పద్మల్ పురి కాకోబాయి

నిషి పుట్టుకే కాదు, నాగరికత పుట్టుక నెలవైన చోటు జ్ఞాన వికాసానికి నెలవైన చోటూ కళలకు సంస్కృతి కాణాచి.తెలంగాణలో మొదట అడుగుపెట్టింది మొదట ఆదిలాబాద్ జరిగింది కదా ?

ఆదివాసి జీవితాలు అడవుల చుట్టూ అల్లుకున్నవే రాజ్ గొండ్సు ఆదివాసీ పురాతన సంస్కృతి సంప్రదాయాలలో ఒకప్పటి గణరాజ్యం.

ఆ సంస్కృతి సంప్రదాయాలతో దండారి గుస్సాడి ఆశ్వయుజ కార్తీక మాసాల్లో ఆదిలాబాద్ ఆదివాసి గూడెంలు లయబద్దంగా డప్పులతో మోగుతాయి.

కాలికోం, పర్ర సంగీతం వాయిద్యాలు జానపద నృత్యాలకు ఊపిరినిస్తాయి. నాలుగు నెలలముందు నుంచి ఆదివాసీ గ్రామాలు కోలాహలంతో సంబురాలు చేయడం ఆరంభమౌతుంది. ఆదివాసీ దండారి గుస్సాడిలతో పద్మల్ పురి కాకోఎత్మల్ సూర్ పెన్కు గోండులు అమ్మమ్మగా మొక్కుతారు.

కాకో అంటే ఆమ్మమ్మదేవత ఐదుసగల గోండిలు పండుగలో పాల్గొంటారు. మంచిర్యాల జిల్లా గుడిరేవు దండేపల్లి మండలంలో ఉంది. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ అనేక ఆదివాసీలు ఉత్సవం జరుపుకుంటారు.

పదకొండు సంవత్సరాల లింగు మొదటిసారి ఆదివాసీ గూడెం మాండీ నుంచి గుడిరేవు కాకో మొక్కులు తీర్చుకోవడం కోసం దండారి గుస్సాడి వేషం వేసుకోని వచ్చే సమయంలో దండారి పండుగ పరాయికరణ చెందడం గురించి అక్కల చంద్రమౌళి ఆవేదన చెందాడు.  దాన్ని కాపాడాలని చేసే ప్రయత్నం ఈ – పద్మల్ పురికాకో- కథ.

-చందు తులసి 

 

పద్మల్ పురి కాకోబాయి

-అక్కల చంద్రమౌళి

 

ఆశ్వయుజ(దివాడి) కార్తీక మాసం. గోదావరి నదిలోని నీరు చలికి గడ్డకట్టింది. పొగమంచు ఆకాశం తాకినట్టు కనబడుతుంది. దండేపల్లి గుట్టకానుకోని అడవంచు గ్రామాల్లోని వాకిల్లు కొత్త ముగ్గులతో మెరుస్తున్నయ్.

గుండాల గుట్టలావల ఆదివాసీలు గూడెంలోని మట్టి తడికలతోటి ముస్తాబైనాయి. కొత్తబట్టలు కడుతున్నారు. ఇప్పుడు దివాడి తప్పా ఇంకేమి సోచాస్తలేరు. గొండొళ్ళం ఊసుళ్ళ పుట్టనుంచి చీమల తీర్గా తోవ పొడుగునా పచ్చపచ్చ అడవుల్లా కొండలు దిగి, కొనలెక్కుతున్నారు. అలసిన జాడలైతే కానరావడం లేదు.

దసరా అయినగానీ, పాలపిట్టలు మైదానాల బాదెగరడానికి ఆసక్తిని సూపుత లెవ్వు. ఆ ఎత్తు లోద్ది దోనల్లోని పక్షిజీవరాశులకిపుడు ఆదివాసీల” రాం రాం”అనే మాటలే ఇష్టంగున్నాయి. చెట్లకొమ్మలు గాలితాకి ఊగుతున్నాయి. ఎండపొడ పచ్చని అడవిలోన ఆకులు మీద పడి బంగారు తీగల్లాగ మెరుస్తున్నాయి. ఆదివాసీల ముఖాలల్లో దునియానే ఏలిన తీరు స్పష్టమైతంది. వారంతా గుట్ట మలుపులు తిరగ్గానే చిన్న చిన్న గుడిసెలు కనబడుతున్నాయి. మట్టిరోడ్డు దుబ్బలు పైకి ఎగిరి కండ్లల్ల పడుతుంది. తాళ్ళతోపు పక్కన వెయ్యిండ్లు నదికానుకోని ఉన్న అతి పురాతన గణరాజ్యమే గుడిరేవు.

సాంస్కృతిక  మూలాలకు ఆధారమైన గోండిగాధ జానపద నేల. అక్కడికి పికపిక జనంతోటి లారీల్లో, ఆటోల్ల, ట్రాక్టర్లు, జీపులు, బస్సులు పోతున్నాయి. ఎడ్లబండ్ల వెంట స్త్రీ ,పురుషులు తలలంచుకుని నడుస్తున్నారు. అక్కడ మెల్లగా మెల్లగా ఇసుకేస్తే రాలనంతగా జనం జమైండ్రు. ఆదివాసి తెగలకిది కూడలిగా మారింది. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ , జార్ఖండ్ మరియు మధ్యప్రదేశ్లోని ఆదివాసీ ముఖాలు గోదావరి జీవనది కాడ పవిత్రంగ కలగబులంగంగా తిరుగుతుండ్రు.ఈ సారి మందెక్కువత్తరనే పదొద్దుల నుంచే ఊరి సర్పంచ్, పటెల్, మండల, జిల్లా అధికారులు బిజిబిజిగా పనుల్లో మునిగిండ్రు. ట్యాంకర్లతోటి దుబ్బలేవకుండా నీళ్ళు గొడ్తున్నారు. దొడ్డికి పోడానికి మొబైల్ టాయిలెట్ ఏర్పాటు చేస్తుండ్రు. అధికారుల పర్యవేక్షణకు తెల్లటి టెంట్ కింద పెద్ద కుర్చీలు వేశారు. ఆదివాసీలకు ఏ లోటు లేకుండా జాతరకు అధికారయంత్రాంగం సిద్ధమైతండ్రు.

“పోలీసు కంట్రోల్ రూంలా నుంచి సమాచారం డిఎస్పీకి జరిగేది అందజేస్తున్నాడు” మీసాలున్న కానిస్టేబుల్.

ఉంగరాల జుట్టు,పలుచటి మీసం, గడ్డం, అప్పుడప్పుడే కుదురుకొని రూపుకడుతున్న ఆదివాసీ తీరైన నేరేడు పండు శరీరం లింగు. తిర్యాణి(తిలాని) ఆదివాసి మంగీ గ్రామం పురాతనమైన యుద్ద నేలలా పుట్టినోడు.ఆదివాసీవాలుండే నీచస్థితులు ,పోకడలు కించిత్ తెల్వది.దండారంటే ఓ జీవితం,ఎలా బతుకుడో ఎట్లా బతుకూడదో తెలిపే సంస్కృతి. రోజు సాయంత్రం గూడెంలోని వాయిద్యాలతో నేర్చుకున్న కళలు ప్రదర్శిస్తాడు.ఈ పిల్లాడి తెలివికి లింగు బాల్(తండ్రి)ఊళ్ళే మెచ్చుకుంటారందరు. ప్రతేడాది గూడెంలా దండారిలో గుమేలా,డప్పులు వాయిస్తూ తన ఈడోళ్ళేను మించి పెద్దవారితో ఆడిపాడుతాడు.

లింగు -మన ఆదివాసి గూడెం రీతి రీవాజులు భుజాన మోసుకొని అచ్చేతరపోళ్ళకు ఒక వంతెనైతాడనే నమ్మకం పెరిగింది. పటెల్ కుర్దుకి. కానీ లింగు మనసులో వేరే గూడుకట్టుకుని పొరలు పొరలుగా తేలుతుంది. లింగు మర్మం దోస్తులకే తెలుస్తందన్నాడు -గంగరాం. “గీ పారీ “అమ్మమ్మ(కాకో) ఐదు సగల దగ్గరికి పోవాలని అనుకున్నాం గదా ?పోదామని సోపతులని” లింగడిగిండు. దానికి దండారి గుస్సాడిలు తయారుగున్నారు. “కానీ ఊరి పండుగల్లో పటెల్(నార్ పాట్ల)దే పెద్థమాట కదా?” ఆయన “ఊ …అనాలి కదా” సోపతులన్నారు.

“లింగు జిజ్ఞాసకు బలమిచ్చుండు” -పటెల్ కుర్దు.

ఇగ సోపతులంతా మంగీ గూడెం నుండి దండారి గుస్సాడిలతో కాళ్ళు లేపిండ్రు. అడవి తోవల బండలు, వాగులు, వంకలు దాటుకుంటూ బయలెల్లిండ్రు. మానిక్ , బండేరావ్, సోనేరావ్,గోవిందరావులకు ఆలాయ్ బలాయ్ చెట్టు సేమతో కలిసే బతికనీ ,కాకో దేవతనే తెల్సుకుంటా ముందుకు కదిలిండ్రు. “లోలోపల ఏదో తెలియని జిజ్ణాస పురుగులాగా తొలుస్తుంది”లింగు ఉదములో .

ఆదివాసీ జానపద రీతి-రివాజుల నృత్యాన్ని కాపాడాలని పెన్కు నన్ను పంపిందేమో అన్నట్టు చూపు మెరిసిందతనికి, “ప్రతి మావనార్(గ్రామం)లా ఏడైనా దండారీలే అని తాత చెప్పింది మతికచ్చిందిపుడు” లింగుకి. గుట్టలకు మేకలు మేపితే నెమలీకలు వయిలా పెట్టుకోని మురిసేటోళ్ళం. కొన్నాళ్ళకు అది జాతీయ పక్షంటా అని చదువులా తెలిసింది లింగు‌కి. ఆ నెమలీకలు తలపాగేసుకుని ఆడటమంటే ఇంకిష్టమైంది‌. కడుపుల లోలోపలుంది ప్రకృతికంటున్నట్టుందీ.

“ఇన్నోద్దులేమో మంగీ అడవిలా బతికినోడివి కదా? ఇప్పుడెందుకు వేరేనార్ (వేరు ఊరు) దేనికెళ్తున్నావనీ మాట కలిపి లింగుతో” భుజంగరావన్నాడు.

మనం రీతి రివాజులు బయటకు తెలువద్దా ?దండారాడి మళ్ళా ఈడికచ్చుడేనాయే అని సిన్నగా బదులిచ్చిండు- లింగు.

కాకో యేత్మసూర్ పేన్కు,లయబద్దంగా వినిపించే డప్పులు,డోల్ల చప్పుడు,కాలికోం,తుడుం ఇంకా పేరు తెలియని ఆదివాసీ సంగీతం వాయిద్యాలు మోగుతున్నాయి.అంతకంతకూ అమ్మమ్మను ఉద్విగ్న వాతావరణంలో చేరుకున్నారు.

కాకోబాయి మంగీ బృందానికి  సంకేతమిచ్చింది.శుద్దజలంతో ఆహ్వానం వచ్చింది.

“ఆదివాసీలు స్త్రీలు, పురుషులు గుబురుగా ఉండే పొరకలు కొట్టిజాగ సాపు జేసుకుని అడ్డ తయారుజేసిండ్రు.ఆడంత చుట్టాలు మోదుగులాగా నవ్వులతో,ఆత్మీయంగా ప్రేమతోటి ఆలింగనమైండ్రుఅంతా గమనిస్తున్నాడు” లింగు.

అప్పుడే అడవిపూలు తురుముకొని ముదురాకు పచ్చని చీరతో యువతుల గుంపు వచ్చింది. మరికొంత మంది స్త్రీలు వలయాకారంలో ఒకరి అడుగుల ఇంకోకరు కాళ్ళు కలిపి రేలారే రేలారే న్రృత్యంలో దేవుళ్ళు పుట్టుక సంబంధించిన సంప్రదాయ పాటలు పాడి ఆడుతుండ్రు. ఓ కాడ బేటింగ్ ముచ్చట్లు నడుస్తున్నయ్. అదొక జీవన నాగరికత ప్రపంచమైదిక్కడ. మొక్కులు తీర్చుకున్నోళ్ళంతా ఆడవారు కట్టెలు పొయ్యి మీద పప్పు, గారెలూ(గార్కాన్) అప్పాలు,పూరీలు, రొట్టెలతో ఘుమఘుమలాడే తిండికి చేస్తున్నారు.

ఇండ్లకాంచి తెచ్చిన నువ్వుల నూనె నేవైద్యం తెచ్చి కాకోకి సమర్పిస్తున్నారు. తమ మనుషుల్ని జీవితాలను దగ్గరగా చూసుకుంటున్నారు. భూమితల్లి అవతారాలు పదే పదే మొక్కుతున్నారు. ఆదే జీవితం, బతకడమేలాగో తెలిసినవారిలా వారంతా కనబడుతున్నారు.

అదివాసీలు చరవాణీలు మోగిన గానీ, ఏమెరుగనట్టున్నారు. కుడ్మెత సోము గుడిరేవు దేవస్థానం ప్రెసిడెంట్, ఆడికచ్చిన దండారి బ్రృందాల ను మైకులో చెబుతుండు. ఆలయ అభివ్రృధ్ధి కోసం విరాళాలిచ్చిన పద్మల్ పురి కాకోబాయి ఆశీర్వాదము ఉండాలని “రాం రాం”జై సేవ అంటున్నాడు. గుండాల, అర్జుగూడ, తిర్యాణి, మంగీ, జైనూర్ మత్తుగూడ, మార్లవాయి, కెరమేరి, ఉట్నూర్ కెళ్ళి వస్తున్నారు. దండారీలకు సర్పంచ్ శ్రీనివాస్ లోటుపాట్లు లేకుండా చూస్తున్నాడు. లింగు గుడిరేవు దేవస్థానం, గుస్సాడి కోసం ఊరు వదలి కొత్త ప్రపంచాన్ని ఈడ చూసాడు.

“అరేయ్… గంగారాం మనది చిన్న గ్రామమైన కళలు సంప్రదాయలు కాపాడుతున్నాం కదా”? కాకో దేవత సాక్షిగా మీరంతా హామీవ్వాలే ” అన్నాడు లింగు.గోండోల్లు ఆవద్దమాడితే పెన్కు (దేవుడి)కి కోపమత్తది కదా ? అవద్థం మంచిదిగాదనీ యువకులంతా నిఖార్సైన హామీచ్చిండ్రు లింగుకి.

తన జాతికి ముడిపడిన రాజ్ గోండ్స్ రాచరికం జాడలను, సొంతమూలలను వెతికి పనిలోనే ఉన్నాడు లింగు. దండారీ గుస్సాడీలు ధరించిన నెమలిపించాల రంగులు అద్వితీయం.

భగవంతుడు సృష్టించిన అందమైన వర్ణచిత్రంలో ప్రకృతి మనుషులుగా ఆదివాసీలు ఉచ్చస్థితిలో ఉన్నారు. అడవి ఇవల మనుషులు పసలేని ఉత్తజీవులుగా ఆడీడ తచ్చాడుతున్నారు పెద్ద పొట్టలు, ఉబ్బు చెంపలతోటి అది యువకులకు అర్థమైంది. చెట్టునుండి ,పుట్టనుండి ఎందుకు విడిపోతున్నారో? లోలోపల ఆలోచిస్తున్నాడు.

మనోల్లు కూడా బయటలెక్క కావద్దన్నది మనసుల ఆలోచన సొచ్చింది లింగుకి.

నల్లటంగీ తొడుక్కున్న చలికి డప్పులు గట్టిగా మొద్దుబారినయ్. ఆకాశమెత్తు నెగడుకి డప్పులను ఏడికాపుతూ మోగేలా చేస్తున్నారు. ముసలోళ్ళు నెగడుమంటకు చలికాగుతూ చుట్ట కాల్చుతున్నారు. డప్పులు డం డం మోగుతున్నాయి.

అతిపురాతన కళనే నమ్మిన ముప్పై రెండేండ్ల కళాయాత్ర ఆర్టిస్ట్ పోశం. గోదారిలొద్దిల్లోని గొండ్వానా రాజుగొండ్సుల కనిపించే జీవితం వెనుకుండే, కనబడనీ జీవితం నడవడికను చిత్రాలుగ గీసి, ప్రజలను కళాశక్తి చైతన్యం వైపు నడపాలనీ ఇల్లిడిసి యాడాదయ్యింది. ఏడ తింటండో? ఏడ పంటండో తెలువనీ బతుకు. నడిచి నడిచి కాలిపుండు సలుపుతున్న గానీ ముఖంలా ఏ బెదురు కనబడనియ్యట్లేదు. ధరంపురిలోని (మంత్రకూటమి)లైట్లు జిగేల్మంటున్నయ్. నడీమధ్య గంగల ఇసుకనే మెత్తటి పరుపులో కునుకు తీసేలోపే పొద్దున్నే గోదావరి అలలు తట్టిలేపాయి. ఉట్నూర్ గుస్సాడిగుట్ట అయినంకనే మంగీగ్రామం న్రృత్యంచేసేటోళ్ళు రెడీగా ఉండాలని పటేల్ కుర్దు చెప్పిండు.అక్కడున్న పోశం తన రంగుల స్కెచెస్ తీసి మనుషులను తీక్షణంగా పరీక్షిస్తున్నాడు.

తెల్లటి పేపరు మీద రకరకాల రంగుల్ని బొమ్మలుగా మలుస్తున్నాడు. అంతలోనే సోపతిగాళ్ళతో నృత్యం బ్రృందంతో ఆడికచ్ఛిండు లింగు. “ఒంటినిండా తెల్లటిబూడిద , చేతుల్లో కట్టెలు ,మెడల పూలదండలు, అద్దాల కోమ్ములు, నడుముకీ గజ్జెలు(గాగ్ర), శంఖం,బాండే(తుపాకీ) ఎడమ భుజం మీద చర్మం ధరించినారు. దండారి గుస్సాడిలు గుడిరేవు కమిటి సభ్యులు పిలవడంతో కాకోబాయి ముందుకొచ్చి ఆడటం మొదలు పెట్టారు. చిన్న పిల్లలు తెల్లటి అంగీలు, దానిపైన పింక్ రంగు ధరించి,చేతుల్లో కోలలతోటి “చోచోయ్” సందడి చేస్తున్నారు. అందరు ఒకే తీరుగా లయలో సంగీతం వాయిద్యాలు పాటలకనుగుణంగా కాళ్ళని కదుపుతున్నారు. మధ్య మధ్యలో బ్రృంద నాయకుడు ఓయ్ అని జీరగొంతుని అదిలిస్తున్నాడు. గంట, రెండు గంటలైనా వారి నృత్యంపై  ఆకర్షణ తగ్గడంలేదు.కానీ ఈడకచ్చిన తీరు తలుస్సుకుంటే కండ్లల్లా దుంఖమత్తందన్నాడు లింగు.

“గా అకాడి నుంచే మొక్కిండు.బాల్ అడిగితే పైసల్లేవ్? గీసల్లేవ్ ?మనం బతుకుడే కట్టముంది ఈ పండుగేందీ ?గిండుగేందని ?”సప్పుడేక ఉండమండు.ఆఖరికి వడ్డితెచ్చి పైసలిచ్చిండు” బాల్ .చెల్లికి జరంమత్తే మందు మాకుల్లేక గిలగిల తన్నుకుని సూత్తంగనే పాణమిడిసింది.తన సెల్లే యాదికచ్చినప్పుడల్లా గుండెల్లకలుక్కుమంది.

గుబగుబ కండ్లకెళ్లి నీళ్ళు తిరిగినయ్.అట్లా రకరకాల భావోద్వేగాలు నిప్పులాగ గుప్పుమంది లింగుకి. కాకో స్రృష్టి దేవత మనమళ్ళైనా మనకు తోడుండి పుండులాంటి బాధ ఎడబాపుతుందనేది నమ్మకంతోటి దండారి గుస్సాడీ భక్తి శ్రద్ధలతో ఆడుతున్నాడు లింగు.

“గొండొల్ల దండారీ -గుస్సాడి ఆదివాసి న్రృత్యంను ఐటిడిఏ, కలెక్టర్ అధికారులు ,పటేల్ మంగీ బ్రృందాన్ని మెచ్చుకున్నారు.” సంబురమైంది.తనచ్చినందుకు సంతోషమైంది.ఆడనే ఉన్న పోశంకి, లింగు తతంగమంతా చూస్తున్నాడు.గొండొల్ల బోమ్మలు శానా గీసాడు.అందులో లింగు ప్రత్యేకమయ్యాడు.

రాజ్ గొండ్సుల గొప్ప దండారిన్తృత్యం గొప్ప అందమైన కళ.”ప్రకృతిలోని సహజ నైపుణ్యాలను చదువుతో పాటు ,సంస్కృతిని ఆకలింపు చేసుకుండు”లింగు తలపైకి ఎక్కి నెమలీకలు ఉచ్చస్థితిలోకి వెళ్లినట్టుందక్కడ. నీలరంగు నెమలీకలు దండారీలను, లింగు ఆవభావాలు కాకో దేవత రూపాన్ని చిత్రాలూ గీయడం జీవితంలోని అతిముఖ్యమైన ఘట్టంగా తోచింది-పోశం.

“మళ్ళీ పాతరోజులు మనుషులు సంస్కృతి కట్టుబడి ఉండాలన్నదే” లింగు మాటైనది.

ఇంకిప్పటోళ్ళు మంచిరాల,లక్షేటిపేట్ ,తిర్యాణి, ఆసిఫాబాద్ ,ఊట్నూర్ పెట్రోలు బంకుల్ల, హోటల్లు,ఇండ్లల్ల కూలిపనులకు పోతుండ్రు.దానెకా పెద్ద మతలబే ఉందనీ పెద్దమనుషులు అంటున్నారు.గొండులు తమకు తెలియని (భోధపడని)మతాచారం( తంతులోకి)వచ్చేశారు.

ఇతరుల సమాజం ఎక్కువగా ఉంటున్నారు.

రీతి- రివాజులన్నీ గంగల కలిసినట్టు తయారైనయ్.”ఆదివాసీల బతుకులు శిల్లంకల్లంగా సత్తెనాశనమైనయ్.గోండొల్లను రాజకీయాలకు వాడుకుంటున్నారు. ఏమర్థంకానీ స్థితిలోకి నెట్టివేయబడ్డారు. మౌఖికంగా సంప్రదాయ జ్ణానం నశించిపోతుందనేది అర్ధంచేసుకున్నాడు” లింగు.ఏం చేయాలో ?ఎలా జేయాలన్నదే తండ్లాటున్నది “లింగుకి.

“ఏడ పుట్టిండో, ఎందుకచ్ఛిండో గానీ మనదే అడవి- సంస్కృతి మనదే అన్నట్టు”లింగు,ఒక్కదినంలనే వేయి గుస్సాడిల ప్రకృతి మనుషుల సంస్కృతి ప్రతీకగా గీసాడు-పోశం ఆదివాసులంతా గుమికూడారు. ఐదేండ్లైన నిండని బాల చిత్రకారులు మెళుకువలు చెబుతుంటే అనుసరిస్తున్నారిక్కడ.

లింగు బెదురుతో అందరిలాగానే పోశం కాడికచ్చిండు.అటీటు సూత్తండు.

“ఓపారీ …బోమ్మ చూపవా దాదా (అన్న)గౌరవవచనం తోటన్నాడు”లింగు.

దానికి నవ్వుతో “సరే అన్నాడు- పోశం”

“చౌకట్ మంతమన్నాడు” గొండిలో లింగు.

అది ఇవ్వగానే చేతుల్తో తడిమి చూసి,ఇంకా గుండెల్లో పెట్టుకున్నాడు.ఎన్నెన్నో ఊళ్ళు తిరిగిన, ఏడేడో బతుకులు జూసి, గీసిన ఈ అనుభూతులు ఇచ్చిన రాజ్ గొండులకు జై ఆదివాసి జైజై అదివాసి గట్టిగన్నాడు పోశం.లింగు చటుక్కున అడగకుండానే తినేటివి తెచ్చాడు. ఇద్దరు ఆలోచనలో కళారూపాలే బతుకైనది. కాకో దగ్గర అతి సుందరమైన నెమలీకలు బహుమతిగా ఫీలయ్యాడు. నెమలి,మేఘాలు బంధమైందిద్థరిది. ఇదీ ఒక సంస్కృతి పునాది గట్టిపడే మట్టిలా లింగుకి తోచింది. దోపిడి,అణిచివేత వున్న ఇంకా రీతు -రివాజులు కట్టుబొట్టుతో అందంగా జీవిస్తున్నారు.ఆదిలాబాద్ అంటే జ్ణానం మనిషి పుట్టుకకే కాదు, నాగరికత పుట్టుకకు నెలవైన చోటు. చదువులకు చిరునామా అయిన చోటు. కళలకు సంస్కృతి కాణాచి తెలంగాణలో బుద్దుడు అడుగుపెట్టాడంటే అది ఆదిలాబాదిలో జరిగింది కదా? ఆ గ్యానం ఉన్నవాడిలా కనబడుతున్నాడు లింగిప్పుడు.

నార్ పాట్లు(గ్రామం పెద్ద)లతో,యువకులు కలిసి గోండు సమాజంలో అర్థిక, సామాజిక, సంస్కృతులు ముందువడేలా కోరగా,వారు సరేనన్నారు.గ్రామాలు పటేళ్ళు ఆర్ధిక మూలాలు బలానికి క్రృషిచేస్తున్నారు. లింగు పన్నెండు గ్రామాల యువకులను పోగుచేసి ఆదివాసీ గొండి సమాజంలో చొచ్చుకుని వస్తున్న పరాయి శక్తులపై లడాయి జంగు సైరన్ ఊదేలా నిర్ణయం తీసుకున్నాడు.ఐకమత్యం, సామూహికతా ఉండాలని గ్రామపెద్దలను అభ్యర్థించాడు కాకో బాయి ఆశీస్సులతోటి లింగు.

కాకోబాయి పండుగ ఆఖరిదినం కావడంతో దుకాణాలన్నీ మూసి, టెంట్లు ఊడదీస్తున్నారు.ఎడ్లబండ్లు అచ్ఛిన తోవ వైపు తొంగిచూస్తున్నాయి. జీపులు సప్పుడు మెల్ల మెల్లగా ఆ ప్రాంతం నుంచి దూరంగా పోతున్నాయి.అంగడిలో అమ్ముకునేటోళ్ళు కదులుతున్నారు.లింగు పోశం ఆడనుంచి వెళ్లారు‌. దండారీ- గుస్సాడి శిక్షణకోసం మార్లవాయిలోని పద్మశ్రీ కనకరాజు దగ్గర శిష్యుడిగా మారాడు.గురువుకి తగ్గ శిష్యుడనిపించుకున్నాడు.ఆదిమ సమాజం రీతులు బలపడాలని ఉద్దేశంతోటి సాగుతున్నారు.మార్లవాయి మార్లవాయి సర్పంచ్ ప్రతిభ కనకరావు కూడా భాగస్వామ్యమైంది. ఓ చరిత్ర ఉన్న మట్టదీ.

కాలం దెవుసాలుగానూ పాడుగ భీమారినిచ్చింది. భీమారేది ఆశయంని సావనియ్యలేదు. సోపతులెవ్వరికి లోపలభీమారి చెప్పలేదు. లింగు.చిన్న వయసులో పెద్దాశయం తన జీవితం ఆస్తమయం అయ్యింది. ఆదిమ సమాజం ఒక్కసారిగా గొల్లున ఏడ్చింది.కానీ ఆశయం కాకోబాయి దేవత తన స్నేహితులకిచ్చింది.మన లింగు బతికే ఉన్నాడు ఆదివాసీ ముఖాలు వెతికి చూడండి. పోశం గుండె మీద నిప్పులు పోసినట్టైంది లింగు మరణం తెలిసి తల్లడిల్లిండు.తన కళలు ఈ గాలుల్లో, కొండల్లో,బండల్లో జీవించే ఉన్నాడు.సోపతులు వాటినందుకున్నారు.లింగంటే ఆదివాసి సంస్కృతి, పురాతన ఆదిమ సంస్కృతి వారధి. కాకోబాయి ఆదిదేవతకు ప్రాణమైండు.పోశంలాంటివారు మరెంతమందో లింగు లాగా బతికితే చాలనుకుంటున్నారు. మళ్ళచ్చేఏడాది కాకోబాయి దేవస్థానానికి లింగు ఆనవాళ్ళ  కోసం ఆదివాసీలు వెళుతున్నారు.

*

ఫోటో: సంతోష్

అక్కల చంద్రమౌళి

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • కథ ఒక దృశ్య కావ్యంలా సాగింది. చదువుతున్నంత సేపు ఆ ప్రాంతంలో విహరించి ప్రత్యక్ష సాక్షిగా నిలబడినట్లు అనిపించింది. చంద్రమౌళి గారికి మన పూర్వక అభినందనలు.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు