ఉణుదుర్తి సుధాకర్ గారి తూరుపు గాలుల కథల సంపుటి ఆగష్టు 12న ఆవిష్కరించబడింది. “ఎంత కాలమైంది ఇలాంటి నాణ్యమైన కథలు చదివి,” అన్నారు, “చరిత్రని కథలుగా మలిచి, వర్తమానానికి సూచీలుగా చూపించిన కథలు,” అని కూడా అన్నారు. “ఇంత చక్కటి భాషేమిటండీ,” అని ముచ్చట పడిపోయారు. తెలుగు సాహిత్యంలో పది కాలాలపాటు నిలబడిపోయే కథలని తీర్మానించారు.
ఆనాటి సభలో ముప్పయ్ ఏళ్ల లోపు పిల్లలు తమకిచ్చిన అతి కొద్ది సమయంలో ఆరిందాల్లా కథల సారాంశాన్ని సభికులముందు విశ్లేషించి, యువతరం సీరియస్ గా ఉండదన్న వాదాన్ని తప్పని నిరూపించడం ఒక ప్రత్యేక ఆకర్షణ. సీనియర్లు కూడా ఈ విషయాన్ని ప్రత్యేకించి గుర్తించడం బలే హుందాగా అనిపించింది. ఇక హేమాహేమీలు ప్రొ. హరగోపాల్, జయధీర్ తిరుమలరావు, ప్రభాకర్ ఏ.కె., ఓల్గాల గురించి చెప్పేదేముంది?
ఈ సందర్భం కోసం ప్రభాకర్ ఏ.కె. రచయితని ఇంటర్వ్యూ చేశారు. ఇంటర్వ్యూలు ఎంత అర్ధవంతంగా, ప్రయోజనాత్మకంగా చేయొచ్చో ఈ కింది ఆడియో వింటే తెలుస్తుంది. పనిలోపని పబ్లిషర్ ‘ఛాయా’ కృష్ణమోహన్ బాబు ని కూడా ముగ్గులోకి లాగారు ప్రభాకర్.
ఆ ముచ్చట్లు మీరూ వినండి –
Such an insightful interview. It pulled the core out of the writer.. Thank you Prabhakar sir.. Thank you Saaranga.
AK garu & Saranga..Thank you so much for both interviews.
మంచి ఇంటర్వ్యూ , కథలు చదవాలనే ఆసక్తి రేకెత్తించే లా సాగింది. ప్రచురణ కర్త ,రచయిత ఒకేసారి అభిప్రాయాలను
పాఠకులతో పంచుకోవటం మంచి ప్రయోగం .పుస్తకం ఆవిష్కరణ విశాఖపట్నం లోనూ జరిగితే మరింత మందికి చేరువవుతుంది.
రెండు మూడు వ్యాసాల విస్తృతి ఈ ఇంటర్వ్యు
వినటం హాయిగా ఉంది.
ప్రస్తుత పరిస్థితుల మీద, “నిజమే, ఒక ఉదాసీనత, ఒక నిర్లిప్తత ప్రజలలో ప్రస్తుతం నెలకొని ఉంది.”
“తెలుగు సాహిత్యం గురించి మాట్లాడాలన్న, చదవలన్నా, రాయాలన్నా, కొంతైనా చదవాలి కదా! ముఖ్యంగా రాయాలంటే కొంత చదివుండాలి.”
బిగ్ బాస్ ఒక గేమ్ షో. దానికి సాహిత్య రంగలో రచయితల శిబిరాని కి పోలిక ఒక క్షణం నవ్వుకోవడానికి బాగానే ఉంటుంది. చి న కాని అది సరి కాదు. చి న
ప్రభాకర్, ఈ రచయిత సుధాకర్ అంతరంగాన్ని చక్కగా పట్టుకుని ఆవిష్కరించ గలిగారు. అలాగే ప్రచురణకర్త, ‘ఛాయ’ మోహన్ బాబు ని కూడా. రచయితలున్నారు, పాఠకులున్నారు కాని వారిద్దరికి కావల్సిన పుస్తకాన్ని ఒక వారధిగా అటుఇటు చేరవెయ్యడానికి ఒక ‘కనెక్ట్’ లేకుండాపోయిందన్నని అందరికి తెలిసిన విషయమే!
ఈ ఇంటర్యూ రికార్డింగ్‍లో ధ్వని / శబ్దం స్పష్టంగా బాగానే ఉన్నా, వేగం కాస్త ఎక్కువైనట్టుంది. మాటల వెమ్మట పరుగెట్టినట్టు అనిపించింది. మాట్లాడుతున్నప్పుడు ఉండే ఒక ‘నెమ్మది’ కోల్పోయినట్టనిపించింది. రెండు భాగాలుగా ఇచ్చి ఉంటే బాగుండేదనిపించింది. వినడానికి శ్రోతకి సులభంగా ఉంటుందనుకుంటాను.
ఉపయుక్తమైన ప్రశ్నలు, అనుభవ సారమైన జవాబులు ,కలగలిపిన సాహిత్య సారం,సారాంశం.అభినందనలు.
“చక్కగా రాస్తున్న యువ రచయితలు మరింత ఎక్కువగా తెలుగు సాహిత్యం చదివి ఉంటే బావుణ్ను. ఇప్పుడు బుచిబాబుని చదవకుండా, చలంని చదవకుండా, రావిశాస్త్రిని చదవకుండా, అలాగె మరి వడ్డెర చండీదాసుని చదవకుండా … ఇవేవీ చదవకుండా మనం రాస్తావంటే … నాకు కొంచం … నేనైతే అలా రాయలేను. భయపడిపోతాను. కొంచవైనా యేదోవక పునాది ఉండాలి కదా. ఎంత మంది గొప్ప రచయితలు రాసారు, రాస్తున్నారు అని కొంచవైనా ఉండాలి కదా. టోటల్ గా ఐసొలేషన్ లో రాస్తే ఇది రాదు. ఏదీ ఆకాశం లోంచి ఊడిపడదు కాబట్టి “
“ ఇద్దరు మావయ్యల కథ “ ను అద్భుతంగా ఆవిష్కరించిన త్రిపుర గారి ఊణుదుర్తి సుధాకర్ గారూ! పైన మాటలన్నందుకు మీ నోట్లో వో గుప్పెడు పందార బొయ్యాలనిపిస్తున్నది. చదవాల్సిన తెలుగు రచయితల జాబితాలో త్రిపుర ( విశాఖ Mrs. AVN కాలేజిలో బుచిబాబు గారికి ప్రియ శిష్యుడు, రాచకొండ బాబుకి నచ్చినోడు అయిన ) త్రిపుర గారినీ తలుచుకునుంటే మీనోట్లో పందారేంది పుట్ట తేనే పోసుందును. మీ తూరుపు గాలుల కథల సంపుటి లోనూ, త్రిపుర కధలు సంపుటి లోనూ 13 కధలే ఉండటం కాకతాళీయం కాదు సుమా.
http://patrika.kinige.com/?p=5708
ఆడియో ఎడిటింగ్ లో వాక్యాల మధ్య మరీ ఊపిరి కూడా పీల్చుకునే విరామం లేకుండా కోసేశారు! అవసరమా?
చాయా మోహన్ సారూ! నాలాంటి నేలక్లాసు పాఠకుడికి కూడా వీజీగా అర్తవయ్యేలా తూరుపు గాలులు బుక్కులోని యీ క్రింద పేర్కొన్న కధల గురించి కూడా మీ ఇంటర్వ్యూలో ప్రస్తావించరా!
“ఇద్దరు మావయ్యల కధ” (అసలు విషయం ఏవిటంటే ఆచరణలో కమ్యూనిజం పూర్తిగా విఫలమైంది.ఒక సిద్దాంతం కోసం జీవితం అంతా ధారపోసాక ఇదంతా వట్టి భ్రమ అని వప్పుకోవడం అందరికీ సాధ్యం కాదు); . . . . “ఏడు కానాల వంతెన” కధ ( పంచాది క్రిష్ణమూర్తి ఎంకౌంటర్ ను గుర్తుకు చేసుకున్న ), . . . .“కొంచం సబ్బు నురగ ఒక కత్తి గాటు” కధ ( మనుషుల్ని చంపడం అంత తేలికేవీ కాదు. మీ వాళ్లు ఇప్పుడిప్పుడే మా దగ్గర నేర్చుకుంటున్నారు అన్న ఏస్సై … నక్సలైట్ల వేటలో నిద్రాహారాలు లేకుండా తిరుగుతున్న ఏస్సై ).
జీవితం లో యీయప్ప (ఉణుదుర్తి సుధాకర్ ) సాధించిన విజయాల వెనుక ఉన్నది త్రిపుర గారి పెద్దమ్మాయి ప్రొ. వింధ్య గారు అని, లిటరరీ టాలెంట్ లో యీయప్పకి తీసిపోని వోడు కుర్రాడు జైదీపు అని కూడా మీ ఇంటర్వ్యూ ( రెండో భాగం లో) చెపుతారు కదా సామీ
Great talk. Glad to know about Sudhakar Garu, Thank you Prabhakar Garu.
ఒక రచయితను పూర్తిగా విశ్లేషించడానికి ఇలాంటి సుదీర్ఘ ఇంటర్వ్యూల అవసరం ఎంతైనా వుంది.మంచిపని చేశావ్ ప్రభాకర్