ప్రతీ కధా ఏదోఒకరోజు
కంచికి చేరుతుందనుకుంటారు కానీ
ఇక్కడ మాత్రం రోజుకో కొత్తకథ పుడుతుంది.
తరచిచూస్తే
మస్కారాతో మెరిసే కళ్ళలోనో
లిప్స్టిక్ పెదవులలోనో
ప్రాణం పోసుకునే ఓ కొత్తకథ కనిపిస్తుంది
ఫౌండేషన్ క్రీములతో,ఐలాష్ లతో
ఆకర్షిచే ముఖాల మాటున
ఏడురంగుల స్వప్నాలు
కమురు వాసన వేస్తాయి
దేహం వినిమయ వస్తువు అయ్యాక
నగ్నత్వాన్ని కాంక్షిస్తారే కానీ
దానివెనుక ఉండే కలల్ని కాదు
ఇక్కడంతా క్షణకాలపు ప్రేమలు
శాశ్వత వియోగాలు.
కోరికల కొలిమిలో కాలిపోవడం
తప్పనిసరైనప్పుడు
ఆవేశపు గాజుసీసా భళ్ళుమన్నాక
మనసు పొరల్లో వేల రుధిర సంతకాలు
చెయ్యకమానదు
తనువు విరహం తీర్చే అవయవమయ్యాక
స్పర్శలోని అసహ్యమేదో అర్ధమౌతుంది
దగాపడ్డ బతుకులోంచి
స్పష్టాస్పష్టాలుగా ఉండే కథలేవో
కొత్తభాష నేర్చుకుంటాయి
చీకటి పరదాలలో పుట్టే కథలన్నీ
అసంఖ్యాకంగా మారి
కంచికి చేరని కథలుగా మిగిలిపోతాయి.
*
నగ్నత్వాన్ని కాంక్షిస్తారే కానీ దాని వెనుక వుండే కలల్ని కాదు
ఆవేశపు గాజు సీసా భల్లుమన్నాక…
ధన్యవాదాలు సర్
Nijamey ఇక్కడంతా క్షణకాలపు ప్రేమలో, శాశ్వత వినియోగాలు.
అభినందనలు లక్ష్మీ ప్రశాంతి అక్క
థాంక్యూ శ్రీలత
కవిత వేదనామయంగా వుంది.
ధన్యవాదాలు సర్
చాలా బావుంది
థాంక్యూ చైతూ
స్వప్నాలు
కమురు వాసన వేస్తాయి… ఈ వాక్యం ఆకర్షించింది. కవిత బావుంది.
థాంక్యూ సూఫీ
చాలా బావుంది అండి
ధన్యవాదాలు సర్
కోరికల కొలిమి లో కలిపోక తప్పదు మానవ దేహం మానవ నైజాన్ని చక్కగా వర్ణించారు అంది …. చక్కని వర్ణన
థాంక్యూ లక్ష్మణ్ గారు
కథలు కొత్త భాష నేర్చుకుంటాయి
మారుతున్న కాలంలో కలలు కళలు కథలు కొత్త రంగులు పులుముకొని కొంగొత్త భావాలు అడ్డుకుంటాయి అని చక్కగా వివరించారు.
థాంక్యూ సాయి
బాగుంది ప్రశాంతీ.అభినందనలు.
థాంక్యూ మేడం
చాలా బావుంది అండి.
థాంక్యూ అండీ