తానా నవలల పోటీ – 2021

ఉత్తమ నవలకు 2 లక్షల రూపాయల బహుమతి

ఉత్తర అమెరికా తెలుగు సంఘం – తానా (TANA) ప్రతి రెండేళ్లకు ఒకసారి నిర్వహించే నవలల పోటీని ఈ సంవత్సరం కూడా రెండు లక్షల రూపాయల బహుమతితో కొనసాగించాలని తానా కార్యవర్గం నిర్ణయించింది. 1997 నుంచి మధ్యలో కొంతకాలం విరామంతో తానా నవలల పోటీ నిర్వహిస్తోంది. 2017లో తానా నిర్వహించిన నవలల పోటీలో బహుమతికి ఎంపికైన శప్తభూమి, నీల, ఒంటరి, 2019 పోటీలో బహుమతి మొత్తం రెండు లక్షలు గెలుచుకొన్న కొండపొలం నవలలు సాహితీలోకంలో ఒక కదలికను తీసుకొచ్చాయి. తెలుగు నవలారంగంలో కొంతకాలంగా కనబడుతున్న స్తబ్ధతకు ఈ పోటీల వల్ల కొంత సడలింపు వచ్చింది. ఈ వాతావరణానికి కొనసాగింపుగా తెలుగు సాహిత్యంలోనూ, ప్రపంచ సాహిత్యంలోనూ కలకాలం నిలబడే నవలలను వెలికి తీసుకురావాలనే తానా ప్రయత్నానికి స్పందించి ఈ పోటీలో పాల్గొనవలసిందిగా తెలుగు రచయితలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము.

నిబంధనలు

*         నవలలు తెలుగు జీవితాన్ని ప్రతిబింబించాలి.

*         ప్రపంచంలోని ఎక్కడివారయినా ఈ పోటీకి నవలలు పంపించవచ్చు.

*         నవలకు పేజీల పరిమితి లేదు.

*         బహుమతికి ఎంపిక కాని నవలలను తిప్పిపంపడం సాధ్యంకాదు. కాబట్టి జిరాక్స్‌ కాపీలు కూడా పంపవచ్చు.

*         నవలలు తమ స్వంతమని, అనువాదాలు, అనుసరణలు కావని, ఇంతకుముందు ఎక్కడా ప్రచురితం కాలేదని, ఎక్కడికీ ప్రచురణకు పంపలేదని, తానా పోటీ ఫలితాలు వచ్చేవరకూ ఏ ప్రచురణకు, పోటీకి పంపబోమని పేర్కొంటూ హామీపత్రాన్ని జతచేయాలి.

*         నవలలు తప్పనిసరిగా స్పష్టమైన చేతివ్రాతతో కాని, డిటిపి చేసికాని పంపాలి.

*         డిటిపి చేసిన నవలలను  2021tananovel@gmail.comకు పంపవచ్చు.

*         నవలల పై రచయిత పేరు, చిరునామా ఉండకూడదు. అవన్నీ కవరింగ్‌ లెటర్‌ పై ఉండాలి.

*         నిర్వాహకుల నిర్ణయాలపై ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకు తావులేదు. వివాదాలన్నింటినీ అమెరికాలోని ఫిలడెల్పిÛయా న్యాయపరిధిలో పరిష్కరించుకోవాలి.

*         బహుమతి పొందిన నవల ఉన్నత ప్రమాణాలను అందుకునేటట్లుగా ఉండాలన్నది తానా ఆకాంక్ష. ఆ ప్రమాణాలను అందుకునే నవలలు పోటీకి రాని పక్షంలో బహుమతి ఇవ్వకపోవడం కానీ లేదా పూర్తి బహుమతి తగ్గించడం కానీ, ఒకటి కంటే ఎక్కువ నవలల మధ్య పంచడం కానీ తానా నిర్ణయం ప్రకారం జరుగుతుంది.

*         బహుమతికి  ఎంపికైన  నవల  మొదటి  రెండు  ముద్రణలను,  ఇతర  పారితోషికం  ఏమీ లేకుండా ప్రచురించే హక్కు  తానాకు ఉంటుంది.

రచనలు అందవలసిన ఆఖరు తేది: 15 ఏప్రిల్‌ 2021

రచనలు పంపవలసిన చిరునామా                                            ఇతర వివరాలకు సంప్రదించండి

అక్షర క్రియేటర్స్‌, ఎజి-2,                                                                             ఫోన్స్‌:   98493 10560

‘ఎ’ బ్లాక్‌, మాతృశ్రీ అపార్ట్‌మెంట్స్‌,                                                              040-2970 1939

హైదర్‌గూడ, హైదరాబాద్‌-500029.

Email:  2021tananovel@gmail.com

జయశేఖర్‌ తాళ్లూరి                                         జంపాల చౌదరి                                  చంద్ర కన్నెగంటి

తానా అధ్యక్షులు                                             కార్యక్రమ నిర్వాహకులు                    తానా ప్రచురణల కమిటీ అధ్యక్షులు

వాసిరెడ్డి నవీన్

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • Solicit a clarity from Naveen Garu. Do you consider Vaddera Chandidas work ” Cheekatlonchi Cheekatloki ” a novel ?

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు