పట్టాలు మారుతున్న రైలు పెట్టెల్ని చూస్తే
గుండె జల్లుమంటుంది
చనిపోతానని భయమా అనిఅడగొద్దు
పొయాక ఎలాగూ ఉద్వేగాలు ఉండవు కనుక
ఇంటిదగ్గర చందమామల కోసం బెంగ
ప్రతీ రైలు పడిపోదని తెలుసు
కానీ పడిపోయే రైలులో
నేనుండకూడదనుకుంటూ గుబులు పడుతుంటాను
మనచేతుల్లో లేనిది కాలమే కదా
నేను చేరుకోవల్సిన గమ్యం చేరుకోగానే
వదిలిపోతున్న రైలుని తదేకంగా చూస్తాను..
అది గమ్యం వరకు
జాగ్రత్తగా చేరుకోవాలని మనసులోనే కోరుకుంటాను.
ఇంటికి చేరుకున్న నన్ను
నా కుతురడుగుతుంది ఏం తెచ్చావని ??
గుండెలో చుట్టుకున్న
దిగులు మిఠాయి పొట్లాన్ని
నవ్వులతో మూటకట్టి
తన చేతిలో పెట్టేస్తాను
నిశ్చింతగా..
*
Good One Sai Dada…Keep writing
Good one
చాలా బాగుంది..