స్వార్థం నీది
నేరం నీది
పాపం నీది
నాకెందుకీ శిక్ష
నిర్లక్ష్యం నీది
మూర్ఖత్వం నీది
మొండి వాదన నీది
నాకెందుకీ ఖర్మ
దగా నీది
మోసం నీది
వంచన నీది
నాకెందుకీ దైన్యం
తప్పు నీది
తడబాటు నీది
తెలివితక్కువతనం నీది
నాకెందుకీ తండ్లాట
గర్వం నీది
ఘోరం నీది
గడిబిడి నీది
నాకెందుకీ గుండెకోత
అయోగ్యత నీది
అయోమయం నీది
అశక్తత నీది
నాకెందుకీ అభద్రత
దురాశ నీది
దుర్మార్గం నీది
ద్రోహం నీది
నాకెందుకీ దరిద్రం
వేషం నీది
ఆవేశం నీది
అవివేకం నీది
నాకెందుకీ కష్టం
నీ అధికారం కోసం
నా ఆనందం మింగేశావు
నీ చిరునవ్వుల కోసం
నా చితి మంటలు రాజేశావు
నా సమాధి మీద పీఠం వేసుకొని
శ్మశానాన్ని పాలిస్తావా
సెకనుకో ప్రాణం తీసి
దెయ్యాల రాజ్యం ఏలేస్తావా?
*
Add comment