ఆకాశం వైపు చూపించి
అమ్మ చెప్పింది
రేపు పండుగని
ఆకాశం వైపుగా చూసి యెలా
చెబుతున్నావ్ అని అమ్మనడిగా
అమాయకంగా
అప్పుడు నవ్వుతూ
చెప్పింది తను
నెలవంక కనబడినప్పుడే
మనకు పండుగ అని
అవునా!
అంటూ అత్యంత ఆశ్చర్యంతో
నేను
యెన్ని నెలవంకలున్నాయి
మనకు అని మళ్ళా అడిగా
రెండని చెప్పింది
రెండా అంటూ మళ్ళా
నా ప్రశ్న
అవును రెండే
ఆకాశంలో వొకటి
రెండోది నువ్వు
పండుగ రెట్టింపైంది నాకు.
*
చిత్రం: రాజశేఖర్ చంద్రం
Simple and affectionate