అక్షరాలకే పరిమితమనుకున్న
యుద్ధం
ఇప్పుడు
మన ఇంటిముందు
రక్తపు కల్లాపి చల్లేసిపోయి
ఆధిపత్యపు వాసన కొడుతుంది.
కానీ
నాన్న నాకెందుకో భయమేస్తుంది!
నాన్న
ఒకప్పుడు నువ్వు మూసేసిన
బంకరు
నాకిప్పుడు బడైపోయింది.
యుద్ధమే
బతుకు పాఠమైపోయింది.
కానీ
నాన్న నాకెందుకో భయమేస్తుంది!
అర్ధరాత్రి అమ్మ…
నువ్వు చెప్పిన కథలన్ని
తిరగేసి చెప్తుంది.
కానీ
ఒక్కటే తేడా
నువ్వేన్నడు చెప్పని కొత్తపదాలెన్నో వాడుతుంది.
మరణం-రణం
రౌద్రము-రక్తము
కానీ
నాన్న నాకెందుకో భయమేస్తుంది!
నాకిక్కడ
మనింటి కిటికిలోంచి
చూసినప్పుడు
ఆగకుండా పేలుస్తున్న
అగ్నిగోళాలు పడుతుంటే
ఎవరో ఎక్కడో
చెప్పకుండా పండగ చేసుకుంటున్నట్లుంది.
కానీ
నాన్న నాకెందుకో భయమేస్తుంది!
నువ్వు భవిష్యత్ కు చిహ్నమని చెప్పిన
రంగురంగుల
భవనాలకు
నేడు వాళ్ళు నల్లరంగు తోడుగుతుంటే,
నా నల్లని కనుపాపల్లో
స్మశానమే నిర్మితమై
నాన్న నాకెందుకో ఇంకా భయమేస్తుంది!!
*
(యుద్ధంలో మరణించిన ఒక నాన్న కోసం)
చిత్రం: రాజశేఖర్ చంద్రం
be strong
Too good
Aur likho
Yesreach