మరింత మంది పా. రంజిత్‌లు కావాలి

మగువకు మానాన్ని ముఖ్యమైనదిగా మార్చి, దాన్ని హరించడమే ఆమెకు చేయగల గొప్ప హానిగా ఎదిగిన సమాజాన్ని బడితెతో బాదడం నాకు చాలా హాయినిచ్చింది. ఒక మగాడి పంచె లాగివేస్తే పోయేదేంటో ఒక మహిళ చీర లాగివేసినా అంతే.

నేను సాధారణంగా స్టార్‌లు అనిపించుకున్న హీరోల సినిమాలకు దూరంగా వుంటాను. నాకు సినిమాల్లో జీవితం కావాలి. అదికూడా పల్లె జీవితం, బడుగు జీవితం అయితే మరింతగా అందులో నేను లీనమవుతాను. రజనీకాంత్ సినిమాలు ఆ సరసన వుంటాయని అనుకోను. అవి చూడాల్సిందే అనే ఉబలాటం నాలో కలగదు. కాలా గురించి విడుదలకు ముందు నాకు అస్సలు తెలియదు. దాని దర్శకుడు పా రంజిత్ గురించీ తెలియదు. కానీ సోషల్ మీడియాలో కాలా గురించి వస్తున్న స్పందనలు చూశాక ఇది తప్పనిసరిగా చూడాలనిపించి చూశాను.

కథలో నాకేమీ కొత్తదనం కనిపించలేదు. చాలా స్టార్ హీరోల మూవీలకు మల్లే విలన్ వుంటాడు. వాడు పేద ప్రజలను హింసింస్తూనో, వారిని మోసగిస్తూనో వుంటాడు. ఆ బడుగు ప్రజల్లోంచీ ఒక నాయకుడు ఉద్భవిస్తాడు. వాడు విలన్‌ను ఎదుర్కొంటాడు. అలాంటి మూవీల్లోనే వున్న మరొక మూస. హీరో ఎంత వృద్దుడైనా, పసిబాలుడైనా ఎదుట వున్నది ఒక్కడైనా, వందైనా అందరినీ ఒక్కడే మట్టి కరిపిస్తాడు. ఆ దృశ్యాలు ఇందులోనూ వున్నాయి.

అయితే ఈ మూసలకు భిన్నంగా వున్నవి పుష్కలం. రజనీని మేకప్పులేసి నవ యవ్వనుడిలా చూపిస్తారేమోనని తెగ భయపడ్డాను. అది జరగలేదు. జరీనాతో తన ప్రేమ దృశ్యాలను దర్షకుడు కేవలం బొమ్మలతో చూపించడం ఊరట నిచ్చింది. కానీ అసలు ఈ సినిమాలో జరీనా అనే పాత్ర అవసరమా అని బలంగా అనిపించింది. తమిళ మూలంలో ఆమె సంభాషణలు ఎలాగున్నాయో గానీ, తెలుగులో కృతకంగా వున్నాయి. రజనీ భార్య పాత్ర సంభాషణలూ, ఆమె నటనా కూడా అంత సహజంగా లేదు. స్త్రీలలో జరీనా అనవసరం అనిపించినా మిగిలిన పాత్రలు అన్నీ కూడా కేవలం సౌందర్య ప్రదర్షణ అని కాకుండా సహజంగా తీర్చి దిద్దబడ్డాయి. తమ ఇళ్ళను కూలదోయడానికి వచ్చినపుడు వారు చేసిన పోరాటం, తెగువ సహజంగా వున్నాయి.

మగువకు మానాన్ని ముఖ్యమైనదిగా మార్చి, దాన్ని హరించడమే ఆమెకు చేయగల గొప్ప హానిగా ఎదిగిన సమాజాన్ని బడితెతో బాదడం నాకు చాలా హాయినిచ్చింది. ఒక మగాడి పంచె లాగివేస్తే పోయేదేంటో ఒక మహిళ చీర లాగివేసినా అంతే. చీర లాగినంతనే కుచించుకుపోయి, మానాన్ని చేతులతో కప్పుకుని, కూలబడే ఆడవాళ్ళనే చూసిన సమాజం, అందుబాటులో వున్న గుడ్డ ముక్కను కాక బడితెను అందుకున్న స్త్రీని చూసి నివ్వెరపోవాల్సిందే! మరొక చోట రజనీ తన భర్యకు చెప్పకుండా తన మాజీ ప్రియురాలుని చూచిరావడానికి వెళతాడు. ఆమెతో, రజనీని కూచోబెట్టి ఇంట్లోవాళ్ళు పరాచికాలు ఆడటమూ, ఆ మాజీ ప్రేమికులు ఇద్దరూ సిగ్గుపడుతూ, బిడియపడుతూ వుండటం.. చూసినపుడు ఇదే ఒక హీరో తన భార్య పాత్ర తన మాజీ ప్రియుడుని చూసిరావడానికి చెప్పకుండా వెళితే ఆ యింట్లో వాళ్ళు అంత సరదాగా తీసుకుంటారా అనుకుంటున్నంతలో రజనీ భార్య అదేమాట అడిగి ఆశ్చర్యపరుస్తుంది. ఏ స్త్రీ పాత్ర కూడా జీవం లేకుండా, స్వతంత్రత లేకుండా కేవలం బొమ్మలా కనిపించదు. ఇది సహజంగా రంగురంగుల బట్టలతోనో, తగినన్ని బట్టలు లేకుండానో నాట్యాలాడే సుందరీమణులను చూడాలనుకునే ప్రేక్షకులకు నిరాశే!

ఇక సినిమాలోని విశిష్టత అంతా కథను రామాయణంతో పోల్చడంలో వుంది. హిమాలయాల చుట్టూ, బాబాల చుట్టూ తిరిగే రజనీకి కథ ఏంటో పూర్తిగా తెలిసే ఇందులో నటించాడా అన్న సందేహం వచ్చింది. తను తెలిసే చేసి వుంటే అతన్ని ఇంకా తెలుసుకోవాలన్న కుతూహలం కలిగింది. రామాయణాన్ని మనం కేవలం రాముడి వైపునుండే చూస్తాం. అలా చూసి రావణున్ని భయంకరమైనవాడుగా మనసుల్లో ముద్రించుకుంటాం. అతన్ని, అతని పరివారాన్ని చంపడాన్ని పండుగ చేసుకుంటాం. పసిపిల్ల హరిదాదా మనవరాలు కూడా అలాగే కాలాను చంపేయమంటుంది. చూసిన తర్వాత అతను మంచివాడే చంపవద్దంటుంది. సినిమా అంతా చాలా సింబాలిక్ అంశాలున్నట్లు అర్థమవుతుంది. నాలాంటి వాడికి రెండు మూడు సార్లు చూస్తే గానీ అందులో కొన్నయినా అర్థం కావు. హరిదాదా ముఠా కాలా యిల్లు తగలబెట్టినపుడు మనకు ఆ పక్కనే వున్న హనుమంతుడి విగ్రహం కనిపిస్తుంది. కాలా మీద దాడి జరుగుతున్నపుడు, అతని అనుచరులను చంపుతున్నపుడు హరిదాదా రామాయణ యుద్దకాండం వింటూ వుంటాడు.

ఈ మరుగుపరిచిన కథనాలే కావలిప్పుడు. రాక్షసరాజులుగా చిత్రించబడిన ద్రవిడరాజుల కథలను వెలికితీయాలి. ఆక్రమణదారుల కథను వినడం పక్కన పెట్టి, ఆక్రమించబడిన వారి కథను వినాలి. స్థానికుల కథను వినాలి. తమ తమ జన్మ స్థలాలలోనే వాళ్ళెలా బానిసలు కాబడ్డారో పరిశోధన జరగాలి. మనకు మరింత మంది పా రంజిత్‌లు కావాలి.

*

 

ప్రసాద్ చరసాల

12 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • ప్రతి దానికి రెండు వాదనలు ఉంటాయి మనం చరిత్రను మన కోణం లోంచి చూడాలి అనుకోవడం లోనే అసలు తప్పు ఉంది .తప్పు ఒప్పులు అన్నిచోట్లా ఉంటాయి .మనం చేస్తే తప్పు కాదు .ఎదరవారు చేస్తే తప్పు అనేటట్లు ఉండరాదు .ఏ యుద్ధం లో నైనా బలవంతుడు గెలుస్తాడు .బలహీనుడు ఓడతాడు.ఓడినవాడిది తప్పు అని చెప్పలేము .తప్పు కాదని చెప్పలేము .
    చరిత్ర ద్రావిడ కోణం అని వారికి అనుకూలంగా రాస్తే అది సరైన పనా?.చరిత్రను ఏ కోణం నుంచి కాక చరిత్ర లాగే చదవాలి.
    తిరిగి రాయడానికి అప్పటి సంగతులు మనకి ఏమి తెలుసు
    ? మన పైత్యం వెళ్లగక్కి అది నిజం అని పది సార్లు అనుకోవడం
    .సమాజం లో కొత్త చీలికలు తేవడం..మీరు కూడా ఇలాంటి తప్పు చేస్తున్నారు.

    ?

    • నిజనికి ప్రతిదానికీ రెండు వాదనలు కాదు, అపరిమిత వాదనలు వుంటాయి. అసలు కోణమే లేకుండా చరిత్ర లేదు. తెలిసిన అన్ని కోణాల సముదాయమే చరిత్ర.
      అసలు “తప్పు-ఒప్పులే” ఒక కోణంలోంచి చూపబడిన ప్రతిబింబాలు.
      నిజమే ఒడినవాడిది తప్పూ కావచ్చు కానీ వాడికీ ఓ కోణముంటుంది. వాడి స్వరమూ తప్పక వినాలి. ఇప్పటి వరకూ ఆక్రమించుకున్న వారి, దోపిడీ చేసిన వారి గొంతే విని దాన్నే చరిత్ర అంటే అదీ సరైన పని కాదుగా?
      సమాజంలో చీలికలు తేవడం లేదు. సమాజంలో చీలికలు నిజం. సమాజం ఏక శిల కాదు. ఈ చీలికలన్నిటినీ గుర్తిస్తూ సమాదరించడమే కావాలి గానీ, చీలికలనే గుర్తించను అనడం కాదు.

  • సినిమా చూడలేదు. సమయం చూసుకుని చూస్తాను. సినిమా గురించి సరే. రాక్షసరాజులుగా చిత్రించబడిన ద్రవిడరాజుల కథలను వెలికితీయాలి అన్నారు…….రావణుని రంగు గురించీ అతని జాతి గురించీ రామాయణంలో ఏమి వ్రాసి వున్నదో తెలియపరచగలరు. రావణుడు బ్రాహ్మణుడు. రావణుణ్ణి చంపి ఆ బ్రహ్మ హత్య పాపాన్ని పోగొట్టుకోవడానికి రాముడు తర్వాత ఉపశమన చర్యలు కూడా చేసాడు. రావణుడు జాతి రీత్యా రాముని కన్నా సుపీరియర్. ఇద్దరూ నలుపు రంగు గల వేరు వేరు జాతి ప్రజలను తమ ఆధీనంలోకి తీసుకుని వారికి నాయకులుగా ఎదిగి తమ వ్యక్తిగత విరోధాల్లో ఆయా జాతులను సైన్యం గా వినియోగించుకున్నారు. ప్రస్తుత సమాజంలో రావణుడు ఎందుకు ఎక్కువ సానుభూతి పొంది అణగారిన వారి తరగతికి చెందిన వాడుగా గుర్తింపబడుతున్నాడో నాకు తెలియకున్నది. మరింత అవగాహన కల వారు చెప్పగలరు.

    • రాముడు ఉత్తర భారత రాజు.. ఆర్యుడు అని భావిస్తారు. రావణుడు లంకాధిపతి కనుక ….ఆ లంక శ్రీలంకేనని అతడు దక్షిణ భారత ద్రావిడ రాజని…. తమిళుల అభిప్రాయం. కాబట్టి ఎక్కడో ఉన్న అయోధ్య కంటే దగ్గర గా ఉన్న లంక రాజుకే తమిళతంబీలు దగ్గర య్యారు.
      ఐతే అవి పురాణంలోని పాత్రలేనన్న సంగతి మర్చిపోతున్నారు.

    • రావణుడు బ్రాహ్మణుడో కాడో! బ్రాహ్మణుడే అయినా అతను ద్రావిడ రాజు. ద్రావిడుల పక్షాన, ద్రావిడుల నేల కోసం పోరాడిన వాడు.
      రావణుడికి తమ్ముడయీ తన పక్షాన పోరాడిన విభీషుణుడు మంచివాడు కావడం, తనను ఎదిరించిన వాడు బ్రాహ్మణుడైనా రాక్షసుడు, దుర్మార్గుడు కావడమన్నది.. ఆక్రమించుకున్నవారి ధర్మం. ప్రధాన స్రవంతి ఆలోచనలను దానికనుగుణంగా ఇన్నాళ్ళూ చూపించారు.
      మరో కోణం ఓడిపోయినవారి, అణగదొక్కబడిన వారి కోణం. అదిప్పటివరకూ అడపా దడపా రచనల్లో కానవచ్చినా సినిమాల్లో రావడం లేదు. అదిప్పుడు “కాలా” రూపంలో వచ్చిందనే ఆనందం.
      రావణుడి వంటి రంగు తెలుపు కావచ్చు, అతను నల్లరంగువాళ్ళ ప్రతినిథి.
      రాముడి వంటి రంగు నలుపే కావచ్చు, అతను తెల్లరంగువాళ్ళ ప్రతినిథి.

  • భారతదేశాన్ని ఆర్యులు, ద్రావిడులు అన్న బూటకపు విభజనతో ముక్కలు చేయాలనుకున్న వేర్పాటువాద శక్తుల కుట్రే ఈ ఆర్యుల దురాక్రమణ అనే బూటకపు ప్రచారం. పురాతత్త్వ, జన్యు, భాషాశాస్త్ర పరంగా ఆర్యులు ఆక్రమణ, వలస అనేది పచ్చి అబద్ధమని శాస్త్రీయ పరిశోధనలు ఇప్పటికే చెబుతున్నాయి. ఇది కచ్చితంగా అంబేడ్కర్ భావజాలనికి విరుద్ధం, వెన్నుపోటు. తన హూ ఆర్ ది సూద్రాస్ అనే పుస్తకంలో ఆయన యిలా అంటారు..
    ‘‘After closely examining Vedic scriptures, the conclusion drawn by Babasaheb was this:

    The Shudras were one of the Aryan communities of the Solar race.
    The Shudras ranked as the Kshatriya Varna in the Indo-Aryan Society.
    There was a time when the Aryan Society recognized only three Vamas, namely. Brahmins, Kshatriyas and Vaishyas. The Shudras were not a separate Varna but a part of the Kshatriya Varna.
    There was a continuous feud between the Shudra kings and the Brahmins, in which the Brahmins were subjected to many tyrannies and indignities.
    As a result of the hatred towards the Shudras due to their tyrannies and oppressions, the Brahmins refused to invest the Shudras with the sacred thread. Owing to the loss of the sacred thread the Shudras became socially degraded, fell below the rank of the Vaishyas and came to form the fourth Varna.‘‘

    • ఆర్య పుత్రులకు అంతా ఎరుకేనా?
      ఆర్యులెవరు? ఎక్కడ్నించి వచ్చారు?
      ఎక్కడికి వచ్చారు? వచ్చి ఏం చేశారు?

      చిరకాలంగా చరిత్రలో అతిపెద్ద చిక్కుముడిలా మిగిలిపోతూ.. సామాజికంగానే కాదు.. రాజకీయంగా కూడా రకరకాల భావ యుద్ధాలు, విపరీత భావోద్వేగాలు రేపుతున్న ఈ ప్రశ్నలకు జన్యువులు జవాబివ్వబోతున్నాయా? తాజా జన్యు పరిశోధనలను చూస్తే ఇది నిజమే అనిపిస్తోంది. ఆ మాటకొస్తే.. ఈ ప్రశ్నలకే కాదు.. అసలీ ఉపఖండంలో ఉంటున్న మనం ఎవరం? మన పూర్వీకులెవరు? మన మూలాలెక్కడివన్న ఆసక్తికర ప్రశ్నలకూ జన్యు పటాల్లో ఆనవాళ్లు, ఆచూకీలు దొరుకుతుండటం.. సరికొత్త చర్చకు తెర తీస్తోంది!

      జాతుల జగడం.. జన్యువు తీరుస్తుందా?
      ఆర్యుల పేరెత్తితే చాలు.. రకరకాల అనుమానాలు, అభిమానాలు, ఆందోళనలు, ఆవేశకావేశాలు కట్టలుతెంచుకుంటుంటాయి. మన చరిత్రలో వాళ్ల ఉనికికి సంబంధించిన ప్రశ్నలు రేకెత్తించినన్ని భావోద్వేగాలు మరి దేనికీ రేగవు. ఆర్యులన్న పేరు వింటూనే చరిత్రకారుల నుంచి, సామాజిక వేత్తల నుంచి.. చివరికి రాజకీయనాయకుల వరకూ అంతా దిగ్గున లేస్తారు. వాదోపవాదాలు భగ్గున రేగుతుంటాయి. ఆర్యులనేవాళ్లు బయటి నుంచి ఉత్తర భారతానికి వచ్చి.. ఇక్కడి స్థానికులను దక్షిణాదికి తరిమేశారని చెప్పేవాళ్లు కొందరు. అసలు ఆర్యులే దేశమంతా విస్తరించారనే వాళ్లు మరికొందరు. లేదులేదు, వాళ్లెవరో బయటి నుంచి రావటమేమిటి? అసలు ప్రపంచ జాతులన్నింటికీ మన భరతఖండమే పుట్టినిల్లు, ఆధునిక మానవ జాతి అంతా ఇక్కడి నుంచే ప్రపంచమంతా విస్తరించిందని బల్లగుద్ది వాదించే వాళ్లు మరికొందరు. ఈ వాదనల యుద్ధాలు ఏదో చరిత్ర పుస్తకాలకే పరిమితం కాలేదు. దేశంలో భిన్న వర్గాల మధ్య సాంస్కృతిక విభేదాలకు, అగాధాలకు ఆస్కారం ఇస్తూ.. ఇటీవలి కాలంలో రాజకీయంగానూ సంచలనాల దుమ్ము రేపుతున్నాయి. మరి ఈ చిరకాలపు చిక్కుముడి వీడేదెలా? ఇప్పటి వరకూ ఉన్న పరిశోధనలు, చరిత్ర పద్ధతులన్నీ దీనికి సమర్థమైన సమాధానం ఇవ్వలేకపోతున్న నేపథ్యంలో.. తాజాగా జన్యు పరిశోధనలు రంగం మీదికి వస్తుండటం విశేషం.

      సైన్సే కాదు.. ప్రశ్న లేకుండా చరిత్రా పురుడుపోసుకోదు. అందుకే చరిత్ర నిండా బోలెడన్ని ప్రశ్నలు, లెక్కలేనన్ని చిక్కుముళ్లు! రకరకాల మార్గాల్లో గతంలోకి తొంగి చూసి.. చిక్కుముళ్లను విడదీసుకుంటూ పోయే కొద్దీ అస్పష్టతలు వీడి చరిత్ర ఒక రూపానికి వస్తుంటుంది. అందుకే చరిత్ర పరిశోధకులు దశాబ్దాలుగా పురాతత్వ తవ్వకాల నుంచి శాసనాలు, నాణేల వరకూ రకరకాలుగా అధ్యయనాలు చేస్తూ.. చరిత్ర నిర్మాణానికి ఏ చిన్న ఆధారం దొరుకుతుందా? అని మూలాలను జల్లెడపడుతుంటారు. అయితే వీటిన్నింటికీ ఎన్నో పరిమితులున్నాయి. ముఖ్యంగా ఆదిమ మానవులు, జాతుల ఆవిర్భావం, వారి కదలికలకు సంబంధించి ఈ ఆధారాలేవీ కూడా కచ్చితంగా అక్కరకొచ్చేవిగా లేకపోవటం పెద్ద సమస్య! ఇప్పుడీ పరిమితులను ఎంతోకొంత అధిగమించి.. చరిత్ర క్రమంలో ఆదిమ కాలం నుంచి ఇటీవలి వరకూ కూడా మనుషుల కదలికలకు సంబంధించిన ఆనుపానులను పట్టుకునేందుకు అద్భుతంగా ఉపయోగపడుతోంది జన్యు విశ్లేషణ! నాటి మనుషులు, జాతులకు సంబంధించి ఏ చిన్న నమూనా లభ్యమైనా.. ఆ జన్యువులను విశ్లేషించటం ద్వారా వాళ్లకు సంబంధించిన సమాచారాన్ని కచ్చితత్వంతో పట్టుకునే వీలుండటం జన్యు విశ్లేషణల ప్రత్యేకత! అందుకే చరిత్ర వివాదాలను తీర్చేందుకు జన్యు పరిశోధనలు అక్కరకొస్తున్నాయి. ఆర్యులు, భారత ఉపఖండంలో ఆదిమ మానవుల ఆవాసాలు, కదలికలకు సంబంధించిన విలువైన ఆధారాలుగా కూడా జన్యువిశ్లేషణలు కొత్త ద్వారాలు తెరుస్తుండటం విశేషం. నిజానికి మన దక్షిణాసియా, మధ్య ఆసియా ప్రజలు ఎక్కడివారు, వీళ్లెక్కడి నుంచి పుట్టుకుని/వచ్చారన్న దానిపై ఇప్పటి వరకూ పూర్తి స్పష్టత లేదు. అందుకే దీని గురించి బోలెడన్ని చర్చలు, సిద్ధాంతాలున్నాయి. ఇది సామాజిక పరిస్థితులతో, స్థానిక రాజకీయాలతో కూడా బలంగా పెనవేసుకుపోయినది కావటంతో ఎవరి సిద్ధాంతాలను వాళ్లు తయారుచేసుకుంటున్నారు, ప్రచారం చేసుకుంటున్నారు. వీటిలో మచ్చుకు రెండు….

      నీలికళ్లు, తెల్లతోలు ఆర్యులు గుర్రాల మీద భారత ఉపఖండంలోకి దండెత్తివచ్చి.. కనబడిన వారినల్లా జయించుకుంటూ.. ఇక్కడి నాగరకతలను, పురాలను ధ్వంసం చేసుకుంటూ ఈ ప్రాంతాన్ని ఆక్రమించు కున్నారన్నది నాజీలతో సహా పలువురు చిరకాలంగా చెబుతున్న అంశం. మరోవైపు ఇటీవలి కాలంలో దీనికి పూర్తి విరుద్ధ సిద్ధాంతం ఒకటి విస్తృత ప్రచారంలోకి వస్తోంది.
      ఇండో-యూరోపియన్‌ భాషలను పరిశీలిస్తే అవన్నీ కూడా భారత ఉపఖండంలోనే పుట్టి.. ఇక్కడి నుంచే పాశ్చాత్య ప్రపంచానికి విస్తరించాయని అర్థమవుతోంది కాబట్టి మానవ నాగరకత భరత ఖండం నుంచే ప్రపంచమంతా విస్తరించింద న్నది వీరి వాదన. దీన్నే ఇప్పుడు ‘ఔట్‌ ఆఫ్‌ ఇండియా’ సిద్ధాంతం అంటున్నారు. పలువురు హిందూ సిద్ధాంత, ప్రచారకర్తలు బలంగా ప్రచారం చేస్తున్న అంశం ఇది.

      ….ఈ నేపథ్యంలో అసలు ఆర్యులు ఎక్కడివాళ్లు, వాళ్లు నిజంగా దండెత్తివచ్చి.. ముట్టడించి ఆక్రమించారా? లేక వలస వచ్చారా? (ఇన్వేజన్‌ /లేక/ మైగ్రేషన్‌) నేటి మన భారత ఉపఖండ ప్రజలెవరు? వీళ్లది మిశ్రమజాతా? ఒకవేళ అయితే ఇది ఏయే జాతుల మిశ్రమం? చిరకాలంగా చరిత్రకారులను వేధిస్తున్న ప్రశ్నలివి. తాజాగా 92 మంది అంతర్జాతీయ పరిశోధకులు లోతుగా శోధించి గత నెల వెలువరించిన జన్యు పరిశోధనా పత్రం ‘ద జెనోమిక్‌ ఫార్మేషన్‌ ఆఫ్‌ సెంట్రల్‌ అండ్‌ సౌత్‌ ఏషియా’ ఒక రకంగా ఈ చర్చలకు బలమైన సమాధానాలను పైకి తెచ్చింది. ప్రజా జన్యుపరిశోధకులు, పురాతత్వవేత్తలు, మానవ పరిణామ శాస్త్రవేత్తలు ఇలా.. భిన్న శాస్త్ర రంగాలకు చెందిన విఖ్యాత పరిశోధకులు పాల్గొన్న అధ్యయనం కావటంతో ఇది అంతర్జాతీయంగా కూడా ఆసక్తిని రేకెత్తిస్తోంది.ఏమిటీపరిశోధన?హార్వర్డ్‌ మెడికల్‌ స్కూల్‌ నుంచి మన సీసీఎంబీ వరకూ పలు విఖ్యాత సంస్థల శాస్త్రవేత్తలు పాల్గొన్న ఈ అధ్యయనంలో 612 మంది ప్రాచీనుల జన్యు నమూనాలను (అంటే డీఎన్‌ఏను) తీసుకున్నారు. ఇవి ఇరాన్‌, అప్ఘానిస్థాన్‌, ఉబ్జెక్‌, తజక్‌, కజకిస్థాన్‌, స్వాత్‌ లోయతో సహా పలు భారత ఉపఖండ ప్రాంతాలకు చెందిన ప్రాంతాల వారివి, అలాగే వీటిలో భిన్న కాలాలకు.. క్రీపూ 5,600 నుంచి క్రీపూ 1000 మధ్య కాలానికి చెందిన నమూనాలూ ఉన్నాయి. తర్వాత ఈ నమూనాలను నేటి ఆధునిక దక్షిణాసియా ప్రాంతవాసులైన 246 భిన్న జాతులకు చెందిన 1,789 మంది డీఎన్‌ఏ నమూనాలతో పోల్చి చూశారు. ఇలా ప్రాచీన-ప్రస్తుత డీఎన్‌ఏ నమూనాలను పోల్చటంవల్లే ఎక్కడివాళ్లు ఎలా ఉన్నారు? ఎవరు ఎట్నుంచి ఎటు మళ్లారు? వంటివి స్పష్టంగా తెలుస్తాయి. వీటిని విశ్లేషించి చూస్తే..తేలిందేమిటి?ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన ప్రాచీన వాసుల డీఎన్‌ఏలో కనిపించిన మార్పులను లోతుగా విశ్లేషిస్తే అర్థమయ్యేదేమంటే..
      1 ఆది వాసులు:దక్షిణాసియా ప్రాంతంలో మనకు ఆధారాలు లభించినంత వరకూ తొలి నుంచీ ఆవాసం ఉన్నవాళ్లు దక్షిణాసియా వేట, ఆహారసేకర్తలు. (వీళ్లకు వ్యవసాయం తెలియదు). ఇప్పటికీ అండమాన్‌ దీవుల వంటి చోట్ల వీళ్లను మనం చూడొచ్చు.2 తొలి వలస: క్రీ.పూ.7000 ప్రాంతంలో ఇరాన్‌ నుంచి వ్యావసాయిక ప్రజలు ఇక్కడికి వచ్చారు. వీళ్లే బార్లీ, గోధుమ, వరి వంటి పంటలను, సేద్య పద్ధతులను ఈ ఉపఖండానికి తీసుకొచ్చారు. ఈ రెండు జాతులకు చెందిన మిశ్రమంగా ఉనికిలోకి వచ్చినవాళ్లే ప్రధానంగా ఈ ప్రాంత వాసులు. అయితే.. ఆ తర్వాతి కాలంలో ఈ ప్రాంతంలో పెను మార్పు చోటుచేసుకుంది.3 మరో వలస:క్రీ.పూ.2000-1500 ప్రాంతంలో ఆఫ్ఘానిస్థాన్‌కు ఉత్తరాన ఉన్న విస్తారమైన గడ్డిభూముల నుంచి పశుపోషకులు హిందూకుష్‌ పర్వతాలు దాటుకుంటూ ఈ ప్రాంతానికి వచ్చారు.
      ఈ మూడు జాతులు రకరకాలుగా కలగలిసిపోవటం వల్ల ఉనికిలోకి వచ్చినవాళ్లే నేటి మన దక్షిణాసియా వాసులు. ఇప్పుడు మన దక్షిణాసియాలో వాసుల్లో ప్రతి ఒక్కరికీ మూలం ఈ జాతుల మిశ్రమంలో కనబడుతోందని జన్యుపటాలు స్పష్టంగా చూపిస్తున్నాయి.మరి ఆర్యులెవరు?
      క్రీ.పూ. 2000-1500 ప్రాంతంలో వచ్చిన వాళ్లే ఆర్యులు! రష్యా సైబీరియా పచ్చికమైదానాల నుంచి వచ్చిన ఈ పశుపోషకులు అప్పటికి ఇక్కడ ఉన్న జాతులపై పెద్ద ప్రభావమే చూపారు. నిజానికి వీళ్లు రావటానికి పూర్వమే ఇక్కడ ఎంతో ఉన్నతంగా అభివృద్ధి చెందిన నాగరకత ఒకటి విలసిల్లింది. అదే సింధు నాగరకత. సింధు నదీ పరివాహక సారవంతమైన భూముల్లో (ప్రస్తుత వాయవ్య భారతం, పాకిస్థాన్‌ ప్రాంతం) ఈ నాగరకత అప్పటికే బలంగా స్థిరపడింది. క్రీ.పూ.5500 నుంచీ ఇక్కడ మతపరమైన క్రతువులు జరుగుతున్నట్టు, క్రీ.పూ.4000 నుంచీ వ్యవసాయం చేస్తున్నట్లు, క్రీ.పూ.3000ల నుంచే ఇక్కడ పట్టణీకరణ జరిగినట్లూ ఆనవాళ్లున్నాయి. క్రీ.పూ. 2600 నాటికే ఇక్కడ డజన్లకొద్దీ పట్టణాలు, నగరాలు ఏర్పడినట్లు ఆధారాలు లభ్యమయ్యాయి. మొత్తానికి క్రీ.పూ. 2000 ముందు నాటికే.. అంటే ఆర్యులు రాకపూర్వం ఈ సింధు నాగరకత బ్రహ్మాండమైన ఉచ్చస్థితికి చేరింది. క్రీ.పూ. 2000-1500 మధ్య ఆర్యులు ఈ ఉపఖండంలో అడుగుపెట్టేశారు. జంతుపెంపకం బాగా తెలిసిన వీళ్లు తమతో గొర్రెలు, గుర్రాలు తెచ్చారు. ఇదో భారీ వలస! దీన్నే గత చరిత్రకారులంతా పెద్ద దండయాత్ర అంటుండేవాళ్లు. అసలు వీళ్ల వల్లే సింధు నాగరకత ధ్వంసమైపోయిందని చెప్పేవాళ్లూ ఉన్నారుగానీ నేటి చరిత్రకారులెవరూ దీన్ని విశ్వసించటం లేదు. ఎందుకంటే క్రీ.పూ.1900 నాటికే సింధునాగరకత పతనావస్థలో ఉందని చెప్పేందుకు ఆధారాలుదొరికాయి.మరి సింధునాగరకతా ప్రజలెవరు?ఆర్యులు రాకముందే ఉనికిలో ఉన్న ఈ సింధునాగరకతా ప్రజలు ఎవరన్నది కీలకమైన ప్రశ్న. మనకీ నాగరకతకు చెందిన వారి డీఎన్‌ఏ నమూనాలేవీ అందుబాటులో లేవుగానీ.. దీనికి చాలా దగ్గరగా ఉండే ప్రజల నమూనాలను తీసుకుని పరిశీలిస్తే… ఆదివాసులైన దక్షిణాసియా వేట, ఆహారసేకర్తలు.. ఆ తర్వాత వలస వచ్చిన ఇరాన్‌ వ్యావసాయిక జాతుల మిశ్రమంగా ఉనికిలోకి వచ్చినవాళ్లే ఈ నాగరకతకు చెందిన వాళ్లని చెప్పేందుకు బలమైన ఆధారాలు లభిస్తున్నాయి. ఇలా ఈ ప్రాంతంలో జాతుల మిశ్రమం అన్నది సింధు నాగరకతతోనే మొదలైంది.ఆర్యుల రాక తర్వాత ఏమయింది?ఆర్యుల రాక తర్వాత…ప్రధానంగా రెండు పరిణామాలు చోటుచేసుకున్నాయి.
      1. సింధు నాగరకతా ప్రజల్లో కొంతమంది ఉపఖండంలో మరింత దక్షిణానికి ప్రయాణించి.. అప్పటికే అక్కడున్న వారితో (దక్షిణాసియా వేట, ఆహారసేకర్తలతో) కలిసిపోయారు. వీళ్లనే ఇప్పుడు దక్షిణ భారతీయ పూర్వీక జాతి (యాన్‌సిస్ట్రల్‌ సౌతిండియన్స్‌-ASI) అంటారు.

      2. మరోవైపు సింధు నాగరకతకు చెందిన మరికొందరు అక్కడే ఉండిపోయి.. కొత్తగా వచ్చిన ఆర్యులతో కలిసిపోయి.. మరో వైవిధ్య బృందంగా ఏర్పడ్డారు. దీన్నే ఉత్తర భారతీయ పూర్వీక జాతి (యాన్‌సిస్ట్రల్‌ నార్తిండియన్స్‌-ANI) అంటున్నారు.
      ఇప్పుడు మన భారత ఉపఖండంలో ఉన్న ప్రతి ఒక్కరూ దాదాపుగా ఈ ASI, ANI జాతుల మిశ్రమంగా ఆవిర్భరించిన వాళ్లే!

      దీనర్థం ఏమిటి?ఈ పరిశోధనల సారాంశం క్లుప్తంగా చెప్పుకోవాలంటే..
      క్రీ.పూ.2000-1500 ఏళ్ల క్రితం వచ్చిన పశుపోషకులనే ఆర్యులనుకుంటే చరిత్రలో ఆర్యల వలస అన్నది కచ్చితంగా జరిగింది, వాళ్లు సింధు నాగరకతను, ఆ సంస్కృతిని గణనీయంగా ప్రభావితం చేశారు.
      ఇన్నాళ్లుగా ఇండో-యూరోపియన్‌ భాషా సిద్ధాంతాలను బట్టి భారత ఉపఖండం నుంచే ప్రజలు ప్రపంచమంతా విస్తరించారని చెబుతున్న ‘ఔట్‌ ఆఫ్‌ ఇండియా’ సిద్ధాంతం నిజం కాకపోవచ్చని ఈ పరిశోధన స్పష్టం చేస్తోంది. ఎందుకంటే తొలినాటి ఇరాన్‌ వ్యావసాయిక ప్రజల జన్యువులు చూస్తే వాళ్లలో దక్షిణాసియా వేట, ఆహారసేకర్తల జన్యువులతో కలగలిసిన దాఖలాలేవీ కనబడటం లేదు. కాబట్టి జన్యువుల ప్రయాణ క్రమాన్ని పరిశీలిస్తే అవి దక్షిణాసియాలోకి వచ్చినట్టే కనబడుతున్నాయిగానీ ఇక్కడి నుంచి బయటకు వెళ్లినట్టు దాఖలాలేవీ లేవని పరిశోధకులు వ్యాఖ్యానిస్తున్నారు.
      నేడు మన దేశంలోనూ, ఆ మాటకొస్తే భారత ఉపఖండంలో ఉంటున్నవారంతా కూడా కచ్చితంగా వివిధ జాతుల మిశ్రమంగా ఆవిర్భవించిన జాతే. గతంలో జరిగిన జన్యు అధ్యయనాల్లో కేవలం స్త్రీల నుంచే తర్వాతి తరాలకు సంక్రమిస్తుండే మైటోకాండ్రియల్‌ డీఎన్‌ఏ ఒక్కటే పోల్చి చూశారు. అది దాదాపుగా అందరిలోనూ ఒకేలా ఉండటంతో ఈ ఉపఖండంలో ఉంటున్న జనాభా అంతా కూడా వేలాది తరతరాలుగా ఇక్కడే ఉంటున్న మూలవాసులేనని భావిస్తుండేవారు. కానీ తాజా అధ్యయనాల్లో పురుషుల నుంచి సంక్రమించే వై-క్రోమోజోములను పరిశీలిస్తే ఇవి భిన్నంగా ఉంటున్నాయి. పైగా ఇరాన్‌, ఐరోపా, మధ్య ఆసియా ప్రాంత వాసులకు దగ్గరగా ఉంటున్నాయి. కాబట్టి మనది భిన్న జాతుల మిశ్రమం అని స్పష్టమవుతోంది.
      మన ఏకత్వంలో ఉన్న భిన్నత్వానికి అలలు అలలుగా వెల్లువెత్తిన ఈ వలసల చరిత్రే పునాది అనీ తేటతెల్లమవుతోంది!!

      ఈనాడు దినపత్రిక 27 మే 2018 ఆదివారం నాటి ప్రత్యేక కథనం యధాతధం.

      • దీనికి సమాధానంపురాతత్త్వ, భాషా, జన్యు వివరణలతో ఖండిస్తూ వచ్చిన ఈ వ్యాసం .. శ్రీకాంత్ తలగెరి **What is the Value of the New “Genomic Evidence” for the Aryan Invasion/Migration Theory versus the Out-of-India Theory? **
        చదివి సమాధానం వ్రాయవచ్చు ఎవరైనా.
        https://talageri.blogspot.com/2018/04/what-is-value-of-new-genomic-evidence.html

      • దయచేసి ఇంత సుదీర్ఘమైన కామెంట్స్ పోస్ట్ చేయవద్దు. వీలైనంత క్లుప్తంగా సూటిగా కామెంట్స్ రాయండి. పత్రికల లింక్ ఇస్తే చాలు. ఆ మొత్తం కథనం అక్కర్లేదు.

  • From page 68: ‘‘ఇన్ హూ అర్ ది సూడ్రాస్‘‘ బాబా సాహెబ్ says

    (1) The Vedas do not know any such race as the Aryan race.

    (2) There is no evidence in the Vedas of any invasion of India by the Aryan race and its having conquered the Dasas and Dasyus, supposed to be natives of India.

    (3) There is no evidence to show that the distinction between Aryans, Dasas and Dasyus was a racial distinction.

    (4) The Vedas do not support the contention that the Aryans were different in colour from the Dasas and Dasyus

    The erudite Babasaheb also goes further and reveals his deep knowledge of the Rig Veda. On pages 69-70 here’s what he says:

    Those who uphold the theory of an Aryan race invading India and conquering the Dasas and Dasyus fail to take note of certain verses in the Rig Veda. These verses are of crucial importance. To build up a theory of an Aryan race marching into India from outside and conquering the non-Aryan native tribes without reference to these verses is an utter futility. I reproduce below the verses I have in mind:

    (1) Rig Veda, vi. 33.3.—”Oh, Indra, Thou has killed both of our Opponents, the Dasas and the Aryas.”

    (2) Rig Veda, vi.60.3— “Indra and Agni—these protectors of the good and righteous suppress the Dasas and Aryas who hurt us.”

    (3) Rig Veda, vii.81.1.— “Indra and Varuna killed the Dasas and Aryas who were the enemies of Sudas and thus protected Sudas from them.”

    (4) Rig Veda, viii.24.27.—”Oh you, Indra, who saved us from the hands of the cruel Rakshasas and from the Aryas living on the banks of the Indus, do thou deprive the Dasas of their weapons.”

    (5) Rig Veda, X.38.3.—“Oh you much revered Indra, those Dasas and Aryas who axe irreligious and who are our enemies, make it easy for us with your blessings to subdue them. With your help we shall kill them.”

    (6) Rig Veda, X.86.19.—Oh, You Mameyu, you give him all powers who plays you. With your help we will destroy our Arya and our Dasyu enemies.

    Further examination of the Shudras as Non-Aryan community is provided on pages 86-89:

    On the question of the line of demarcation; between the Shudras and Aryans, the matter needs to be carefully examined. The strength of the argument that the Shudras were non-Aryans is to be found in the following statements:

    A.V., iv.20.4. — “The thousand-eyed god shall put this plant into my right hand; with that do I see everyone, the Shudra as well as the Arya.”

    Kathaka Samhita, xxxiv.5— “The Shudra and the Arya quarrel about the skin. The gods and the demons quarrelled about the sun; the gods won it (the sun). (By this act of quarrelling with Shudras) the Arya makes the Arya Varna win, makes himself successful. The Arya shall be inside the .altar, the Shudra outside the altar. The skin shall be white, circular- the form of the sun.”

    Vajasaneyi Samhita, xxiii.30 -31— “When a deer eats the barley in the field, the (owner of the field) is not pleased with the nourished animal; when a Shudra woman has an Arya as a lover, (the husband) does not long for (the consequent) prosperity. When a deer eats barley, the (owner of the field) does not approve of the nourished animal. When a Shudra is the lover of an Arya woman, the (husband) does not consent to the prosperity.

    These stanzas, which speak of the Shudra and the Arya as separate and opposed, form the foundation of the theory that the Shudras are non-Aryans. To say the least, such a conclusion would be a very hasty one. Two considerations must be borne in mind before any conclusion is drawn from the aforementioned statements. In the first place, it must be borne in mind that according to what has been said before and according to the evidence of the Rig Veda, there are two categories of Aryans, the Vedic and the non-Vedic.

    Given this fact, it would be quite easy for an Arya of one class to speak of an Arya of another class, as though the two were separate and opposed. Interpreted in this way, the above statements, in which Shudras are set against the Aryans, do not mean that they were not Aryas. They were Aryas of a different sect or class. That this is possible can be seen from the following statements in the sacred literature of the Hindus:

    A.V., xix.32.8- “Make me. Oh, Darbha (grass), dear to the Brahmin, and the Rajanya (i.e., Kshalriya), to the Shudra and to the Arya and to him whom we love and to everyone who is able to see.”
    A.V., xix.62.1 — “Make me beloved among the gods, make me beloved among the princes; make me dear to everyone who sees, to the Shudra and to the Arya.”
    Vajasaneyi Samhita, xviii.48— “(Oh, Agni), give to us lustre among Brahmins, give us luster among kings; lustre among Vaishyas and among Shudras; give to me lustre added to lustre.”
    Vajasaneyi Samhita, xx.l7— “Whatever sin we have committed in the village, in the forest, in the assembly, with our senses, against the Shudra or against the Arya, whatever sin one of us (two, the sacrificer and his wife) has committed in the matter of his duty (towards the other),— of that sin, you are the destroyer.”
    Vajasaneyi Samhita, xviii.48— “As I speak these auspicious words to the people, to the Brahmin and the Rajanya, to the Shudra and to the Arya and to my own enemy, may I be dear to the gods and to the giver of dakshinas here in this world. May this desire of mine be granted. May that (enemy of mine) be subjected to me.”

    What do these statements show? The first one makes a distinction between the Brahmins and the Aryas. Can it be said that the Brahmins were non-Aryans? The other statements pray for the love and goodwill of the Shudras. If the Shudra was a primitive aboriginal non-Aryan, is such a prayer conceivable? The statements on which reliance is placed do not prove that the Shudras were non-Aryans.

    It is also interesting to examine Dr. Ambedkar’s views regarding the clash between two civilizations. On page 70 he says:

    …..there were two different communities of Aryas who were not only different but oppose and inimical to each other. The existence of two Aryas is not a mere matter of conjecture or interpretation. It is a fact in support of which there is abundant evidence. The first piece of such evidence, to which attention may be invited, is the discrimination which existed for a long time in the matter of the recognition of the sacred character of the different Vedas. All students of the Vedas know that there are really two Vedas: (1) the Rig Veda and (2) the Atharva Veda. The Sama Veda and the Yajur Veda are merely different forms of the Rig Veda. All students of the Vedas know that the Atharva Veda was not recognised by the Brahmins as sacred as the Rig Veda for a long time. Why was such a distinction made? Why was the Rig Veda regarded as sacred? Why was the Atharva Veda treated as vulgar? The answer, I like to suggest, is that the two belonged to two different races of Aryans and it is only when they had become one that the Atharva Veda came to be regarded on a par with the Rig Veda.

    And on page 88, we have his analysis of the Dharma Sutras:

    That the Dharma Sutras call the Shudra Anarya and the statements in the Vajasaneyi Samhita pouring scorn on the Shudra woman, do not mean anything. There are two arguments against accepting the testimony of the Dharma Sutra. In the first place, as will be shown later, the Dharma Sutras and other treatises are books written by the enemies of the Shudra. As such, they have no evidentiary value. It is also doubtful whether such anti-Shudra statements are mere imprecations or statements of facts as they existed. They seem to contradict facts reported in other works.

    The Dharma Sutras say that a Shudra is not entitled to the Upanayana ceremony and the wearing of the sacred thread. But in Samskara Ganapati there is an express provision declaring the Shudra to be eligible for Upanayana.

    The Dharma Sutras say that a Shudra has no right to study the Vedas. But the Chhandogya Upanishad (iv:l-2) relates the story of one Janasruti to whom Veda Vidya was taught by the preceptor Raikva. This Janasruti was a Shudra. What is more is that Kavasha Ailusha, was a Shudra. He was a Rishi and the author of several hymns of the Tenth Book of the Rig Veda.

    The Dharma Sutras say that a Shudra is not entitled to the Upanayana ceremony and the wearing of the sacred thread. But in Samskara Ganapati there is an express provision declaring the Shudra to be eligible for Upanayana.

    The Dharma Sutras say that a Shudra has no right to study the Vedas. But the Chhandogya Upanishad (iv:l-2) relates the story of one Janasruti to whom Veda Vidya was taught by the preceptor Raikva. This Janasruti was a Shudra. What is more is that Kavasha Ailusha, was a Shudra. He was a Rishi and the author of several hymns of the Tenth Book of the Rig Veda.

    The Dharma Sutras say that a Shudra has no right to perform Vedic ceremonies and sacrifices. But Jaimini, the author of the Purva Mimarnsa mentions an ancient teacher by name Badari— whose work is lost— as an exponent of the contrary view that even Shudras could perform Vedic sacrifices. The Bharadvaja Srauta Sutra (v.28) admits that there exists another school of thought which holds that a Shudra can consecrate the three sacred fires necessary for the performance of a Vedic sacrifice. Similarly, the commentator of the Katyayana Srauta Sutra (1.4.16) admits that there are certain Vedic texts which lead to the inference that the Shudra was eligible to perform Vedic rites.

    • నేను ఈ విషయంలో అంబేడ్కర్‌తో విభేదిస్తాను. ఆయన వాదన నాకు నమ్మదగిందిగా అనిపించదు.
      భారతదేశం వునికి ఒకే జాతి సిద్దాంతంపై ఆధారపడిలేదు. భారతదేశం సకల జాతుల, భాషల, సంస్కృతుల సమ్మేళనం. అలాకాకుండా భారతీయులంతా ఒకే జాతి అని చెబుతూ, వాళ్ళంతా ఒకే మతాన్ని ఆచరించాలి, ఒకే తిండి తినాలి, ఒకే జంతువును ఆరాధించాలి, ఒకే చట్టం వుండాలి అనే వాళ్ళ వల్లనే దేశ సమగ్రతకు చేటు వుంది.
      ఈ దేశంలో ఆర్యులు, ద్రవిడులే కాదు ఇంకా ఆ తర్వాత వచ్చిన వేర్వేరు జాతులూ వున్నాయి. మనం వేర్వేరని ఒప్పుకుంటూనే ఒకరి అస్థిత్వాన్ని మరొకరు గౌరవిస్తేనే భారతదేశానికి సుస్థిరత. అదే భారతదేశం ప్రంపంచానికి ఇస్తున్న పిలుపు. అదే భారతదేశపు ఘనము, గొప్పదనము.

      • విభేదించడం కేవలం మాటలతోనే గాక అంబేడ్కర్ యిచ్చిన సాక్ష్యాధారాలను ఖండిస్తూ వ్రాయాలి. లేదా, ఇప్పటి పరిశోధనలు అంబేడ్కర్ ని ఏ విధంగా పూర్వపక్షం చేస్తున్నాయో వివరంగా వ్రాయాలి. పైన నేను మూడు విధాలైన సాక్ష్యాధారాలతో శ్రీకాంత్ తలగెరీ వ్యాసం యిచ్చాను. చదివి ఆ రంగంలోని వారెవరైనా దీనిని ఖండిస్తే అప్పుడు ఆర్య, ద్రావిడ వాదానికి బలం చేకూరుతుంది. కేవలం వ్యక్తిగత రాగద్వేషాల ఆధారంగా సిద్ధాంతాలను నమ్ముతూ దాని ఆధారంగానే సినిమాలు తీయకూడదు, వ్యాసాలు వ్రాయకూడదు, ప్రచారం చేయకూడదు. ఒకవేళ వ్రాసినట్లయితే తమ సిద్ధాంతం ఏ విధంగా శాస్త్రీయమో అది చెప్పాలి.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు