1
దాంపత్యం
అడిగావుగా,
జుర్రుకో..
జీవితాన్ని అంటూ,
చన్ను అందించింది.
‘మోహ’మాటంగా తలదించుకున్నా.
అలవోకగానే,
అపార్థం చేసుకుంది.
స్వర్గం నోటికందిస్తుంటే,
పాతళంలోకి దిగజారతావేమని-
తొడపాశం పెట్టింది.
2
పడిగాపులు
చుక్కలను చిన్నబుచ్చే వన్నెలతో..
చెలరేగిపోతున్నాడు చంద్రుడు
పూల పరిమళాల దోపిడీకి..
ద్వారాలు తెరిచింది చలిగాలి
పునర్యవ్వనం కబురు కోసం..
చెట్టు చెవులు విప్పార్చుకుంటోంది
సంద్రాన్ని సందిట బంధించే ఆరాటంతో..
సుదూరంగా విరుచుకుపడుతోంది అంబరం
వెచ్చని ఊపిరిని పంచే సెగలతో..
ఎగసిపడుతున్నాయి ఆమె ఊహలు
నలిగిపోతూ, ఒంటరిగా రగిలిపోతూ..
పగబట్టిన విరహం చొరబడిన దేహం
ఆమె తిరిగి వచ్చు తోవల్లో..
తొంగిచూపుల పడిగాపులు
*
చిత్రం: సృజన్ రాజ్
మోహ, విరహాల కలనేత..
మధుపాత్రకు పర్యాయమైన కైత!
Tnq boss
Too good poem/s. Congrats
ధన్యవాదాలు సార్