చేదెందుకోయ్ అంటే…

చేదోయ్ చేదు
చేదోయ్ చేదు
చేదుతోంటె చేంతాడంత చేదు
తోడుతోంటె చెరువంత చేదు.

చేదెక్కడోలేదు
నాలోనే చేదు.
అక్కడిక్కడ కాదు
తనువెల్ల చేదు

చేదెక్కడోలేదు
చేదెక్కడోలేదు
నాలోనే చేదు.

ఏం చేదు
ఏం చేదు
నిలువెల్ల చేదు
నిజమైన చేదు

చేదెక్కడోలేదు
చేదెక్కడోలేదు
మనమంత చేదు

అందుకే
జగమంతా చేదు
జగమంత చేదు.

*

ఎమ్. శ్రీధర్

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు