుంది..ఈ మాట ఈ పుస్తకానికి ఆసక్తికరమైన అంశం.అవుతుందేమో..మంచి పుస్తకాన్ని ..కవితల్ని పరిచయం చేశారు..మంచికృషి..అభినందనలు..సర్..
సంతోషం మాం మీ స్పందనకు…
.. కవి అంతరంగమ్ తో సంభాషించినట్లున్న అద్బుతమైన విశ్లేషణ…
సంతోషం మహీ.. మీ స్పందనకు
సంతోషం మాం మీ స్పందనకు…
The first best review of book and excellent analysis of the poems.
మీ రివ్యూ తో యాజ్ఞి ఆత్మకి ప్రాణం పోసారు.
సంతోషం శ్రీ గారు