జూలై ఆరు నుంచి ఎనిమిదో తేదీ దాకా ఫిలడెల్ఫియాలో జరుగుతున్న నాటా సభల సందర్భంగా “సారంగ” పక్ష పత్రిక సహకారంతో నిర్వహించిన కథలూ, కవితల పోటీలలో అటు తెలుగు రాష్ట్రాల నుంచి, ఇటు తెలుగేతర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ఎంట్రీలు వచ్చాయి. దాదాపు రెండు వందల కథలూ, రెండు వందల యాభై కవితలూ జూన్ ఒకటి గడువు తేదీ ముగిసేనాటికి అందాయి. ఆ తరవాత కొన్ని ఎంట్రీలు వచ్చినా, వాటిని సాహిత్య పోటీలకు స్వీకరించలేదు.
ఈ పోటీలకు కొత్తగా రాస్తున్న నవయువ రచయితల నుంచి ప్రసిద్ధులైన రచయితలు కూడా తమ రచనలను పంపించారు. రచనల న్యాయ నిర్ణయం రెండు దశల్లో జరిగింది. మొదటి దశలో అంటే ప్రాధమిక పరిశీలనలో దాదాపు సగం పైగా రచనలు వడపోత అయ్యాయి. పంపిన రచనలో అంటే కథ గానీ, కవిత గానీ వాటికి సంబంధించిన లక్షణాలు లేకపోవడం, కనీసం భాషా పరిజ్ఞానం లేకపోవడం వంటి మౌలికమైన అంశాల వల్ల ఆ రచనల్ని తొలగించాం. రెండో దశలో కథల్ని ప్రసిద్ధులైన రచయితల ముందు వుంచాం. వారి నిర్ణయం మేరకు ఇప్పుడు బహుమతులు ప్రకటిస్తున్నాం.
కథల పోటీలకు మొదటి బహుమతి పదిహేను వేలు, రెండో బహుమతి పది వేలు, మూడో బహుమతి అయిదు వేల రూపాయలు నిర్ణయించాం. కాని, బహుమతుల నిర్ణయం విషయానికి వస్తే న్యాయ నిర్ణేతల మధ్య విస్తృతమైన తర్జన భర్జనలు జరిగాయి. అన్ని రచనలనీ పదేపదే చదివిన తరవాత ఎక్కువ స్కోరు సాధించిన ఆరు కథలూ సమాన ప్రతిభతో వున్నాయని న్యాయనిర్ణేతలు భావించారు. ఇతివృత్తం ఎంపికలో, శిల్పంలో, కథాకథన నిర్వహణలో ఈ ఆరు కథలూ సమానమైన పాయింట్లు సాధించడం వల్ల బహుమతి మొత్తాన్ని ఆరు కథలకు సమానంగా పంచాలని న్యాయ నిర్ణేతల కమిటీ, నాటా సాహిత్య కమిటీ అభిప్రాయ పడ్డాయి. అయితే, కథలతో పోల్చినప్పుడు కవిత్వం విభాగంలో మాత్రం నిర్ణయం కొంత తేలిక అయింది. ఆ మేరకు ఈ బహుమతుల్ని ప్రకటిస్తున్నాం. న్యాయ నిర్ణేతలూ, నాటా సాహిత్య కమిటీదే తుది నిర్ణయం. దీనిపై ఎలాంటి ఉత్తర ప్రత్యుత్తరాలకూ తావు లేదు.
కథల పోటీ
1.నీడనివ్వని చెట్టు, మొయిదా శ్రీనివాస రావు, విజయనగరం
2. జూదం , ఎండపల్లి భారతి, దిగువబురుజు గ్రామం , మదనపల్లి తాలూకా.
3. బతుకు ప్రశ్న, దాముగట్ల హిదాయతుల్లా , అనంతపురం
4. గంటారావం, తాడికొండ శివకుమార శర్మ, వర్జీనియా, అమెరికా
5. అనగనగా ఒక చేప , వి. పోతన్న, కర్నూలు
6. సాయిబోరి పిల్ల, మేడి చైతన్య, హైదరాబాద్
కవిత్వ పోటీలు:
మొదటి బహుమతి అయిదు వేల రూపాయలు : “యుద్ధ నౌక” పుప్పాల శ్రీరాం, రాజమండ్రి
రెండో బహుమతి మూడు వేల రూపాయలు: “ఖాళీ గడప” పాయల మురళీ కృష్ణ, మెంటాడ, విజయనగరం జిల్లా
మూడో బహుమతి వెయ్యి రూపాయలు : “నిత్య గాయాల నెలవంక” సిరికి స్వామినాయుడు, పార్వతీపురం, విజయనగరం జిల్లా.
విజేతల రచనలను త్వరలో “సారంగ” పక్ష పత్రికలోనూ, జూలైలో నాటా సభల సందర్భంగా వెలువడే ప్రత్యేక సావనీరులోనూ ప్రచురిస్తాం. ఈ పోటీలలోఉత్సాహంతో పాల్గొని, విజయవంతం చేసిన రచయితలకు మొదట కృతజ్ఞతలు. తరవాత ఈ పోటీలకు వచ్చిన రచనలను ఎంతో శ్రద్ధతో చదివి, ప్రాధమిక పరిశీలనలో వడపోసిన “సారంగ” పక్ష పత్రిక కథా, కవిత్వ సమీక్షకులకు ధన్యవాదాలు.
ఎన్నో పనుల మధ్య కూడా సాహిత్య తపనతో, కొన్ని వందల రచనలు చదివి, తమ నిర్ణయం తెలియజేసిన ప్రసిద్ధ రచయితలు దాదా హయాత్, కల్పనా రెంటాల, నారాయణ స్వామి వెంకటయోగి, రవి వీరెల్లి గార్లకూ, చివరి దశలో న్యాయ నిర్ణయం కష్టమైన సందర్భంలో మళ్ళీ ఈ రచనలు చదవడమే కాకుండా, న్యాయ నిర్ణయంలోనూ సహకరించిన మెట్టుపల్లి జయదేవ్, తిమ్మాపురం ప్రకాష్ గార్లకు ధన్యవాదాలు. ఈ రచనలను తమ పత్రికలో ప్రచురించడానికి అంగీకరించిన సారంగ సాహిత్య పక్ష పత్రిక ఎడిటర్లు అఫ్సర్, కల్పనా రెంటాల, రాజ్ కారంచేడు గార్లకు నాటా తరఫున కృతజ్ఞతలు.
-నాటా సాహిత్య కమిటీ
గమనిక: పోటీకి ఎంపిక కాని రచనల్ని రచయితలు తిరిగి “సారంగ’లో ప్రచురణకి పరిశీలన కోసం పంపించవచ్చు. ఆ రచనల ప్రచురణ “సారంగ” సంపాదకవర్గం నిర్ణయంపై ఆధారపడి వుంటుంది.
Congratulations to all the prize winning poets.
థ్యాంక్యూ సార్.
విజేతలకు అభినందనలు
థ్యాంక్యూ సార్
Congratulations to all winner’s…
విజేతలకు అభినందనలు.
యం.ప్రగతి
థాక్సండి
Thankyou sooooomuch madam
Thankyou NATA sahitya kamiti and saranga team.
విజేతలకు అభినందనలు. ప్రత్యేకంగా…
ఉత్తరాంధ్ర సాహిత్య కేతనం ఎగరేసిన …
మొయిద, పాయల, సిరికి లకు జేజేలు.
మిగతా విజేతలూ జై!
థాంక్ యూ
కథ, కవితలపోటీలలో విజేతలకు నా అభినందనలు.
థ్యాంక్యూ
విజేతలకి అభినందనలు. ఉత్తరాంధ్ర యువకిశోరాకు ప్రత్యేకంగా
విజేతలందరికీ అభినందనలు. ఉత్తరాంధ్ర యువకిశోరాలకు ప్రత్యేకంగా
థ్యాంక్యూ వెరీ మచ్
విజేతలందరికీ హార్దిక అభినందనలు.
నాటా వారికి…..సారంగబృందానికి….హృదయపూర్వక ధన్యవాదాలు