జకియా.. క్షేమమా
బయట యుద్ధ ట్యాంకు నిలబడి ఉంది
కిటికీ తెరిచి ఉంది.
యుద్ధ ట్యాంకుజూసి భయమేయడం లేదా
నినాదాలు ఇస్తూనే ఉన్నావా?
“డౌన్ ..డౌన్.. డౌన్.
నియంత డౌన్.. డౌన్ “
ముళ్ళ కంచెకు ఇవతల నేను
నీకోసం రాస్తున్నా
“మా గొంతుకై నిలవండి “
ఇదే కదా నీ చివరి సందేశం
నేనొక కవయిత్రిని
నా దగ్గర పద్యాలే ఉంటాయి
నేను 1971లేదా 1952 చూడలేదు
మా అమ్మ ఏనాడు
తుపాకులకు ఎదురు నిలవలేదు
మా నాయన ఏనాడు
బయట నుండి రక్తసిక్తమై రాలేదు
“నేను నీ గొంతుక ఎట్లయిత”
కానీ, ఈ రోజేదో
ఎరుపు రంగును సంతరించుకుంది
“దీదీ మన రక్తమంతా ఏరుపే”నని
నువ్వంటుంటావు కదా
నిన్ను చేరాలనుకుంటా
ఎప్పుడూ సాధ్యం కాదు
చాలా దారుణంగా పారిపోతుంటాను
రక్తమోడే కాశ్మీర్ ను, మణిపూర్ ను
నేనెప్పుడూ చేరుకోలేను
నుస్రత్ ..ఎట్లున్నవ్
మనిద్దరం ఖైదీల మే
నిర్బంధంలో నువ్వక్కడ
తన మ్యాపులో
కాశ్మీర్ ,మణిపూర్ల వంటి
దుర్భవిద్యపు కోటలు కలిగిన
పుణ్యభూమిలో నేనిక్కడ
ఊపిరి పీల్చుకోవడానికి
ఇప్పటికి నేను దర్వాజా కోసం వెతుకుతున్న
మనల్ని ఏలుతున్న
ఇద్దరు మారాజులకి
శతకోటి దండాలు
**
“A plague of internet shutdown.”. కు స్వేచ్ఛానువాదం
Add comment