సారంగ చానెల్ లో చూడండి, వినండి. subscribe చేయండి
భాస్కర్ రాయవరం, సిలికానాంధ్ర మనబడిలో ఉపాధ్యక్షులుగా స్వచ్ఛంద సేవ చేస్తూ, ప్రస్తుతం మనబడి పిల్లల ప్రతిభా వికాసాల కోసం బాలచంద్రిక అన్న కార్యక్రమాలకి క్రియాశీలక నాయకత్వం వహిస్తున్నారు. గత పద్దెమినిదేళ్ళుగా మనబడిలో పాఠ్యపుస్తకాల తయారీలో, బాలరంజని, ప్రాచుర్యం, బాలానందం, తెలుగు మాట్లాట, ఇంటింటా మనబడి, తెలుగుకు పరుగు కార్యక్రమాలతో బాటూ, డాలస్ మహానగరంలో, ఇంకా అమెరికాలో పలు నగరాలలో, అంతర్జాతీయంగా మనబడి విస్తరణలో విశేష సేవలందించారు.
రంగస్థల కళాకారుడిగా సరిసిజ థియేటర్స్ ద్వారా పలుపాత్రలు పోషించారు. 18 ఏళ్ళుగా అమెరికాలో రేడియో వ్యాఖ్యాతగా పలు కార్యక్రమాలు చేస్తూ, టాంటెక్స్ వారి గానసుధతో మొదలు పెట్టి, టొరీలో, ఇప్పుడు రేడియో సురభిలో ప్రధాన వ్యాఖాతగా చేస్తున్నారు. పలు దేవాలయాలలోజరిగే అధ్యాత్మిక కార్యక్రమాలలో ప్రవచన యుక్త వ్యాఖ్యాతగా సేవలందిస్తున్నరు. సోషల్ మీడియాలో ప్రభావిత వ్యక్తిగా, ఆరోగ్యమే మహాభాగ్యమన్న సూత్రాన్ని, నిత్య వ్యాయామ ఆచరణ విధానాలని సూత్రం ప్రాయంగా వేలమందికి తెలియజేస్తున్నారు.
గత ఐదేళ్ళుగా “బీప్లస్ విత్ భాస్కర్” అనే యూట్యూబ్ చానెల్ లో 1200+ పైగా కథలని కథాకళ ద్వారా, ఇంకా, పద్యలహరి, లలితభారతి వంటి వినూత్నమైన కార్యక్రమాల ద్వారా వేల కొలదీ పద్యాలు, లలితగీతాలు అందిస్తూ, ప్రపంచ వ్యాప్తంగా అనిర్వేద జీవనవిధాన వ్యాప్తికై కృషి చేస్తున్నారు. రచయితగా,పలు నాటకాలు, కవితలు, కథలు రాయడంతో బాటూ, ప్రపంచ కథాసంప్రదాయలపై పరిశోధన చేస్తున్నారు, సిలికానాంధ్రా విశ్వవిద్యాలయంలో తెలుగు స్నాతకోత్తర విద్యని పూర్తి చేసారు.
తను ఇప్పుడు డాలస్ నగరంలో ఉంటూ, పలు అంతర్జాతీయ సంస్థలలో సీనియర్ సాంకేతిక నాయకులుగా బాధ్యతలు వ్యవహరిస్తున్నారు. తన ధర్మపత్ని శ్యామల రాయవరం ఐటీ నిపుణురాలు, అబ్బాయి స్నేహిత్ రాయవరం జార్జియా టెక్ లో కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్, బేఏరియాలో కృత్రిమమేధకు చెందిన కొత్త సంస్థలో పని చేస్తున్నారు.
Add comment