భూమి నుండి ఆకాశందాకా
ఆకాశం నుండి భూమి దాకా
సైన్స్ లేని చోటంటూ
ఒకటుంటుందా
సీతాకోకచిలుక భుజం మీదికొచ్చి
వాలటంలోను
నక్షత్రాలు మిణుకు మిణుకు మనటంలోను
నేలమీది రాకెట్
నింగిలోకి దూసుకెళ్ళటంలోను
సూర్యుడు తూర్పున ఉదయించటంలోను
చంద్రుడు వెన్నెలను ప్రసరించటంలోను
సముద్రంలో జీవిస్తున్న చేపపిల్ల
శ్వాసించటం లోను
సైన్సే కదా ఉంది
పారుతున్న నది గమనానికి గుర్తు అని
ఎగురుతున్న పక్షి రెక్కలు
విమానయానానికి నమూనా అని
సాక్ష్యం చూపించేది సైన్సే
మబ్బుల మధ్యలోంచి పుట్టుకొచ్చే
ఇంద్రధనుస్సు
చెట్ల ఆకుల మీద ఆగి చూసే
గోళాకార చినుకులు
సైన్స్ కు ప్రతిరూపాలు
పంటను తినేసే పురుగుకు
మందును కనిపెట్టటం
ఎండిన ఆకుల కుప్పల్లోంచి
ఎరువును పుట్టించడం లాంటి
ఎన్నో ఎన్నో
నూతనావిష్కరణా పువ్వులు
ఈ విజ్ఞాన శాస్త్రతోటలో
తీగలుగా పారుతూ
కొండలను, లోయలను
చెట్లను, పుట్టలను
ఎడారులను,శుష్క పత్రాలను
దేన్ని వదిలిపెట్టిందని
దిక్కుల్లోంచి దౌడుతీస్తున్న
తెల్లని గుర్రాల్లా
నల్లని చుక్కను దిష్టిగా పెట్టుకున్న
వెన్నెలబొమ్మలా
ఇంకా వెలుగుతూనే ఉంది
ప్రకృతి రహస్యాల పొట్లం విప్పేలా
నవోత్తేజ నవోదయ దీపాలను
వెలిగిస్తూనే ఉంది.
అద్భుతంగా రాశారు చాలా బాగుంది అభినందనలు….
You developed well in writing telugu poetry all the best wishes from my side & excepting more &more Ethical ,Humanism should be appear in your
KAVANAM that’s all
Rising poet do best