హారం
——
మనుషుల గుంపు హఠాత్తుగా వీధి ఎడమవైపుకు తిరగ్గానే వారి కోపం అక్కడ ప్రతిష్టించబడిన గొప్ప హిందూ సమాజ సేవకుడైన సర్ గంగారాం పాలరాతి ప్రతిమ మీదకు వెళ్ళింది.
ఆ గుంపులో ఒకడు ఆ ప్రతిమ ముఖానికి నల్లని తారు పులిమాడు. ఇంకొకడు ఆ ప్రతిమ మెడకు ఓ చెప్పుల దండ
అలంకరించబోతూవుండగా, తుపాకీలు పేలుస్తూ అదుపు చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగారు.
చెప్పుల దండ చేతిలో వున్న వ్యక్తికి తుపాకీ గుండు తగిలింది.
వెంటనే పోలీసులు ఆ వ్యక్తిని పక్కనే వున్న గంగారాం ఆసుపత్రికి తరలించారు.
కృతజ్ఞత లేని వాళ్ళు
————————–
“ఏమి కృతజ్ఞతలేని దేశం ! ఎన్నో కష్టాలకు గురై యాభై పందులను ఈ మసీదులో నరికాను కానీ ఏం జరిగింది ?
కొనుక్కోవడానికి ఒక్క వెధవా రాలేదు. !
కానీ మీకు తెలుసా ?
ఆ వైపు మాత్రం ప్రతీ గుడి దగ్గరా ఆవు మాంసం కోసం ప్రజలు
బారులు కడుతున్నారు. హు !”
పఠానిస్తాన్
————–
“ఏయ్ నువ్వూ ?
“నువ్వెవరు !
“నేనా ! నేనా !”
“నువ్వే ! దెయ్యం పిల్లాడిలా వున్నావ్ ఇండూవా ? ముసల్మీన్వా ?”
“ముసల్మీన్”
“నీ ప్రవక్త ఎవరు!”
“మహమ్మద్ ఖాన్”
“అతడిని వెళ్లిపోనివ్వండి !”
*
Sadat Hasan Manto.. సమాజానికి భయపడని రచయిత. నేటి ఔత్సాహిక రచయితలు చదవవలసిన రచయిత. నా రచనల్లో నీకు తప్పు కనిపిస్తోంది అంటే నీ సమాజమే తప్పు కాబట్టి… అని సమాజంలోని కుల మత భేదాలను, మనష్యుల్లో పేరుకుపోయిన మురికిని యెత్తి చూపించిన వ్యక్తి.
ఆయన రాసిన బొంబాయి స్టోరీస్ చదివాను. కానీ ఎందుకో పెద్దగా రుచించలేదు. ఇక అదే భావనతో మిగతా పుస్తకాల జోలికి పోలేదు.
కానీ మీరు చేస్తున్న ఈ మినీ కథల పరిచయాలు చూసాక, ఈ మెరుపు కథలు చదివాక, ఎంత లోతైన భావాలు, ఇంకెంతో నిగూఢ అర్థాలు తెలుసుకున్నాక, ఒక మెతుకు చూసి పూర్తి అన్నాన్ని అంచనా వేయడం సబబు కాదని అర్ధం అయ్యింది. ఇంకొన్ని మంటో రచనలు చదవాలని గ్రహించాను. మీ మెరుపు కథలకోసం వేచి చూసేలా చేస్తున్నారు. భావాలను వెల్లడించడానికి పెద్ద పెద్ద వాక్యాలే అక్కరలేదని, ఇంత చక్కటి కథల్లో చెప్పిన మాంటో గారికి, వాటిని తెలుగనువదించి మాకోసం అందిస్తున్న మీకు
ధన్యవాదాలు అండి
superb sir… 🙂 thank you for manto’s stories….