పురుషుడిని విద్యావంతుడిని చేస్తే అది అతనికే పరిమితం. అదే మహిళని విద్యావంతురాలిని చేస్తే అది కుటుంబానికి ఆ పై దేశన్నే విద్యావంతం చేస్తుంది అని మాల్కాం ఎక్స్ అనే మానవహక్కుల యోధుడు అప్పట్లోనే చెప్పిన మాట.
మిలియన్ సంవత్సరాలుగా పురుషాధిక్యత నడుస్తూ ఉండగా, గత కొద్ది దశాబ్ధాలుగా మాత్రమే మహిళని సాధికారత వైపు నడిపించే దిశగా ప్రయత్నాలు జరిగాయి. మరి ఇంకో మిలియను సవంత్సరాలు మహిళ తన ఆధిక్యతని చాటుకునే అవకాశం ఇవ్వొచ్చు కదా అని ఒకసారి నేను ప్రశ్నించినపుడు భిన్న స్వరాలు వినిపించాయి. ఇదేమైన పోటీనా? ఇద్దరూ సమానమే అని. మరి ఏ ఆలోచన మిలియన్ సవంత్సరాలుగా వచ్చే అవకాశమే లేకపోయింది.
గత కొద్ది దశాబ్ధాలుగా మహిళా అభివృద్ది పరంగా చాలానే పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఒకప్పటిలా ఇప్పుడు లేదు అని అందరూ అంటుంటారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటి అంటే, సాధికారత పొందిన మరియు స్వతంత్రురాలు అయిన మహిళతో కలిసి ఎలా సహజీవనం చేయాలి అన్నది మగవారికి నేర్పించే ప్రయత్నాలు జరగలేదు. అక్కడ గ్యాప్ వచ్చినట్లుగా కనబడుతూ ఉంటుంది. ఈ గ్యాప్ మూలంగా కొత్త సమస్యలు తల ఎత్తాయి అన్నది నిజం. విడాకుల సంఖ్య పెరగటానికి ఇది కూడా ఒక కారణం.
ఇంకా మహిళా సాధికారత గురించి పనిచేయాల్సిన అవసరం ఉందా అన్న ప్రశ్న చాలా సార్లు చాలామంది లేవదీస్తూ ఉంటారు. దానికి సమాధానం ఉందనే చెప్పాలి. ఏవో కొన్ని పట్టణాల్లో కొందరి జీవితాన్ని చూసి అలా అనేసుకోవటం పెద్ద పొరపాటు. కార్పోరేట్ రంగంలో కూడా మహిళ అనేక రకాల వివక్షని ఎదుర్కుంటున్నది. ఈ మధ్యనే ఒక వివాదం చూసాను. స్త్రి రచయితలు రకాల పద్దతుల్లో పాపులారిటీ సంపాదిస్తున్నారని. అంటే స్త్రీ ఏమి చేసినా ఎలా చేసినా సమాజం ఇంకా విమర్శించే స్తితి నుంచి బయటకి రాలేకపోతున్నది. ఇప్పటికి స్త్రీ మొదట వస్తువుగానే కనబడుతున్నది. ఆ తరువాతే కొండకచో తన ప్రతిభ కనబడుతున్నది. పురోగతి ఉన్నప్పటికీ, ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో మహిళలు ఇప్పటికీ వివక్షను ఎదుర్కొంటున్నారు, వివిధ అంశాలలో తగినంత విలువని పొందలేకపోతున్నారు. ఈ కింది కొన్ని విషయాలు ఈ సమస్య ప్రభావాన్ని తెలియజేస్తాయి.
> ప్రపంచవ్యాప్తంగా ఉన్న పార్లమెంటరీ సీట్లలో మహిళలు 25.2% మాత్రమే కలిగి ఉన్నారు (యుఎన్ ఉమెన్, 2020).
> 2020 నాటికి, 15 దేశాల్లో మాత్రమే మహిళలు రాష్ట్ర లేదా ప్రభుత్వ అధిపతులుగా ఉన్నారు (ప్యూ రీసెర్చ్ సెంటర్).
> వేతన వ్యత్యాసం ప్రపంచవ్యాప్తంగా 16%, అంటే పురుషులు సంపాదించే ప్రతి డాలర్‌కు మహిళలు సగటున 84 సెంట్లు సంపాదిస్తారు (ఐఎల్ఓ, 2018).
> 76% మహిళలు వేతనం లేని పనిచేస్తున్నారు.
> అబ్బాయిలతో పోలిస్తే, 6-17 సంవత్సరాల వయస్సు గల చాలా మంది బాలికలు పాటశాలకి వెళ్ళటం లేదు. (ఊణేశ్ఛో, 2018).
> ప్రతి ముగ్గురు మహిళల్లో ఒకరు శారీరక లేదా లైంగిక హింసను ఎదుర్కొంటున్నారు (డబ్లుహెచ్ఓ, 2018).
> కేవలం 52 దేశాల్లో మాత్రమే మహిళా పరమైన చట్టాలున్నాఉఒ (యుఎన్ ఉమెన్, 2020)
> సౌదీ అరేబియాలో, మహిళలు 2018లో మాత్రమే డ్రైవింగ్ చేసే హక్కును పొందారు.
> ఆఫ్ఘనిస్తాన్‌లో, 1996-2001 వరకు తమ పాలనలో తాలిబాన్ బాలికలు పాఠశాలకు వెళ్లకుండా నిషేధించారు.
ఇవన్నీ మహిళల విలువని తగ్గించేవిగాను ఇంకా సవాళ్ళని ఎదుకుంటూనే ఉన్నారని విషయాన్ని నిరూపిస్తున్నాయి. వీటన్నిటి కోసం నిరంతర ప్రయత్నం కొనసాగకపోతే మళ్ళీ చక్రం వెనక్కి తిరిగే అవకాశాలుంటాయి. నిరాటంకంగా మహిళ తన అస్థిత్వాన్ని ఇంకా సుస్తిరం చేసుకుంటూ, సృష్టి సమతుల్యాన్ని కాపాడుకుంటూ ముందుకు వెళ్ళాల్సిందే!
*
చదివిన కొద్దీ ఇంకా చదవాలని వుంది. గుడ్