నువ్విక ఏ దీపాలూ వెలిగించకు
నీవు నన్ను చూసి దు:ఖించడం చూడలేను
ఈ ఖాళీతనపు ఉనికి
నన్ను మెల్లగా వశపరచుకుంటోంది
ద్వారాలన్నీ బంధించి
ఇక ఎవరినీ రానీయకు
నీకు తెలిసిన నేను ఇక ఆ నేనుగా లేను!
చీకటి నా కారాగారం ఇక
ఇదే నా నరకమో ఏదో గానీ!
ఇక సవ్వడులన్నీ నిషేధించు
ఆ జీవితాలను అలా సాగిపోనీ
చిత్రం…
నేనింకా సంగీతాన్ని వినగలుగుతున్నాను
కానీ
అది నా గీతం కాదు!
(జాన్ రీడ్ – వ్హిస్పర్స్ ఇన్ ది డార్క్ – స్వేచ్ఛానువాదం)
ఆన్‌లైన్లో దేనికోసమో వెతుకుతుండగా ఒక ఫోరమ్ కనపడింది.. ఫ్యామిలీ ఫ్రెండ్ పోయెమ్స్ అని! ఆ ఫోరమ్ లో ఎవరైనా పోస్ట్ చేయవచ్చు కేవలం ఆంగ్ల కవితలు మాత్రమే! యుకె కి చెందిన ప్రిన్స్ ఛార్లెస్ అనే ఆయన పోస్ట్ చేసిన జాన్ రీడ్ కవిత ఇది. జాన్ రీడ్ అనే ఆయన తన భార్య మరణించిన తర్వాత తన బాధని వ్యక్త పరుస్తూ రాసిన కవితలని కొన్నింటిని చదివాను. అలా అలా స్క్రోల్ చేస్తుండగా ఒక కవిత.. అనువదించకుండా ఉండలేకపోయాను.
నాకు బాగా నచ్చింది. నా అనువాదం చదివినవాళ్ళకి కూడా నచ్చుతుందనే అనుకుంటున్నాను.
painting: Satya Birudaraju
Excellent. It looks like original not translated. Adi naa geetham kaadu mugimpu highlight
థాంక్యూ అండీ
బాగా రాశావు
చిత్రం అనువాదంలోనూ సంగీతం వినబడుతోంది
సర్రియలిజం కి ఇదొక గొప్ప ఉదాహరణ గా చెప్పుకోవచ్చు గీతా గారు. అనువాదానికి మంచి పద్యాన్ని తీసుకున్నారు, న్యాయం చేశారు కూడా!