మనసు కరిగించే కథ…

Roman Charity అనే తైలవర్ణ చిత్రాన్ని  Peter Paul Rubens 1612 లో చిత్రించాడు. బ్రస్సెల్స్ లోని Koblenz సేకరణ నుంచి 1768 లో, Hermitage Museum, St.Petersburg కొరకు ఈ చిత్రాన్ని కొన్నారు. అతి పెద్దది, పురాతనమైనదీ ఐన హెర్మిటేజ్ సంగ్రహాలయాన్ని 1754 లో కాథరిన్ రాణి (1762-1796) నెలకొల్పారు. 1852 లో ఈ సంగ్రహశాలను ప్రజల దర్శనార్థం తెరిచారు. కాథరిన్ తన హయాం లో ఎన్నో విద్యా సంస్కరణలు తెచ్చారు. ఎందరో చిత్రకారులు, శిల్పులు, కళాకారులు ఇంకా భవన నిర్మాణ మర్మమెరిగిన వాస్తుశిల్పులను, విదేశాలనుంచి పీటర్స్బర్గ్ పట్టణానికి అహ్వానించి, పట్టణాన్ని సాంస్కృతిపరంగా, కళామయంగా తీర్చిదిద్దారు.  

 ఈ చిత్రం శృంగార చిత్రం కాదు. నిజానికి, Cimon, Pero ల కథ హృదయాలను ద్రవింపచేసేది. కీమోన్, Rome లో, రొట్టెను దొంగిలిస్తుండగా పట్టుబడతాడు. అతనికి ఆకలితో చచ్చిపోయేలా, శిక్షవేసి, కారాగారంలో వుంచుతారు. కూతురు పేరొ తన తండ్రిని చూడాలని ఖైదు వద్దకు వస్తే, అక్కడి అధికారులు అనుమతి లేదని ఆమెను తిప్పిపంపుతారు. పేరొ, ఖైదులోని పై అధికారులను బ్రతిమలాడి, తండ్రిని చూడటానికి వారిని ఒప్పిస్తుంది. అయితే,ఆహారం,నీరు తనతో లోపలకు తీసుకెళ్ళకూడదనే షరతు పెడ్తారు. ఖైదులో ఆకలితో అలమటిస్తున్న తండ్రిని చూసి ఆమె హృదయం క్షోభిల్లుతుంది. ఆ సమయంలో ఆమె ఒక చిన్న పిల్లవాడి తల్లి. తన చనుబాలతో తండ్రికి తల్లిగా, ఆకలి తీర్చి, తన ఇంటికి వెళ్తుంది.

పేరొ తరచుగా ఖైదుకు వచ్చి, తన తండ్రి ఆకలి తీరుస్తూ ఉండేది. కీమోన్ ను, నాలుగు నెలలు, జైలులో నిరాహారంగా ఉంచినా, అతను మరణించకుండా,  ఎలా వున్నాడో అధికారులకు అంతుబట్టదు. ఒకసారి పేరొ వచ్చినప్పుడు, ఖైదు కాపలాదారులు ఆమె చర్యలను రహస్యంగా బయట దాక్కొని గమనిస్తారు. తన చనుబాలను తండ్రికి ఇస్తుండగా, ఖైదు అధికారులు ఆమెను పట్టుకుంటారు. అయితే, పేరొ కు తండ్రిపై కల అవ్యాజ్యప్రేమకు ముఖ్య పరిపాలనాధికారి,  దిగ్భ్రాంతి చెంది, ఆమెను, కీమోన్ ను విడిచిపెడ్తారు. ఈ చిత్రం Daughter Breastfeeding her Father in a Dungeon గా ప్రసిద్ధి చెందింది. రోమన్ రచయిత Valerius Maximus వెలువరించిన Nine Books of Memorable Acts and Sayings of the Ancient Romans  ద్వారా ఖైదీ ఐన తండ్రికి పాలుపట్టిన కూతురు కథ వెలుగులోకి వచ్చింది. ఈ కథ ఆధారంగా David’t KIndt  వెలువరించిన శిల్పాన్ని Botermarkt 17, Ghent, Belgium లో నగర పాత ఖైదు, ప్రవేశద్వార పై భాగంలో చూడవచ్చు.

1607 సంవత్సరం లో Caravaggio అనే చిత్రకారుడు ఈ కథ ఆధారంగా తొలి చిత్రాన్ని చిత్రించాడు అని ఇధమిత్తంగా చెప్పలేము. అతని చిత్రాన్ని చూసి ఎందరో చిత్రకారులు ప్రేరేపితులయి పెద్ద కాన్వాస్ వస్త్రం పై వారి చిత్రాలు గీయసాగారు.  తాజాగా ఒక చిత్రం 30 మిలియన్ యూరోలకి  (అంటే, మన రూపాయిలలో 266 కోట్లు) అమ్ముడయ్యింది అని facebook, WhatsApp లాంటి సామాజిక మాధ్యమాల లో ఒక సందేశం విస్తృతంగా ప్రచారం అయ్యింది. అయితే అది నిజం కాదు.     

30 మిలియన్ యూరోలకి అమ్ముడయ్యింది అని పేర్కొన్న చిత్రానికి చిత్రకారుడు French painter, Jules Joseph Lefebvre. ఈ చిత్రం ఇంత ధరకు ఎప్పుడూ అమ్మబడలేదు. ఫ్రెంచ్ ప్రభుత్వం 1864 లో 1500 ఫ్రాంకులకు దీనిని కొని, Melun Museum లో 1865 లో ప్రదర్శనకు ఉంచింది. తరువాత దీనిని Melun City Hall కు విరాళమిచ్చింది. ఈ చిత్రాన్ని అక్కడి వివాహ సభామందిరంలో చూడవచ్చు.    

Roman Charity చిత్రాన్ని పలువురు చిత్రకారులు, కొన్ని వందల సంవత్సరాలుగా  చిత్రిస్త్తున్నారు. అవి ఎందరి చేతులో మారి, అనేక విక్రయాలకు నోచుకున్నాయి. తాజాగా sothebys.com లో, పారిస్ చిత్రకారుడు Jean-Baptiste-Marie-Pierre (1714-1789) చిత్రించిన చిత్రం వేలానికి ఉంది. తైలవర్ణ చిత్రం 49.4 X 37.25 అంగుళాలు. వారు ఆశిస్తున్న ధర 30,000 నుంచి 50,000/- అమెరికన్ డాలర్లు. ఆసక్తి ఉన్నవారు అక్టొబర్ 22, 2023 లోపు వేలంలో పాల్గొనవచ్చు.

    ఈ దిగువ చిరునామాలో Roman Charity చిత్ర ప్రతిని, కళాభిమానులు  కొనుగోలు చేయవచ్చు. ఒక్కోప్రతి, పరిమాణాన్ని బట్టి, ​​292 రూపాయలనుంచి 12096 రూపాయలు దాకా   అందుబాటులో ఉన్నది.

https://www.tallengestore.com/products/roman-charity-caritas-romana-art-prints

*

సి.బి. రావు

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు