“బారిష్టర్ పార్వతీశం”తో మా ప్రయాణం

తెలుగు నాటకాలలో ఇప్పటివరకూ ప్రయోగించని సాంకేతిక నిపుణత చూపించాము.

దేవరకొండ సుబ్రహ్మణ్యం & శివప్రసాద్ తూము (నాటకీకరణ & దర్శకత్వం)

మొక్కపాటి నరసింహశాస్త్రి గారు రచించిన బారిష్టర్ పార్వతీశం   తెలుగు సాహిత్యంలో ప్రసిద్ధమయిన హాస్య నవల. మొక్కపాటి నరసింహ శాస్త్రి గారు (1892-1973) పశ్చిమ గోదావరి జిల్లాలోని మొగల్తూరు దగ్గర గండ్రేడు గ్రామం లో జన్మించారు. 1913-17 కాలంలో ఏడింబరో యూనివర్సిటీ లో న్యాయశాస్త్రం అండ్ వ్యవసాయ శాస్త్రం లో నైపుణ్యం సాధించడానికి ఇంగ్లాండ్ వెళ్ళి మధ్యలో చదువు ఆపి భారతదేశం తిరిగి వచ్చేశారు. ఆయన కొంతకాలం బందర్ కాలేజీలో పనిచేశారు.మొక్కపాటి నరసింహశాస్త్రి గారు , “పిలక”, “నేనూ మా ఆవిడ “. “లక్ష్మి”, కన్నవి-విన్నవి”, “ప్రతిబింబాలు”, “బిక్షువు”, “గాజులపాలెం గాంధీ”,  “బండ సుబ్బడు” మొదలగు రచనలు. ఈయన రచనలన్నిటి లోనూ బారిష్టర్ పార్వతీశం నవలకు ఎక్కువ పేరొచ్చింది.

బారిస్టర్ పార్వతీశం దేశ స్వాతంత్ర్య పూర్వ కాలపు నవల. గోదావరి జిల్లాల బ్రాహ్మణ పిల్లవాడు, ఎలా సముద్రాలు దాటి లండన్ చేరి న్యాయ విద్యలో బారిస్టర్ పట్టా పుచ్చుకుని తిరిగి స్వదేశం వచ్చాడో చెప్పే కథ. బొత్తిగా విదేశాల సంస్కృతి, పద్ధతులు తెలియని ఈ యువకుడు అక్కడకు ఎలా చేరాడు, ఎలా మొదట్లో కొంత తడబడ్డా , తిరిగి, తన చురుకైన బుద్ధితో అక్కడ పద్ధతులు, నడవడిక నేర్చుకుని, సఫలత తో తన దేశానికి చేరాడో, కొంత హాస్యరస మేళవింపు తో ఎలాంటి చదువరులనైనా అలరించే చక్కని రచన. ఈ నవలను శాస్త్రి గారు 3 బాగాల్లో రాశారు. వీటిలో మొదటి భాగం రెండవ భాగం పార్వతీశం ఇంగ్లాండ్ ప్రయాణం అక్కడ అతని జీవితం ఉండగా 3 వ భాగం లో అతను తిరిగి స్వదేశం తిరిగి రావడం లాయర్ గా ప్రాక్టీస్, పెళ్లి చేసుకోవడం తర్వాత స్వాతంత్రోద్యమంలో పాల్గొనడం చిత్రింపబడ్డాయి.

 బారిష్టర్ పార్వతీశంసంక్షిప్త నాటక కధ

ఈ నవలను కుదించి 90 నిముషాల TRAVELOGUE గా తయారు చేశాడు దర్శకుడు శివప్రసాద్, ఈ ఆధునిక నాటకం పార్వతీశం కథన స్వరంలోనే నడుస్తుంది. సూక్ష్మంగా నాటక కధ.

పార్వతీశం, బారిష్టరీ చదువుకోసం లండన్ కి ప్రయాణమై వెడతాడు . ఇదివరకెప్పుడూ తాను ఉన్న ఊరును(మొగల్తూరు) కూడా దాటని పార్వతీశం తన అమాయకత్వంతో తాను ఇబ్బంది పడుతూ ఎదుటివారిని కూడా ఇబ్బంది పెడుతుంటాడు. ఎలాగోలాగా లండన్ చేరుకున్న పార్వతీశం , అక్కడ దొరికిన ఒక స్నేహితుడి సలహా పై. ఉన్నత చదువుకోసం ఏడింబరోకు ప్రయాణమవుతాడు. అక్కడ ఉన్నంత కాలం అక్కడి ఆచార వ్యవహారాలు , సంస్కృతి అభివృద్ధీ అన్నీ పార్వతీశానికి వింతగా తోస్తాయి ఆక్కడ ఒక యువతితో పరిచయం ప్రేమగా మారడంతో పార్వతీశం ఎటూ తేల్చుకోలేక సందిగ్ధం లో పడిపోతాడు . విజయవంతం గా బారిష్టరీ చదువు పూర్తి చేసుకొని తిరిగి మొగల్తూరు ప్రయాణమవుతాడు. భారత దేశానికి తిరిగివచ్చిన పార్వతీశం ఒక బాధ్యతాయుతమైన పౌరుడిగా, న్యాయవాదిగా,జాతీయోద్యమం లో చురుగ్గా పాల్గొని జైలుకి వెడతాడు. దేశానికి స్వాతంత్రం సిద్ధించాకా పార్వతీశం ఇచ్చిన ఉపన్యాసంతో నాటకం ముగుస్తుంది .

ఈ నాటక ప్రదర్శనలో మేము  తెలుగు నాటకాలలో  ఇప్పటివరకూ ప్రయోగించని సాంకేతిక నిపుణత చూపించాము.

నాటకం మొత్తం “ప్రయాణం” చుట్టూ తిరుగుతుంది. అది దృష్టిలో పెట్టుకొని నాటక ప్రదర్శనలో ప్రతీ క్షణం అలాగే ప్రయాణం చుట్టూ తిరిగేలా డిజైన్ చేశాము. సెట్ కూడా ఒక చోటు నుంచి ఇంకో చోటుకి కూడా అలాగే వెడుతుంది . ఇందుకోసం సెట్ ని ఎక్కడకి కావలిస్తే అక్కడికి తిరిగే ఆరు ఫ్రేమ్స్ సహాయంతో డిజైన్ చేయడం జరిగింది. ఈ ఫ్రేమ్ ఒక్కొకటి 6 అడుగుల ఎత్తు, 4 అడుగుల వెడల్పు ఉంటాయి. ఆ ఫ్రేముల్లో మూడు ఫ్రేములు పాక్షికంగా ట్రాన్స్పరెంట్ గా ఉండగా మిగిలిన మూడు ఫ్రేమూలకు ట్రాన్స్పరెంట్ కాని ఎలాస్టిక్ మెటీరియల్ వాడాం. ఈ ఆరు ఫ్రేమ్స్ సర్ఫేస్ కూడా ఇంకో మాధ్యమం ద్వారా ప్రొజెక్ట్ చేసే ఇమేజెస్ చూపడానికి వాడాం. ఈ ఫ్రేమ్స్ స్టేజ్ లో వేరు వేరు ప్రదేసాలలో వేరు వేరు సన్నివేశాల్లో ఉపయోగపడ్డాయి. ప్రతీ లొకేషన్ నాటకం కి సంబధించినదే. అప్పుడు అవసరమయిన ఇమేజస్ ప్రొజెక్టు చేయడం కానీ లైటింగ్ ద్వారా కానీ చూపించాం . ఈ ఆరు ఫ్రేమ్స్ తో పాటు ఆరు సులభంగా ఫోల్డ్ చేసుకొనే కుర్చీలు వాడాం. మా 6 ఫ్రేమ్స్ సులభంగా కదలడానికి వీలుగా స్టేజ్ సర్ఫేస్ అంతా వినైల్ తో కవర్ చేశాము.

వీడియో ఇమేజస్ , లైటింగ్, బారిష్టర్ పార్వతీశం నాటకం లో వివిధ సన్నివేశాలను చూపించడం జరిగింది. ఒక సన్నివేశం నుంచి ఇంకో సన్నివేశానికి పాత్రల తో పాటు ప్రేక్షకులు కూడా ఆయా సన్నివేశాల్లో ప్రయాణం చేస్తారు. సెట్ డిజైన్ అండ్ నాటకం లో వాడే దుస్తుల డిజైన్ ల ను వీడియో డిజైన్ కి కుదిరేలాగా చేశాము . ఈ డిజైన్ ఎందుకు వాడేమంటే, ప్రొజెక్షన్ సులభంగా ఉండడం కోసమే కాకుండా నటీ-నటులు ఫ్రీగా మూవ్ అవ్వడం కోసం. లైటింగ్, వీడియో ప్రొజెక్షన్ తో పాటు సన్నివేశాలను మ్యూజిక్ తో కూడా బలం చేకూర్చాము.

మా తెలుగు(9)-హింది(6) నాటక ప్రదర్శనల్లోనూ ప్రేక్షకులు ఈ ఫ్రేమ్స్ , మేము వాడిన వీడియో ఇమేజస్ చాలా బాగా చూశారు.

నాటక ప్రదర్శన చరిత్ర

ఈ నాటకం మేము మొదట హింది లో తయారు చేశాము (ఒక పేరున్న తెలుగు నవలని హింది లో చేయడం బహుశా మొదటి సారి). దీనిని తొలిసారి జయపూర్ లో 2014 లో ప్రదర్శించాం. తర్వాత 2016 ఫిబ్రవరి 4 న దేశం లో ప్రతిష్టాత్మక భారత్ రంగ్ మహోత్సవ్ లో ప్రదర్శించాం . ఈ నాటకం చూసిన ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు ముగ్ధులై తెలుగులో చేయమని కోరి ఆర్ధికసహాయం కూడా చేశారు.

తెలుగులో విశాఖపట్నం లో పాత్రికేయుడు రమణమూర్తి గారి ఆధ్వర్యం లో ఉన్న రైటెర్స్ అకాడమీ వారు ఆగష్టు 23 2016 న అక్కడ ఒకే రోజు 2 ప్రదర్శనలు ఇచ్చాం . రెండు ప్రదర్శనలు కలిసి మొత్తం 1600 మంది చూశారు. 11 reviews వచ్చాయి. తర్వాత బాపట్ల, కాకినాడలో 2017 లోనూ , ప్రభుత్వ ఆద్వర్యం లో 2018 విజయవాడ లోనూ, 2019 లో విశాఖపట్నం , అనకాపల్లి , విజయవాడ , ఒంగోల్ లోనూ ప్రదర్శించాం. ఈ ప్రదర్శనలకి బాపట్ల లో ఉన్న శ్రీ అంబటి మురళీకృష్ణ గారు, ఇతర నాటక మిత్రులు సహాయ పడ్డారు.

ప్రముఖ నాటక కార్యకర్తలు, గొల్లపూడి మారుతీరావు, విజయభాస్కర్, సత్యానందం , మిస్రో, డి‌ఎస్‌ఎన్ మూర్తి, అప్పజోశ్యుల సత్యనారాయణ, పెద్ది రామారావు, కృష్ణేశ్వర రావు తదితరులు మా నాటకాన్ని తెలుగు నాటకరంగం లో ఒక కొత్త అధ్యాయం అని మెచ్చుకున్నారు.

*

దేవరకొండ సుబ్రహ్మణ్యం – పుట్టింది విశాఖట్నం ఉద్యోగ్య రీత్యా డిల్లీ 1969 నుంచీ ఇక్కడే ఉంటున్నాం. మా మేనమామ ఆకెళ్ల కృష్ణమూర్తి 1957 లో పరిచయమయిన రావి శాస్త్రి గారి దగ్గరనుంచి చాలా నేర్చుకొన్నాను , వారి “ఆరు సారా కధలు” నాకిష్టమయిన కధలు వాటిని ఆధారం చేసుకొని రాసిన వ్యాసం సారంగ లో ప్రచురించారు. నాకు నాటకాలంటే ప్రాణం (1975 నుంచి) నాటకాలతో పాటు తెలుగు సాహిత్యం కూడా చాలా ఇష్టం . 2014 నుంచి 2020 దాకా 7 సాహిత్య సదస్సులు ఢిల్లీ లో ఏర్పాటు చేశాను. వీటిలో ప్రముఖ తెలుగు సాహిత్యకారులు పాల్గొన్నారు.

 

శివప్రసాద్ తూము – తుని లో పుట్టిన ఇతను పాయకరావు పేటలోని ప్రకాష్ విద్యాలయం లో ఎం‌ఏ మేధమెటిక్స్ లో ప్రధమ శ్రేణి లో పాస్ అయ్యి నాటకాలంటే ఉన్న కుతూహలం వల్ల హైదరాబాద్ సెంట్రల్ యునివర్సిటి లో 3 ఏళ్ల డిప్లొమా చేసి తర్వాత దేశం లో ముఖ్యమయిన ఎన్‌ఎస్‌డి లో 3 ఏళ్ళు శిక్షణ పొందారు. చాలా నాటకాలకి దర్శకత్వం వహించిన శివ గారు ప్రస్తుతం రాజస్తాన్ విశ్వవిద్యాలయం లో నాటక శిక్షణ ఇస్తున్నారు asociated professor గా పనిచేస్తున్నారు. ఈయన బారిస్టర్ పార్వతీశం నవలను నాటకీకరణ చేయడమే కాక హింది తెలుగు నాటాకల్ని దర్శకత్వం వహించడం తో పాటు తెలుగు నాటకం లో ముఖ్యపాత్ర బారిష్టర్ పార్వతీశం చేశారు

దేవరకొండ సుబ్రహ్మణ్యం

దేవరకొండ సుబ్రహ్మణ్యం – విశాఖపట్నం లోని సింధియా కోలని లో పుట్టి పెరిగి, 1960-66 ల మధ్య అక్కడున్న ఆంధ్ర విశ్వవిద్యాలయం లో చదువుకొని, ఉద్యోగం కోసం ఢిల్లీ 1969 లో వెళ్ళి అక్కడే స్థిరపడిపోయి, ఢిల్లీకి ఆనుకొని ఉన్న గురుగ్రామ్ లో ఉంటున్నారు. తన మేనమావా ఆకెళ్ళకృష్ణమూర్తి గారి ద్వారా పరిచయమయి ఫ్యామిలి మిత్రులయిన రావి  శాస్త్రి  గారంటే అంతులేని గౌరవం. నాటకం ప్రాణంగా భావించే సుబ్రహ్మణ్యం తెలుగు సాహిత్యమంటే కూడా అంతే ఇష్టం చూపుతారు

8 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • నేను ముంబైలో ఉన్నప్పుడు ఇంగ్లీషు, హిందీ నాటకాలు చాలానే చూశాను. సాహిత్య మూలాలోనూ, సాంకేతికత పరంగానూ అవన్నీ అత్యుత్తమ స్థాయిలో ఉండేవి. తెలుగులో కూడా ఆవిధంగా ప్రదర్శస్తే బాగుండును అనిపించేది. మీ వ్యాసం చదివాక అటువంటి ప్రయత్నాలు, ప్రయోగాలు జరిగాయని తెలిసి సంతోషం కలిగింది. అభినందనలు! ఒక సూచన. మీరు పేర్కొన్న సాంకేతిక వివరాలను ఫొటోలు, వీడియో లింకుల ద్వారా స్పష్టీకరిస్తే మరింత ఉపయోగకరంగా ఉంటుంది.

  • మీ నాటక ప్రయోగం అద్భుతం. బారిస్టర్ పార్వతీశం నవలను మీరు అన్వయించుకున్న తీరు ప్రశంసనీయం

    • ముగ్గురు మిత్రులకు కృతన్జ్డతలు . సుధాకర్ గారి లాగా మా డిజైన్ వివరాలు కావాలంటే నాకు ఈమైల్ subbu60@gmail.com కి రాస్తే వివరాలతో మా ప్రదర్శన ఫోటోలు పంపుతాను

  • పార్వతీశం ఇంట్లో చెప్పకుండా ఇంగ్లాండ్ కి ప్రయాణం కట్టే ప్రహసనం మొత్తం, షిప్ లో సగ్గు జావ, ఉడికించిన బంగాళాదుంపలు తినడం.. ఇవన్నీ కూడా అద్భుతమైన సున్నితమైన హాస్యాన్ని పండిస్తాయి. అతను ఇంగ్లండ్ నుంచి తిరిగి వచ్చాక నడిచే మూడో భాగం లో హాస్యం అంతగా నప్పదు

    ఇంత గొప్ప పుస్తకాన్ని మీరు నాటకంగా మలచడం ఎంత గొప్ప సంగతి!!!

    అన్యాయం ఏమిటంటే తెలుగులో దాన్ని ఆంధ్ర ప్రదేశ్ లో మాత్రమే ప్రదర్శించి హైద్రాబాద్ లో ప్రదర్శించక పోవడం.

    సాంకేతిక వివరాలు చాలా ఆసక్తి కరంగా ఉన్నాయి. వాటిని పైన, సుధాకర్ గారు చెప్పినట్టు వీడియో ద్వారా, క్లిప్పింగ్స్ చూపిస్తూ వివరిస్తే, పాత క్లాసిక్స్ ని ఎవరైనా నాటకంగా మలచాలంటే ఉపయోగంగా ఉంటుంది.

    నాటకం రికార్డ్ చేసి ఉంటారు కదా, దాన్ని యూ ట్యూబ్ లో పెడితే ఆనందిస్తాం.

    హైద్రాబాద్ లో నాటక ప్రదర్శన సంగతి ఆలోచించండి. కోవిడ్ సీజన్ ముగిశాక అయినా సరే, చూడాలని ఉవ్విళ్ళూరుతున్నాం.

    మరిన్ని ఫొటోలు చూడాలని ఉంది, ఎలా పంచుకోగలరు?

    చాలా ఆసక్తికరంగా ఉన్నాయి ఫొటోలు. ఆ ట్రంక్ పెట్టె, పార్వతీశం ఆహార్యం.. అద్భుతం గా అమరాయి

    • సుజాత గారూ థాంక్యూ . మేము హైదరబాద్ లో మా ప్రదర్శన కోసం చాలా ప్రయత్నాలు చేశాము. స్పాన్సర్ దొరకడం చాలా కష్టమయింది. పరిస్తుతులు చక్కబడ్డాకా మళ్ళీ ప్రయత్నిస్తామ్. ఫోటోలు ఇంకా కావాలంటే నా ఈమేల్subbu60@gmail.com కి మీ ఈమైల్ తెలుపుతూ రాస్తే పంపుతాను.

  • సుబ్రహ్మణ్యం గారూ,
    మీ సమీక్ష క్లుప్తం గానూ, ఆస్క్తిదాయకం గానూ ఉంది. ఈ నాటకం డిల్లీలో ప్రదర్శించ గలిగితే బాగుంద్తుంది. నిజానికి మూడు భాగాల్లోనూ, మొదటి భాగమే బాగుంటుంది. తరువాత భాగాలు కధాని పొడిగించడానికి రాసినట్లు అనిపించింది. మీరు మొదటి భాగం నాటకం గా మలచడం బాగుంది. ఈ విషయం మీరు నాకు ముందొక సారి చెప్పారు. ఢిల్లీలో నాటకం వేయడానికి అవుతుందేమో చూడండి. ఇప్పుడు కాదు, కాస్త పరిస్తితులు బాగయ్యాక

  • Barrister పార్వతీశం మంచి ప్రయోగం. I have enjoyed when I watched it in Delhi. బాగా వివరించారు, అభినందనలు.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు