విత్తనాన్నీ జంతువునూ కాదు
అణువూ ఆకాశాన్నీ కాదు
రాజునీ కాదు , రాజ్యమూ లేదు
నాకు కులమూ, మతమూ
ప్రాంతమూ, దేశమూ
భాషా యాసా ఏదీ లేదు
నాకు ఏ రంగైనా ఒకటే
లింగ భేదాలు
వయస్సు తేడాలతో పనే లేదు
నాపేరే నాది కాదు
నాకు తల్లీ తండ్రే కాదు
నాకంటూ ఎవరూలేరు
ఎవరెంత హతమార్చాలనుకున్నా
జీవకణం వాహనంగా
విస్తరించగలను విశ్వమంతా
జీవకణం నాకొక అభిసారిక
లోన రహస్యంగా ఒకరికొకరం
అలంకరించుకుని హత్తుకుని
జీవకణాల అణువణువూ ఒకటై
ఒకరిలో ఒకరం లీనమయిపొతాం
లొంగదీసుకున్న ఆనందంలో
జీవ బలమే కాదు
ఆ జీవీ హుష్ కాకే
నేనే తానయాక
నేను తప్ప
ఎవరుంటారు ఆ జీవికి?
ఎలాగూ నేను అంటరాని శతృవునే
అసలైన అంటరానితనంలో
ఆ జీవి కూడా ఇపుడు!
*
ముకుంద రామారావు గారి ‘ నేను నేనే ‘ భావ గర్భిత స్వగతానికి సొంపైన, ఇంపైన అక్షరరూపం.
సమకాలీన అంశాలతో కవిసంగమిస్తే వినా
అనుభూతివాదం పురుడుపోసుకోజాలదని మరోసారి ఈ కవిత
స్పష్టం చేసింది.
కవికి మనఃపూర్వక అభినదనచందనాలు.💐
ధన్యవాదాలు అండి ..
బాగుంది …. ప్రస్తుత స్థితి కి అద్దo< పడుతూ .
ధన్యవాదాలు అండి ..