నియంతలు ఎప్పుడూ పీడ కలలే కంటారు. మెలకువలో కూడా భయంతోనే బతుకుతుంటారు. ఆ భయం వాళ్లకి సమస్త నమ్మకాల్ని ద్వంసంచేస్తుంది. మనుషుల మీద వ్యవస్థల మీద నమ్మకం పోగొట్టుకొంటారు. ప్రతి అంశాన్ని అదుపులో ఉంచుకోవడానికి సర్వశక్తులు ఉపయోగిస్తారు.
నియంతృత్వం వల్ల మొదటగా హింసించబడేది –స్త్రీలు, హీనవర్గాలు, పిల్లలు — ఫ్రజలు ఏమి తినాలో, ఏమి కట్టుకోవాలో, ఎక్కడ ఉండాలో, ఎలా బతకాలో ఈనియంతలే నిర్ణయిస్తారు . సమస్తం తమ అదుపులో ఉండాలని నమ్ముతారు.
ఈ పోకడలకి ఏ దేశమూ ,సమాజమూ, కాలమూ మినహాయింపుకాదు. అలాగే ఈ నియంతల అంతమూ రుతువులు మారినంత సహజం.
ఇలాటి సందర్భంలోనే నియంతృత్వ చట్టాలకి ఎదురు తిరుగుతారు.. మానవత్వంపట్ల విశ్వాసంగల Fahmida Riaz లాటి వ్యక్తులు . తమ కార్యరంగాన్ని ప్రజాసమూహాలకి చేరువ చేస్తారు. ప్రజల పక్షాన ప్రజల క్షేమం కోసమే పోరాడుతారు .
జనరల్ జియా అనుసరించిన ఇస్లామీకరణ తంతు నేపధ్యంలో పాకిస్తానీ స్త్రీవాద కవయిత్రి ఫహ్మీద రియాజ్ ప్రకటన ఈ రచన . నియంతలకి ఎదురు నిలిచి “కలలు కని, ప్రజల్ని కలల్లో ముంచెత్తి ” మెరుగైన లోకం కోసం నడిచిన ఎంతోమందికి ప్రతినిధి ఆమె. ఆమె నవంబరు నెలలో కన్నుమూశారు. ఆమెకి నివాళి .
*
ఈ నల్లటిముసుగుతో నాకేమి అవసరం, తండ్రీ !?!?
ఇంతటి కనికరమెందుకు నాపై ?
ఈ ముసుగుతో ఇలా ఎందుకు సత్కరిస్తున్నవు, ప్రభూ?
నా ఏడ్పుల్ని ప్రపంచానికి చాటి చెప్పేంత దుఖంలో లేనే
చీకట్లో దాక్కోవాల్సినంత గుప్తరోగాలతో నేనేమీ చింతించడంలేదే
పాపిని కాను, నేరచరితనూ కాను ,
కటిక చీకటి మచ్చను నుదిటిపై పొడిపించుకోవడానికి !
మరీ బరితెగించిన దాన్నని తలవకుంటే
నా బతుక్కి భరోసా ఇస్తానంటే
ఈ నా విన్నపాన్ని నీ చెవిని వేస్తా –బిడియంగానే !
ఓ! మగరాజుల మహారాజా !
మీ సుగంధసాలల్లో మీ కరుణ కోసం
ఒక మృతజీవి మురుగుతోంది
ఆ కంపు ఏనాటిదో ఎవరికి తెలుసు –?
నీ జాలికోసం శోకిస్తోంది —
అధినాయకా! కాస్త నిదానించండి
నాకివ్వజూపే ఈ నల్లటి ముసుగుతో
నీ మహల్లో పడున్న దిసమొలని కప్పెట్టు-
ఆ శవాల కుళ్ళు సందుసందుల్లో గడపగడపకి
తల బాదుకొంటోంది… కప్పేయ్ ఆ శవాన్ని!
శరీరాన్ని కప్పేసినా ,
నువ్వు నల్లముసుగు బహుమతిగా ఇచ్చినా
ఎందుకు ఆ హృదయం నగ్నంగా విలపిస్తోందో ,వినిపించుకో–
ఎవరు వీరు? ఖచ్చితంగా నీకెరుకే ఓ సర్వజ్ఞాని,
వీరు, నీ అధికారం క్రీగంట బానిస బాలికలు
ఈ బందీల శరీరాలు ఓ రాత్రికి అనుమతించబడ్డ విందు కదా ,
మరి — తెల్లారితే ,, వీరే నీడలేని చూలాళ్లు కదా —
నీ రేతస్సే కారణం ..
ఐనా వారి బిడ్డల కెక్కడిది నీ ఘనమైన వారసత్వం
వీరికీ గౌరవమే గొప్ప అంటావు.
ధర్మపత్నులు, వీళ్లు !
పెళ్లిప్రమాణాల్ని నెరవేర్చడానికి తమ వంతు కోసం
వరుసల్లో నిరీక్షిస్తూ —కన్నెకుసుమాలు —
అమాయక నెత్తుటి మెరుపులతో నీ నెరిసిన గడ్డానికి
ఎరుపు మరకలద్దేలా
వీరి శిరస్సుల్నేగా పిత్రుస్వామ్య ఆశీస్సులతో నీ హస్తం తాకింది ?
రక్తాశ్రువులు!
నీ పరిమళాల మహల్లో
జీవితం స్రవించిన , రక్తాశ్రువులు
తరతరాలుగా బంధిచబడ్డ కళేబరం –
మానవత్వం చంపబడుతున్న భీభత్స దృశ్యం
చాలు, ఇక చాలు…
ఈ ప్రహసనానికి ఇప్పుడే ముగింపు, తెర దించు!
దొరా! కప్పెట్టు నీ శవక్రీడని
నాకు కాదు, ఈ నల్లముసుగు నీకు అవసరం ఇప్పుడు !
“నేను” … నీ వ్యామోహానికి ,కామానికి నామమాత్ర గుర్తుని కాను !!
చూడు….
జీవిత రహదారుల్లో , చూడు,చూడు,, నా జ్ఞానం ఎలా ప్రకాశిస్తుందో !
అవని నుదుట ఒక స్వేదబిందువు ధగధగా మెరిస్తే అది నా కర్మశీలత !
ఆ నాలుగు గోడలు.. ఆ నల్ల ముసుగు ..(chadur aur char diwari)
కుళ్లిన శవాలనే దాచిపెట్టనీ
ఈ స్వేచ్ఛా వాయువులు —
రెపరెపలాడే ఈ తెరచాప-
ఉరకలెత్తే నా నావ —
నవీన మనీషి సహచరిని నేను !
నా ప్రేమనూ నమ్మకాన్ని గెలిచినవాడు అతడు!!!
(English translation from urdu by Rukhsana Ahmad –WE SINFUL WOMEN)
చిత్రం: రాజశేఖర చంద్రం
*
Fahmida Riaz ( 28 July 1946 – 21 November 2018 ) was a Progressive Urdu writer, poet, human rights activist and feminist of Pakistan.
She authored Godaavari, Khatt-e Marmuz, and Khana e Aab O Gil, the first translation of the Masnavi of Jalaluddin Rumi from Persian into Urdu. The author of more than 15 books on fiction and poetry, she remained at the center of controversies and accused of using erotic and sensual expressions in her poetry considered taboo for women writers.
Fahmida Riaz was faced with challenges due to her political ideology. More than 10 cases were filed against her during General Ziaul Haq’s dictatorship. She was charged with sedition under Section 124A of the Pakistan Penal Code. Fahmida Riaz fled General Zia-ul Haq’s religious tyranny and sought refuge in India and spent seven years there. Her friend the renowned poet Amrita Pritam spoke to the then Indian prime minister (late) Indira Gandhi and got her asylum in India.
Fahmida Riaz asserted that “feminism has so many interpretations. What it means for me is simply that women, like men, are complete human beings with limitless possibilities. They have to achieve social equality, much like the Dalits or the Black Americans.
The poems from her collection Apna Jurm Sabit Hae reflect her homeland’s experience under the dictatorship of General Zia-ul-Haq. By reputation, Riaz stands alongside Nazim Hikmet, Pablo Neruda, Jean-Paul Sartre and Simone de Beauvoir.
~ From Wikipedia