“మోహన స్వామి”తో ఓ చలి ఉదయం

ధైర్యం వుంటే కాని కొత్త కథ పుట్టదు!

న్నడ సాహిత్య మహారణ్యంలో వసుధేంద్ర సుగంధాలు విరజిమ్మే ఓ మంచి గంధపు చెట్టు.  మధ్య తరం రచయితల్లో అతని స్థానం చాలా బలమైంది.   పేరున్న ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఓ పెద్ద ఉద్యోగాన్ని వదిలి, సాహితీ వ్యవసాయం చేసుకుంటూ, సుఖంగా బతకగలగడం అతని పేరు ప్రఖ్యాతకుల కున్న ఓ సూచిక.

ఎప్పటినుంచో రచనలు చేస్తూ, లక్షకు పైగా పుస్తకాలని అమ్మిన ఘనత అతనిది.  అనేక ప్రఖ్యాత పురస్కారాల్ని  అందుకోవడమే కాకుండా వేల సంఖ్యలో మర్యాదస్తులైన పాఠకుల్ని సంపాదించుకున్న ‘వసు’ ఓ పొద్దుట తనని తాను  “ గే” గా ప్రకటించుకొని, తను, తనలాంటి వాళ్ళ సమస్యల్ని ప్రధాన ఇతి వృత్తం గా ‘మోహన స్వామి’ కథలు ప్రచురించాడు.  కన్నడ సాహిత్యం లో ఇదో పెద్ద కుదుపు.  మర్యాదస్తులైన పాఠకులు మానవీయ కోణంలో తన కథల్ని అందుకోవడానికి కొంత సమయం పట్టినా, చక్కటి శైలి,  చెయ్యి తిరిగిన రచయిత నుంచి రావడం, కథని నడిపించే తీరు మొదలైన వాటివల్ల, ఈ కథలు ఉత్తమ సాహితీ విలువల్ని సంతరించుకొని తెలుగుతో పాటు ఇతర భాషల్లోకి ప్రవేశించాయి.

ఖధీర్ శీతాకాల కథా ఉత్సవానికి  ప్రత్యేక అతిథిగా వచ్చిన వసుధేంద్ర తో ‘ఛాయా’ కృష్ణ మోహన్ బాబు ఓ చలి ఉదయం ‘మోహన స్వామి ‘ కథల మీద పలకరింపుల అగ్గి రాజేశాడు.  మాటల మధ్యలో దూరి పోయి మరీ చేసిన, ఇటువంటి  సంభాషణలు ఇప్పటిదాకా మీరు విని వుండరని ఖచ్చితంగా చెప్పగలం.  మరి మీ స్పందనేంటో చెప్పండి.

'ఛాయ' మోహన్ బాబు

వర్తమాన సాహిత్యరంగంలో "ఛాయ" కొత్త అభిరుచికి చిరునామా. "ఛాయ"కి ఆ వెలుగు అందించిన కార్యశీలి మోహన్ బాబు. ప్రచురణ రంగంలో కూడా ఛాయ తనదైన మార్గాన్ని ఏర్పర్చుకుంటుంది.

15 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • ఇంటర్వ్యూ చాలా బావుంది. వసుథేన్ద్ర మొహనస్వామి కథలు, నేపథ్యం, ఆయన సాహిత్య ప్రయాణం గురించి చాలా విషయాలు తెలిశాయి.

  • చాలా బావుంది. మంచి ప్రయత్నం. సెన్సిటివ్ విషయాన్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేసేవు. ఆయన బళ్లారి యాస చాలా బావుంది. సహజంగా ఉంది.
    నువ్వు కొంచం నిదానంగా మాట్లాడాలి. Extempore లా అనిపించాలి కానీ, it better be scripted. అండ్ వాడకం ఎక్కువగా వుంది.
    ఎడిట్ కొంచం చెయ్యాలి, స్పీచ్ overlaps తీసేయ్యడానికి. కోపగించుకోకు చెప్పేనని. ఇంకా కొనసాగించు ఈ సంభాషణలు. You fill a vacuum. Best, M

  • thank you krihsna garu for this good talk with the writer. first thing i wanna say is loved t hear both your voices. its a great …what to say a different feel to hear such issue addressed. see people dont like to discuss the sexuality i dunno why they prefer to read peripheral sexual acts and consider it to be good. i appreciate and congratulate that the writer has addressed so many problems on this matter. its educative and informative. it helps many people with this sexuality. thank you for the good piece of interview which creates interest. …love j

  • కృష్ణమోహన్ గారు మీ ఇంటర్వ్యూ ఇప్పుడే విన్నా. చాలా బాగుంది. కథలు నేనింకా చదవాల్సే వుంది, కాబట్టి ఆ విషయంలో యేమీ స్పందించలేను. వసుధేంద్ర చాలా వివరంగానే మాట్లాడారు. నాకు ముఖ్యంగా ఓనిర్ చిత్రాల వల్ల కొంత వరకూ సానుకూలంగా అర్థంచేసుకునే తెలివిడి వచ్చింది. ముఖ్యంగా మై బ్రదర్ నిఖిల్ తో. అది నిజంగా జరిగిన కథ కావడం వొకటి, అది ముఖ్యంగా ఎచ్ ఐ వి గురించినదైనా గే జీవితం,ప్రేమల గురించి కూడా. కాబట్టి గే వ్యక్తుల మధ్య ప్రేమ జీవితం, గే వివాహాల గురించి కూడా సంభాషించి వుంటే బాగుండేదనిపించింది. సరె, యే విషయానికైనా అంతు అంటూ వుండదు కాబట్టి మరో కాలంలో మరో చోట…

    అయ్యబాబోయ్ మీ మాట్లాడే స్పీడు చాలా యెక్కువండి. విని, మననం చేసుకుని అర్థం చేసుకోవాలి. 🙂

  • వసుధేంద్ర మాటలు చాలా నిజాయతీగా ,సరళంగా ఉన్నాయి. అంతే కాదు సూటిగా హృదయానికి హత్తుకునేలా ఉన్నాయి. నిజానికి నాకు ఇందులో తను చెప్పిన విషయాల గురుంచి అవగాహాన లేకపోయినా వాటి గురుంచి మనసుకు ఎరుక అయింది. ఆలోచించ మని చెబుతోంది. ధన్యవాదాలు వసుధేంద్ర కి ,ఒక ఉన్నతమైన వ్యక్తి గురుంచి పరిచయం చేసిన మీకు కూడా ధన్య వాదాలు కృష్ణమోహన్ గారు

  • ఈ కమ్యూనిటీ గురించి సహానుభూతితో అర్థం చేసుకోవడంతో పాటు ,ముద్ర పడని వాళ్ళు అర్బన్ లొనే కాదు రూరల్ పాపులేషన్ లో చాలామంది ఉండి ఉంటారనే విషయం అవగతం చేశారు.బుక్ చదివితే గాని పూర్తి అవగాహన,వారి కృషితెలిసిరాదు.

  • ఇటువంటి ఆడియో ని వినడం ఇదే మొదటిసారి .. చాలా ఇంఫర్మేటివ్ గా ఉంది. స్పెక్ట్రం ఆఫ్ జెండర్స్ గురించి, LGBT ల మనస్తత్వాల గురించి చాలా మందికి అవగాహన ఉండదు, చులకన భావం తప్ప !LGBT కాన్సెప్ట్ ని మన భారతదేశ సమాజం యాక్సెప్ట్ చెయ్యడానికి ఇంకా చాలా టైం పడుతుంది అని నా అభిప్రాయం ! ఈ ఆడియో విన్నాకా చాలా కొత్త విషయాలు తెలుసుకున్నాను !
    వసుదేంధ్ర గారి రీసెర్చ్, ఆయన తపన, విషయాన్ని క్లారిటీ తో క్లియర్ గా అర్ధం అయ్యేలా చెప్పగలిగిన విధానం చాలా నచ్చింది! అనవసరమైన సొల్యూషన్లు , కంక్లూషన్లకి రాకుండా కంటెంట్ ని బాగా డిస్కస్ చేసారు !
    మీరు ఈ పుస్తకం పరిచయం చేసినందుకు థాంక్యు ..! ఎన్నో అపనమ్మకాలను ఈ పుస్తకం పటాపంచలు చేసి గే ల పట్ల జనాల ద్రుక్పథం మారుస్తుందని ఆశిస్తున్నాను !!

  • సెక్స్, జెండర్ లాంటి సంక్లిష్టమైన అంశాల మీద తెలుగు నాట బహిరంగంగా అదీ ధైర్యంగా మాట్లాడడం ఇంకా మొదలు కావాల్సే ఉంది. నేను ఎఫ్లూ లో చదవడం మూలంగా నాచుట్టూ కొద్ది మంది వేరియంట్స్ ఉండడం మూలంగా అది అందరిలాగా నే సహజమైన జీవితం అనిపించింది. ఆశ్లీ టేల్లిస్ ఒకప్పటి ఎఫ్లూ లో టీచర్ (బోంబే లోపుట్టి, కేంబ్రిడ్జ్ లో చదువుకున్న) అతని మూలంగా మా జీవితం లో అది ఒక అకడమిక్ అంశం కూడా అయ్యింది. ఒకటి గమనించా, సంపన్న కులాల, వర్గాల వ్యక్తులు ఈ తరహా జీవితం ఉంటె ఒకరకంగా, స్లం లో పుట్టి పెరిగిన జీవితాలు ఒక రకంగా ఉండడం వారి పట్ల మిగతా ప్రపంచ స్పందన వివక్ష ఆయా సమూహాల స్థాయీ బేధాలను బట్టి ఉంటుంది అని ఇప్పుడుప్పుడే తెలుసు కుంటున్నా. వాళ్ళ పట్ల ఒక రకమైన సహానుభూతి ఉండడమే కాకుండా ఆ బాధలను ఇంకా సాహిత్య లోకం లోకి తీసుకొని రావాల్సే ఉంది. గ్రామీణ ప్రాంతం నుండి వచ్చిన వసుధేంద్ర ఒక కవిగా, రచయితగా నిక్కచ్చిగా తన అభిప్రాయాలు చెప్పడం ఆ ప్రయత్నాన్ని సాధ్యమైనంత వొడుపు గా మనకు అందించిన మోహన్ గారు ఇద్దరూ సమస్థాయిలో కష్టపడ్డారు. ఇటీవలి అరుందతి రాయ్ రచన లో థర్డ్ జెండర్ అంశం కూడా ఉండడం ఆహ్వానించదగిన అంశం. సానుభూతి తో కవిత్వం రాయడం మాత్రమే కాదు వసుధేంద్ర లాంటి వాళ్ళతో ఆ లోకపు ఎత్తు పల్లాలను మరింత లోతుగా తడమాల్సిన అవసరం మనందరి మీదా ఉంది.

  • కమ్మనైన తెలుగులో, మోహన్ స్వామి గారుతోఇంటర్వ్యూ, బాగా చేశారు. ఛాయా సర్..👌👍..మీఇరువురికీ అభినందనలు..!💐

  • ముఖాముఖి చాలా బావుంది. నిన్ననే మోహనస్వామిని పూర్తి చేశాను. అద్భుతమైన శైలి, కథనం. అస్సలు అనువాదం చదువుతున్నట్టే లేదు.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు