వికలమైన వాంఛలు
విషాదాంత పాడుతూ
శిథిలావస్థలో కనిపిస్తాయి
దుఃఖనీటిని తుఫానుగా మారిస్తే
హెచ్చరికలు పుడతాయని
నిశ్శబ్దంలో దాచుకుంటాయి
భూతద్దం క్రింద కాగితాన్ని కాల్చడానికి
సూర్య కిరణాల కుట్రవ్యూహం
జ్ఞాపకాల్లో గుండెను చీల్చడానికి
అంతరంగంలో బాధాబావి పుడుతుంది
రాతిగోడలపై గాలి తాకితే
నాచు పడుతుందా?
హృదయ రహస్య గదుల్లో
నొప్పిని కన్నులకు బదిలీ చెయ్యాలి
చెంపల జారుడుబల్ల మీద జారిపోతాయి
శతాబ్దల నాటి శిల్పాలపై
ఉబ్బిన నరాలను చూడండి
ప్రాణవాయువు కోసం పరితపిస్తూ
క్షీణించిన వీరుల గుండెలు కనిపిస్తాయి
(For Varicose veins)
|
పెయింటింగ్: పఠాన్ మస్తాన్ ఖాన్
Add comment