జీవన సంధ్యలో నను కనుగొన్నావు…

ప్రేమికుల దినోత్సవం ప్రత్యేకం

“సౌరభములేల చిమ్ము పుష్పవ్రజంబు?

చంద్రికలనేల వెదజల్లు చందమామ?

ఏల సలిలంబు పారు? గాడ్పేల విసరు?

ఏల నా హృదయంబు ప్రేమించు నిన్ను?”

అని దేవులపల్లి కృష్ణ శాస్త్రి అప్పుడెప్పుడో కృష్ణపక్షం లో “ఏల  ప్రేమింతును?” అని ప్రశ్న వేసుకుని జవాబు వెతుక్కునే ప్రయత్నం చేసినప్పుడు వెలువడిన కవిత ఇది . పువ్వులు ఎందుకు పరిమళాలు వెదజల్లుతాయో, చందమామ ఎందుకు వెన్నెల వర్షం కురిపిస్తుందో, ఆ సెలయేరు ఎందుకలా అవిశ్రాంతంగా ప్రవహిస్తుందో, అందుకే నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని జవాబు చెప్పుకున్నాడు. సరిగ్గా ఇదే జవాబు ఇంత కవితాత్మకంగా అతడు  చెప్పలేదు  కానీ, ఆ ప్రాకృతిక శక్తులు ఎంత స్వచ్ఛంగా, ఎంత బే  షరతు గా, ఎంత నిర్మోహంగా  తమ తమ విద్యుక్త ధర్మాలను నెరవేరుస్తాయో  అంత అన్ కండిషనల్ గా, అంత బేషరతుగా, అంత నిర్మోహంగా అతడు ఆమెను ప్రేమించాడు.  . ఎల్లలు లేని ప్రేమ తనది. దానికి తర,తమ  బేధాలు లేవు .

ప్రేమించడం లో సాంద్రత, తన్యత ఏదీ లేకుండా నిర్మోహంగా, నిష్కామంగా  ప్రేమించడం ఎవరైనా అతడి  దగ్గర నేర్చుకోవలసిందే . నిజానికి నిజమైన ప్రేమానుభవం ఒక శిఖరం మీద నిలచిన మంచు పువ్వు అనుకుంటే, ఆ పువ్వును చేరుకునే క్రమం లో ఎన్నెన్ని సోపానాలో! అతడు అంత స్వచ్ఛ సుందర శుభ్ర సలిలం లాగా ప్రేమిస్తే ఆమె ఏమంటుంది?

“Love is not a body; it is a soul. And souls never die.” ప్రేమ అంటే ఒక శరీరం కాదు, ప్రేమంటే ఆత్మ. ఆత్మకు మరణం లేదు అంటుంది. ఇంతకంటే గొప్పగా ప్రేమకు ఎవరు మాత్రం నిర్వచనం ఇవ్వగలరు?

చరిత్ర పుటలలో దేవదేసు,పార్వతి లాగా, లైలా,మజ్ను లాగా, సలీం, అనార్కలి లాగా జీవితాన్ని విషాదాంతం చేసుకున్న జంట కాదు ఇది. ప్రేమలో ఎన్ని పరాన్ముఖ కోణాలు వున్నా వాటన్నిటినీ అధిగమించి జీవితాన్ని ఒక యుగళగీతంగా మలచుకున్న జంట కథ ఇది.

పంజాబీ కవిత్వం లో ఫైర్ బ్రాండ్ గా పేరుతెచ్చుకున్న అమృత ప్రీతమ్ ఒకరు. చిత్రలేఖనం లో తనకంటూ ఒక పేరు తెచ్చుకున్న ఇమ్రోజ్ మరొకరు సాహిత్యంలో!  అమృత ప్రీతమ్ ఇమ్రోజ్ ల మధ్య ఉన్న ప్రేమ కేవలం శారీరకమైనది కాదు. అది సహచరత్వం,అవగాహన,వివేచన ముప్పేటలుగా అల్లుకున్న ఒక పొయెటిక్  సింఫొనీ. అది కాలాతీతమైనది. పెళ్లితో ప్రేమకు లెజిటిమసీ వస్తుంది అనుకునే సామాజిక వాతావరణం లో అన్ని సామాజిక నిబంధనలను అధిగమించిన ప్రేమ బంధం అది.  భావోద్వేగ భరిత ప్రేమ కథల్లో వాళ్ళ ప్రేమకథ ది శిఖర స్థాయి

అమృతా ప్రీతమ్   పంజాబీ సాహిత్యం లో మేరు నగ సమాన. దేశ విభజన కాలం నాటి విషాదానికి ఆమె రచనలు నిలువెత్తు అద్దాలు. ప్రేమ, స్త్రీవాదం,దుఃఖం ఆమె కవిత్వం లో ప్రబలంగా కనిపించే అంశాలు. ఆమె కవిత్వం లాగే ఆమె ప్రేమకథకూడా చెప్పలేని,వివరించలేని,అవ్యక్త భావోద్వేగాలతో నిండి ఉంటుంది. అమృత లాగా ఇమ్రోజ్ కవి కాదు, కానీ రంగుల హృదయం తెలిసినవాడు. దుఖానికీ,సంతోషానికీ, ప్రతి భావోద్వేగానికీ ఒక రంగును ఇచ్చేవాడు. రంగుల హృదయ రహస్యం తెలిసి వాటితో సంభాషించేవాడు. ఆమె మాటలతో బొమ్మ కడితే వాటికి అతడు రంగులతో ప్రాణం పోసేవాడు. ఒకరు రాత మరొకరు గీత. వాళ్ళిద్దరి ఆత్మ పేరు ప్రేమ. చిత్రం ఏమిటంటే    వాళ్ళిద్దరి మధ్య ఉన్న బంధాన్ని వాళ్ళు ప్రేమ అని అననే లేదసలు.

“We never used the term ‘love’ or that we loved each other. It was too empty expression”.అని కూడా ఇమ్రోజ్ ఒకసారి అన్నారు. ప్రేమ, ప్రేమ, అని ప్రపంచం కొన్ని కోట్ల సార్లు అనీ అనీ ఆ పదం అరిగిపోయింది కదూ!

ప్రపంచం అంతా ఆమెలోని కవి ని చూస్తున్నప్పుడు అతడు మాత్రం ఆమెలోని అన్వేషణ ను చూసాడు. ఉదయం కాఫీ తయారు చేసి తీసుకుని వచ్చి రాస్తున్న ఆమె చేతికి ఇచ్చి ఆ అపురూపమైన సన్నివేశాన్ని రంగులలో చిత్రించేవాడు. ఢిల్లీ లోని వాళ్ళ ఇల్లు పెయింటింగ్స్,పుస్తకాలు,పెదవి దాటని ప్రేమానుభూతుల పలకరింపులతో ఒక పవిత్రమైన sanctuary లా ఉండేది. ఒకసారి అమృతా ప్రీతమ్ ఇమ్రోజ్ కీ “I have loved you with the silence of a thousand poems.” అని ప్రేమోద్విగ్నత తో రాసింది. ఆ ఉత్తరం చదివి ఉద్విగ్నుడు అయిన ఇమ్రోజ్ బదులు రాశాడు కాన్వాస్ పై కుంచెతో Our souls intertwined like brushstrokes on a canvas.

వాళ్ళిద్దరి ప్రేమ కథ 1950 లో మొదలు అయింది. 2005 లో ఆమె వెళ్లిపోయేవరకు నాలుగు కళ్ళు ఒకే దృశ్యాన్ని చూశాయి. రెండు నాలుకలు ఒకటే మాట మాట్లాడాయి. నాలుగు పెదవులు ఒకే చిరు నవ్వును రువ్వాయి. ఆమె వెళ్ళిపోయిన తరువాత

నువ్వెళ్ళి పోయావు

నిజం ఏమిటంటే నువ్వెక్కడికీ వెళ్ళలేదు

ఆకులు రాలుతున్న చప్పుడు లో

ఇంకా నీ కవిత్వం వింటూనే వున్నాను

మన ముందు గదిలో పరచుకునే

సూర్య కాంతి లో నిన్ను చూస్తూనే వున్నాను

నేనింకా నీ కోసం

ఉదయపు కాఫీ తయారు చేస్తూనే వున్నాను

నువ్వు నిద్ర లేస్తావని

నీకోసం ఎదురు చూస్తూనే వున్నాను 

అనే భావోద్వేగం తోనే ఇమ్రోజ్ 2019 వరకూ గడిపాడు. ఆ తరువాత ఆమె చేయి మళ్ళీ పట్టుకున్నాడు అదృశ్యం గానో, సాదృశ్యంగానో

అమృతా ప్రీతం పూర్వపు పంజాబ్  లోని గుజ్రన్‌వాలాలో 1919 న “అమృత్ కౌర్”గా జన్మించింది.ఆమె  బ్రజ్ భాషా పండితుడైన కర్తార్ సింగ్ హిట్కరీకి ఏకైక కుమార్తె.   ఆమె పదకొండవ యేట తల్లిని కోల్పోయింది. తరువాత ఆమె తన తండ్రితో కలసి లాహోర్ వెళ్ళింది. 1947 లో భారతదేశానికి వలస వచ్చే వరకు ఆమె అక్కడే నివసించింది. తల్లి మరణంతో మీదపడ్ద బాధ్యతలతోను, ఆవరించిన ఒంటరితనంతోనూ ఆమె చిన్నతనంలోనే రచనలు చేయడం ప్రారంభించింది. ఆమె రాసిన కవితల మొదటి సంపుటి “అమృత లెహ్రా” 1936లో తన 16వ యేట ప్రచురితమయింది. అదే సంవత్సరం ఆమె  ప్రీతం సింగ్ ను వివాహమాడింది. వివాహం అయిన పిదప ఆమె తన పేరును “అమృతా కౌర్” నుండి “అమృతా ప్రీతం”గా మార్చుకుంది. కానీ అది విజయవంతమైన వివాహం కాదు. అందులో ఆమె ఉండలేక,బయటకు వెళ్లలేక అవస్థ పడేది. ఆ రోజుల్లోనే ఆమెకు ప్రఖ్యాత కవి సాహిర్ లూథియాన్వీ తో పరిచయం కలిగింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. గీత రచయితగా శిఖర స్థాయికి చేరుకుంటున్న రోజులలో సాహీర్ అమ్రితా ప్రేమకు ఇవ్వవలసినంత ప్రాముఖ్యతను, ప్రాధాన్యాన్ని ఇవ్వలేదు.  1955 లో  రాసిన సునేహదే  (సందేశాలు) కి కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు లభించింది. ఆ విష్యం  తెలిసిన అమ్రితా ప్రీతం ““Oh my God, I did not write Sunehade for any award. If the person for whom it was written has not taken note of it,what do I care if even the whole world has seen it” అని వ్యాఖ్యానించింది.సాహిర్ జీవితం లోకి మరొక స్త్రీ వచ్చింది. అమ్రితా సెవెన్ ఇయర్స్ ను సాహిర్ కీ, తనకూ నడుమ ఉన్న  నిశ్శబ్దాన్ని ఆధారంగా చేసుకుని రాసిం ది.

దుఃఖం, ఒంటరితనం ముప్పిరిగొన్న సమయం లో ఇమ్రోజ్ పరిచయం ఆమెకు సాంత్వన కలిగించింది. ఇద్దరిమధ్యా ఏడేళ్ల వయసు తేడా! అతడు ఆమెను మేడమ్  అని పిలిచేవాడు. ఆమె బాలలు,బలహీనతలు,కలలు, అన్నీ ఇమ్రోజ్ కి తెలుసు. సాహిర్ పట్ల ఆమెకు ఉన్న  ప్రేమ తెలుసు. నిజానికి సాహిర్ పట్ల అమ్రితా ప్రీతమ్ కి ఎలాంటి భావనలు ఉన్నాయో, అమ్రితా పట్ల ఇమ్రోజ్ కూడా ఏవ్ భావనలు అంతే ఇంటెన్స్  గా వున్నాయి.

ఇమ్రోజ్  సహచరుడు, స్నేహితుడు,ప్రేమికుడు,మాత్రమే కాదు అమ్రితా ప్రీతమ్ కి అన్నీ! వాళ్ళిద్దరి మధ్యా  ప్రేమ శరీరంలో కాదు, ఆత్మలో పాతుకుపోయింది.  ఏ కోరికలూ లేకుండా, ఏ ఫిర్యాదులూ  చేసుకోకుండా  ఒకరికొకరు తమ జీవితాలను అంకితం చేసుకున్నారు. ఇమ్రోజ్ ఆమె దీర్ఘకాల సహచరుడు మరియు ఆత్మ సహచరుడు. అమృత మరణించే వరకు వారు నలభై సంవత్సరాలకు పైగా కలిసి జీవించారు కానీ ఒకరి పైన మరొకరు  ఎటువంటి ఆంక్షలు విధించుకోలేదు .   ఒకరిపై ఒకరు బేషరతు ప్రేమకు మాత్రమే కట్టుబడి ఉన్నారు. వారు ఒకరికొకరు ప్రపంచం మొత్తం.  ఇమ్రోజ్ అమృతతో వివాహం కోసం ఎప్పుడూ పట్టుబట్టలేదు.  ఆమె ఇద్దరు పిల్లలను అంగీకరించాడు మరియు నిజమైన తండ్రిలా వారిని ప్రేమించాడు నిజమైన ప్రేమ నిన్ను నిన్ను గా స్వీకరిస్తుంది. నిజమైన ప్రేమకు చర్మ సరిహద్దులు లేవు ఇమ్రోజ్ అమ్రితా ప్రీతమ్ ను అలాగే స్వీకరించాడు..

1980 లో సాహిర్ లుథియాన్వీ హఠాత్తుగా కార్డియాక్ అరెస్ట్ తో చనిపోయాడు. అప్పుడు అమ్రితా  ఆజ్ మేరా ఖుదా మర్ గయా అని రాసుకున్నా, ఇమ్రోజ్ అమ్రితా స్కూటర్ మీద వెళుతున్నప్పుడు ఆమె ఆకతాయిగా ఇమ్రోజ్ వీపు మీద సాహిర్ పేరు రాసినా ఇమ్రోజ్ అస్సలు నొచ్చుకోలేదు. ఎందుకంటే అమ్రితా ప్రీతమ్ మీద ఇమ్రోజ్ కున్న ప్రేమ అసూయా రహితమైనది. Sitting behind him, I would trace Sahir’s name on his back with my bare fingers. “How he bore the weight of these words on his back I do not know. I only knew he accepted me, my madness,” Amrita wrote in her autobiography అని అమ్రితా ప్రీతమ్ తన బయోగ్రఫీ లో రాసుకుంది కూడా

అమ్రితా ప్రీతమ్ గురించి తెలిసిన ఒక రచయిత ఇమ్రోజ్ ను “మీరెప్పుడూ సాహిర్ ని  తల్చుకుని అసూయ పడటమో, అసహన పడటమో చేయలేదా?” అని అడిగితే ఇమ్రోజ్ చాలా పరిణితి తో కూడిన జవాబు ఇచ్చాడు. “లేదు. అసూయ కానీ,అసహనం కానీ ఎందుకు? అమ్రితా కి ఇష్టమైన వాళ్ళు అంటే నాక్కూడా ఇష్టమే కదా! ఆ ఇష్టం తోనే  నేను సాహిర్ ఫోటో నా గదిలో పెట్టుకున్నాను” అని జవాబు ఇచ్చాడు

నలభయ్ ఐదేళ్లు కలసి సహజీవనం చేసారు వాళ్లిద్దరూ. అయినా ఆ సహజీవన మాధుర్యం లోని తనివి తీరని అమ్రితా ప్రీతమ్

ప్రియతమా

జీవన సంధ్యాసమయం లో కనుగొన్నావెందుకు?

కనీసం మధ్యాహ్నం కలిసినా బావుండేది

ఆ అపరాహ్నపు వెచ్చదనాన్ని అనుభవించేవాళ్ళం

 అని ఒక ఉత్తరం లో రాసింది తన ఎనభయ్ అయిదేళ్ల వయసులో. అందుకు ప్రతిగా ఇమ్రోజ్

నువ్వు సంధ్యా సమయం అన్నావు

సంధ్యా సమయమే అయితే ఎంత అద్భుతమైన సంధ్య అది

కలసి ఆ అద్భుతాన్ని  తనివి తీరా అనుభూతించుదాము

అని జవాబు రాశారు

2005 లో అమ్రితా ప్రీతమ్ చనిపోయేంతవరకు ఇమ్రోజ్ ఆమె చేయి వదలలేదు. ఆ తరువాత పద్నాలుగేళ్ళకు 2019 లో ఇమ్రోజ్ కూడా అమృతను చేరుకున్నారు . ఆ పధ్నాలుగేళ్ళు కూడా ఇమ్రోజ్ అమ్రితా కు లేఖలు రాస్తూనే వున్నారు. వాళ్ళిద్దరి లేఖలో “ఖతోమ్  కా సఫర్ నామా ” పేరుతో  హిందీలోనూ ఇన్ ది టైమ్స్ ఆఫ్ లవ్  అండ్ లాంగింగ్ పేరు తో ఆంగ్లం లోనూ లభ్యం అవుతున్నాయి.

అమ్రిత ప్రీతమ్  ఇమ్రోజ్ ల ప్రేమ లేఖలు ఒకటి రెండు

మొదటి ఉత్తరం  అమ్రిత నుండి ఇమ్రోజ్ కి ఒకే వాక్యం నిడివి కలది

“Bombay welcomes its artist”

ఇది ఇమ్రోజ్ ఢిల్లీ నుండి బాంబే వస్తున్నప్పుడు అమ్రిత రాసిన వుత్తరం. ఆ తరువాత బాంబే, ఢిల్లీ నుండి చాలా ఉత్తరాలు నడిచాయి

ఇమ్రోజ్ నుండి అమ్రిత కు

1

Bomay 24th October 1959

My universe

My devotion

I bow to you.

The moment I bow before you, I feel the nine-hundred-mile-long desert that separates us suddenly fades into oblivion.

As long as you are my destiny, I am not scared of any misfortune

yours

Jeetu

ఢిల్లీ నుండి బాంబే కి మధ్య వున్న దూరం 900 మైళ్ళు

ఇమ్రోజ్ నుండి అమ్రిత కు

2

3rd May 1960

My destiny, My Queen

I’m coming to you. This Thursday itself

on the 5th of May, morning at ten, I shall reach your city

Be ready, My Sahiba! I shall bring you back with me in my Neeli,

forever and I shall always look after you.

My noon will mingle with your evening and you shall become

more beautiful and exquisite

just wait for one day more

only one day

we have waited for three long years- long like a life time

All yours Jeeti

అమ్రిత నుండి ఇమ్రోజ్ కి

3

13th February 1960

Khruschev was invited to lunch by Pt. Jawaharlal yesterday

I went there

I like Panditji. He epitomizes all that is beautiful in humanity

I was happy for a while but all of sudden the fact of

being away from you seized me intensely and everything became

meaning-less- the days, the routine, the socialising-everything

Aashi

ఇవాళ కలసి, రేపు ప్రేమించుకుని, ఎల్లుండి బ్రేక్-అప్ చెప్పుకునే ఇన్స్టంట్, ఇన్స్టా  ప్రేమలు ఉన్న  కాలం లో అమ్రితా ప్రీతమ్  ఇమ్రోజ్ ల ప్రేమ కొత్త తరానికి ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు కానీ నిజమైన ప్రేమ కాలాతీతం అని దానికి స్థల, శరీర సరిహద్దులు లేవని తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం ప్రతి ప్రేమికుల దినోత్సవాన వాళ్ళిద్దరినీ తలచుకోవలసిందే!

*

వంశీ కృష్ణ

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు