మాటల సెలయేరు

1
రాయడం అలవాటు అయితే
ఎలాగైనా రాయచ్చు
వాక్యాల దొంతరలో చమ్కీ దండలు
కను కొలుకుల్లో నీటి చెలమలుగుక్క తిప్పుకోవడానికి
ఎడమిచ్చిన చుక్కలు
అర్ధానుస్వారాలు
పాతబడిన అందెల చప్పుళ్లుఅల్ల కల్లోలపు గుంపులో
స్పర్శల నిశ్శబ్ద సంభాషణ
ఏదైనా చెప్పొచ్చు
మాట్లాడ్డం అలవాటయితే
మంత్రదండం విదిలించచ్చుకాలాన్ని దాటే మాటే కవిత్వం
వేదం  కూడా
ఒకనాటి మాటల సెలయేరే కదా
2
కలలో వచ్చిన కల
కలలో వచ్చిన కలలో
రంగస్థలం మీద ఒంటరినై
రెక్కలు లేకుండా ఎగిరిన
చెట్లు కొండలు
నదులు ఎడారులు

పరదా తీస్తే
రాత్రి లోపల రాత్రి
సూర్యుడి చుట్టూ
గస్తీ తిరిగే ధాత్రి

నిర్వాణానంతర సుఖం
స్వప్నాంతర్గత జీవితం
అనుభవించడం ఎలా?

*
చిత్రం: రాజశేఖర్ చంద్రం 

Indraganti Prasad

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు