సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు
ఆమె పడమట ఉదయిస్తుంది!
గోరంత మందారాన్ని కొప్పులో
చిటెకెడు సింధూరాన్ని నుదుట
దిద్దుకొని చందమామనడిగి
గుప్పెడు వెన్నెల్నితెచ్చీ సౌకుమార్యంగా
ముగ్గులై మురుస్తుంది!
ఆమే వీధిగుమ్మంలో నిలబడితే
వాడవాడంతా వెన్నెల విరగబూసినట్టుంటుంది !
నవ్వులతో ఆమె
పువ్వులతో నేను
సంభాషిస్తుంటే
పరిమళిం మా ముంగిట
పవనమై ,మొలుచుకొచ్చినట్టుంటుంది !
ఆ పడమటి కిటికీ నా నేత్రం
ఆమె రూపాన్ని కళ్ళల్లో నింపుకొని
నా దోసిట్లో వొంపుకుంటాను !
రంగు ,రుచి ,సువాసనలై
అమెనన్ను పెనవేస్తుంది !
నా గది ఎప్పుడూ వొంటరి కాదు
మా ఇద్దరి మోహకాలానికి
కొలమానం లేదు.
నేను ఆమెను ఆరాధిస్తూనే ఉంటా!
*
బావుంది