నేను కడుపులో పడింది మొదలు
నేను భూమి పై పడి ఎదిగే దాకా
నన్నూ నా అమ్మని సాకింది బహుజనులు
నా అనాటమి ని అణువణువూ శోధించిన
జీవ శాస్త్రవేత్తలు వారే
నా మూగ రోదనలు పసిగట్టి
రోగాన్ని నిర్ధారించ గల మానసిక వైద్యులు వారే
వాళ్ళు తిన్నా తినక పోయినా
నా తిండీ తిప్పల్లో
ఏ వెలితి లేకుండా వేళ ప్రకారం
నా ఎదుగుదల వారి కళ్ళల్లో ఆనందం
నా బాధ్యత
వాళ్ళ కు సాయం
శ్రమ వారి కోసమే
విశ్వాసం నాకు వెన్న తో పెట్టిన విద్య
యాంత్రీకరణ నన్ను సోమరిని చేయలేదు
నా అవయవాలన్నీ నా ఆధీనంలో వున్నంత వరకు
నా పోషకుల పక్షమే జీవితాంతం
ఆక్రమణ దారుడు
నన్నూ ఆక్రమించ యత్నం
నన్ను బలి కోరి విందారగించి
ఇప్పుదేదో నేను అపవిత్రమైనట్టు
పవిత్రం చేయబూనే నాటకం
వికృతి ని ప్రకృతి చేయ
నన్ను వాటేసుకుని భావోద్వేగ సమర సృష్ఠి
నా పునరుత్పత్తి తరిగి పోతుంటే ఏ చర్యా లేదు!!
ఓ మగ ఆడ కౌగిలి మానసిక వికాసం
ఓ మగ మగ
ఓ ఆడ ఆడ కౌగిలి మానసిక వికారం
ఓ మనిషి జంతువు కౌగిలి ఏ తీరాలకు అజ్ఞానం !!
మౌఢ్యం మనిషి ని చిదిమేస్తుంటే
ప్రశ్నించే కొడవళ్ళు నిరంతరం సాన బడుతూ
నరుకుతూనే సాగాలి!!
నన్నూ మనిషినీ సహ జీవనం చేయమనే దాకా వెళ్లకుండా ఆప గలిగే జ్ఞానం మనిషి సొంతం!
ఆ జ్ఞానమే నన్నూ మనిషి ని వేరు చేసిందనే ఇంగితం లేని దశ లో వలస జీవి!!
కోడె కోసమే నా ఎదురు చూపు
నా భావోద్వేగం కోడె కౌగిట్లోనే పెరుగు!
ఇక తేల్చుకోవాల్సింది మనిషే!!
*
చిత్రం: చంద్రం
Add comment