ఆత్మ గౌరవం అభిమానం
రక్తం చెమట త్యాగం కలగలిపి
తీసుకున్న చిత్రాన్ని
ప్రేము కట్టడానికి ఇచ్చాను
రంపంతో కర్రను
వజ్రంతో దర్పణాన్ని
మేరకు సిద్ధం చేసుకొని
పటాన్ని గోడకు తగిలించడానికి
చివర కొక్కానికి బిగించాడు
తలవంచని వ్యక్తిత్వం
కర్చీఫ్ వేసి ఆపిన కుర్చీ కోసం
‘చెంచా’ అయి అన్నిట్లో కలిసిపోయింది
బ్రాహ్మణ్యం చేస్తే సుద్ధి లోక కళ్యాణం
బహుజనులు చేస్తే శుద్ధ కీడు
అందంగా తీర్చి దిద్దిన ప్రేమును
తీరా తేను పోయేసరికి
బ్రాంతి వాంతి చేసుకుంటున్న విధ్వంసం
అబద్దాలు చెప్పినంత అందంగా
ముక్కలవుతున్న అద్దాల
హాహాకారాల చప్పుడు ప్రపంచమంతా
*
పెయింటింగ్: పఠాన్ మస్తాన్ ఖాన్
Add comment