వారంతా దోసిళ్ళు చాచి
మైదానాల బాట పట్టారువాన వాసనల పచ్చిదనం ఆవిరికాకమునుపేచివరి చినుకును వొడిసిపట్టుకునితడిపొడిగా మేనుకు రాసుకోడానికి***ఏదో ఏరు ఊరవుతుందిఇప్పుడది మరలా ఏరవుతుందినమ్మకాలు కాగితపు పడవలవుతాయివారంతా ఊరేగడానికి***ఎప్పటినుండో వారందరూరసాయనాలు త్రాగి బ్రతుకుతున్నారుఅస్తవ్యస్తంగా గుటకలేస్తున్నారుఅవి వారి కన్నీళ్లే కాబోలుగొంతులో గాఢతలు కరిగించుకోడానికి***అప్పుడెప్పుడో ఆకులు రాలిపోతాయిమరలా చిగుర్చుతాయిఋతువుల దొంతరలు అట్టిపెట్టుకొని వారందరూ విరిగిన దేహాలతో బయలుదేరుతారుతమను తాముతుది పేటికలో భద్రపరుచుకోడానికి.
2
వీడ్కోలు
వీడ్కోలును తేలిగ్గా మోయాలనిఈ రాత్రికి నన్ను నేను నిలువరించుకోవాలనిశతసహస్త్రాలుగా నూరి పోసుకుంటాను.స్పర్శ నిప్పులా అంటుకుంటుందివేలికొసలు వీడకుండానేఅలజడులు జడత్వాలవుతాయికన్నీళ్లు సుడులవకుండానేపావురం రెక్కలు విదిల్చుకుపోతుందిఈకలు రాల్చకుండానేఖాళీ చేతులు కదులుతాయిరేఖలు చెదరకుండానేఎప్పటిలాగే..పునరాగమనం ఎప్పుడనేప్రశ్నవీడ్కోలు ఇతివృత్తపుపాత ముద్రల్లో కలిసిపోతూనేఉంటుంది.*
Add comment