కవి కావడం చాలా సులువు
అందమైన భావాలను
పొందికగా పర్చొచ్చు
అందరూ మెచ్చే అభిప్రాయాలను
ఇటుకలుగా పేర్చచ్చు
మనం అనుకుంటున్నట్లుగా
మన ఆలోచనలుగా ఎన్నైనా
కలిపి సిమెంట్ పూత పూయొచ్చు
చదివితే అవునుకదా అనిపించే
మంచి రంగులద్దచ్చు
శిలల నుంచి కూడా
మంచు బిందువులను సృష్టించవచ్చు
కొండల్ని కరిగింప జేయవచ్చు
కొండలూ కరగవచ్చు
ఒకటేమిటి
కవిగా ప్రతిసృష్టి చేయవచ్చు
వెనక్కితిరిగి చూసుకొంటే …..
మనిషి కావడమే చాలా కష్టం
మనిషిగా తయారవడం కష్టం
అందరూ కవులే
మనుషులెవరూ లేరు
*
మనిషి నీ సృష్టించేది కవి యే
Harsh reality
సకల శాస్త్రాల సారాన్ని సూటిగా చెప్పారు. మంచి కవిత. వసంత గారికి అభినందనలు.
కవులు కావడం తేలికే. మనుషులు కావడమే కష్టం.
ఇప్పటి సాహిత్యకారుల్ని చూస్తే ఈ నిజం మరీ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది.
చేదు నిజాన్ని నిర్భయంగా చెప్పారు. అభినందనలు వసంతక్కా!