మన మతి తగ్గుతోందా?

టెక్నాలజీ మన పనులు సులువు చేస్తోంది దానితో పాటు తెలివిని తీసేస్తోంది కూడా!

మారుతున్న ఫ్లిన్ ఎఫెక్ట్ ట్రెండ్ అదే చెబుతోంది.

తాత అడిగిన ప్రశ్నకి 10 ఏళ్ళ మనవడు తికమక పడ్డాడు. ఎందుకంటే  తాత అతనిని “30 × 40 ” ఎంతా అని అడిగాడు. రాజు వెంటనే ఫోన్ తీసి కాల్కులేటర్ ఓపెన్ చేశాడు. తాత నవ్వుతూ  “నేను ఈ లెక్కను మనసులోనే చేసేవాడిని నీ వయసులో” అని అన్నాడు.

మనవడు అనుకున్నాడు “తాత హెచ్చులు చెబుతున్నాడు.” అని.  కానీ నిజంగా ఎక్కువ చెబుతున్నాడా? లేక మనం నిజంగానే ఉన్న మతిని వాడటంలేదా? ఈ కాలం కన్నా ఆ కాలంలోనే తెలివితేటలు ఎక్కువ ఉన్నాయా? ఇప్పుడు ఈ ప్రశ్నలు మనం మనల్ని అడగాల్సిన అవసరం ఉంది.

Flynn Effect అంటే ఏమిటి?

Flynn Effect అనేది IQ స్కోర్లు గురించిన ఒక ఆసక్తికరమైన విషయం.  20వ శతాబ్దం అంతా IQ స్కోర్లు పెరుగుతూనే వచ్చాయి. దీని వెనుక ప్రధాన కారణం- తల్లిదండ్రుల్లో పెరిగిన చదువు పట్ల అవగాహన. మన అమ్మలు మన చదువు గురించి ఎంత జాగ్రత్తగా చూసుకునేవారో మనందరికీ తెలుసు కదా! ఇంటింట్లో పుస్తకాలు పెరిగాయి, పిల్లలను స్కూల్‌కి  పంపాలనే అవగాహన వచ్చింది, ఎక్కువ మంది గ్రాడ్యుయేట్ అయ్యారు – ఇవన్నీ కలిసి మన IQ లెవల్స్ పెరిగాయి.

కానీ ఇప్పుడు ఏం జరుగుతోంది?

ఈ తరం పిల్లల కథ చూస్తే మనకు భయం వేస్తుంది. ఇప్పుడు మాత్రం కథ వేరుగా మారుతోంది. Flynn Effect రివర్స్ అవుతోంది – అంటే IQ స్కోర్లు తగ్గుతున్నాయి!

ఇది కేవలం అనుమానం కాదు – ఇది శాస్త్రీయ వాస్తవం. Northwestern University లో జరిపిన ఒక అధ్యయనం షాకింగ్ విషయాలు చెబుతోంది. 2006 నుంచి 2018 వరకు అమెరికాలో 39,000 మంది పై జరిపిన పరిశోధనలో కనిపించింది ఏమిటంటే:

  • Verbal reasoning (మాటల లాజిక్) తగ్గుతోంది
  • Matrix reasoning (ప్యాటర్న్‌లు  గుర్తించడం) దిగుతోంది
  • Letter & number series (అక్షరాలు, సంఖ్యల క్రమాలు) లో కూడా స్కిల్ తగ్గుతోంది

 ఎందుకు ఇలా జరుగుతోంది?

పైన కథ వినడానికి సరదాగా అనిపించవచ్చు, కానీ ఇది మనందరి కథ. Flynn  Effect అనేది IQ స్కోర్లు గురించిన ఒక ఆసక్తికరమైన విషయం.

మన తల్లితండ్రుల కాలంలో కేవలం 20% మంది మాత్రమే హైస్కూల్ పాస్ అయ్యేవాళ్ళు. కానీ వాళ్ళ అవగాహనకి కారణంగానో, కష్టానికి ఫలితమో మనం 90% మంది గ్రాడ్యుయేట్లు అయ్యాం. దీని ఫలితమే – 20వ శతాబ్దం అంతా IQ స్కోర్లు పెరుగుతూనే వచ్చాయి.

గణాంకాలు చూస్తే – ప్రతి దశాబ్దానికి సరాసరిగా 3 పాయింట్లు IQ పెరిగింది. దీని వెనుక ప్రధాన కారణం తల్లిదండ్రుల్లో పెరిగిన చదువు పట్ల అవగాహన. మన అమ్మలు మన చదువు గురించి ఎంత జాగ్రత్తగా చూసుకునేవారో మనందరికీ తెలుసు కదా! ఇంటింట్లో పుస్తకాలు పెరిగాయి, పిల్లలను స్కూల్కి పంపాలనే అవగాహన వచ్చింది, ఎక్కువ మంది గ్రాడ్యుయేట్ అయ్యారు – ఇవన్నీ కలిసి మన IQ లెవల్స్ పెరిగాయి.

 1. టెక్నాలజీ మీద ఆధారపడటం – మన మెదడుకు విషం

మనం అన్నింటికీ గూగుల్ని అడుగుతున్నాం. చిన్న చిన్న లెక్కల కు కాల్కులేటర్ వాడుతున్నాం. GPS లేకుండా రోడ్ గుర్తుపట్టలేం. ఫోన్ నంబర్లు గుర్తుంచుకోలేం.  మన తాతలు వేలాది మంది పేర్లు, చిరునామాలు మనసులో పెట్టుకునేవాళ్ళు. కానీ మనం మన కొత్త కొల్లీగుల పేరు గుర్తుంచుకోవాలంటే ఫోన్లో సేవ్ చేసుకుంటాం. అలా నెమ్మదిగా చాపకింద నీరులా మెదడు వాడకం తగ్గుతూ వచ్చింది

2. Soft Skills మీద దృష్టి – తర్కం మర్చిపోతున్నాం

ఆ కాలంలో గణితం, సైన్స్, లాజిక్ ప్రధానం. కానీ ఇప్పుడ స్కూళ్ళల్లో “కమ్యూనికేషన్ స్కిల్స్”, “టీమ్ వర్క్”, “లీడర్‌షిప్” అని చెప్పి అసలు పదునైన తర్కం, గణితం వంటివి రెండో స్థానంలో పెట్టేస్తున్నారు. మంచి విషయమే కానీ, బేసిక్ స్కిల్స్ లేకుండా ఇవన్నీ గాలిలో కోట కట్టడం లాంటిది.

3. ప్రాజెక్ట్ బేస్డ్ లర్నింగ్ – లోతు మర్చిపోతున్నాం

ఇప్పుడంతా “ప్రాజెక్ట్లు” చేయాలని, “ప్రాక్టికల్” గా నేర్చుకోవాలని అంటున్నారు. Google లో సెర్చ్ చేసి ప్రెజెంటేషన్ చేస్తే చాలని అనుకుంటున్నాం. కానీ బేసిక్ లాజిక్, మెమరీ, ఏకాగ్రత వంటివి పెట్టుకోవడంలేదు.

 మరిన్ని రుజువులు

కేవలం IQ టెస్ట్లు మాత్రమే కాదు, శరీరంలో మార్పులు కూడా దీనికి రుజువుగా నిలుస్తున్నాయి:

  • Reaction time (తక్షణం స్పందించడం) తగ్గుతోంది
  • Color acuity (రంగులను సరిగ్గా గుర్తించడం) దిగజారుతోంది

ఇవన్నీ మన మెదడు పనితీరు తగ్గుతోందని చెబుతున్నాయి

మనం ఏం చేయాలి?

భయపడాల్సిన అవసరం లేదు, కానీ జాగ్రత్తగా ఉండాలి:

పిల్లలకు స్మార్ట్‌ఫోన్ ఇవ్వకముందు ఆలోచించండి. పుస్తకాలు చదివే అలవాటు చేయాలి.  ఎన్ని కంప్యూటర్లున్నాగణితం, లాజిక్ వంటివి నేర్పించాలిమొత్తానికి బేసిక్ స్కిల్స్ పునాది గట్టిగా ఉండాలి. ఎలా అంటే సెల్ఫ్ డ్రైవింగ్ కారు ఉంది కదా అని మనిషికి అసలు డ్రైవింగే రాకపోతే కష్టం.

టెక్నాలజీ మన పనులు సులువు చేస్తోంది దానితో పాటు తెలివిని తీసేస్తోంది కూడా!

*

విజయ నాదెళ్ళ

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు