కారుణ్యం అనబడు కొంగ్రొత్త మార్కెట్ ! 

1.
వ్యక్తుల నిశ్శబ్దం
కంటెంట్ శూన్యమైన పరస్పరానుభుతిలో
కమ్యూనికేషన్ పలు సున్నాల మిశ్రమం ,
సమీకరణాల సాధన తో పర్వతాలు కొలిచిన
 ఆర్డువేరియస్ కి సైతం
ఎంపతి శబ్దాల డెన్సిటీ ఎందుకు తగ్గుతుంది అందని ద్రాక్ష .
2.
గీతలు గీసుకొని వొంగుళ్ళు దూకుళ్ళు
ఆడుకుంటున్న సామాజిక సిద్ధాంతాలు
ఇపుడు తూటా శబ్దాలు ఎటు నుండి వినిపించాయో
లెక్కలు తేల్చుకొని మరీ ఆట కొనసాగిస్తున్నాయి అట
నిజానికి
రైలు పట్టాల నిలువు గీతలు కాదేమో
నిన్నూ నన్నూ విడదీస్తుంది,
కలపాల్సిన పెట్టెలేవో శవపేటికలై,
ఎవరి ముక్క వాళ్ళం వెతుక్కోవడంలో
మిగిలిన అశాబ్దిక కమ్యూనికేషన్ అంతే.
3.
నైపుణ్యత కలిగిన
మృదువైన అభివృద్ధి నెమ్మదిగా కోతల కి దిగింది చూడు ,
నీకెంతో నచ్చే గెలుపు పెన్మాయకి
మెడ తెగిన జీవాల ముందు కూలబడి
అరచేయి గాట్లు లెక్కేసుకొనే మనిద్దరి రియాలిటీ బైట్స్ ,
కంపాషన్ ఇప్పుడో దిక్సూచి కరువైన కంపాస్ .
4.
వాక్య నిర్మాణం తెలిసిన అక్షరాస్యత ,
భావ నిర్మాణం మరిచి
సామాజిక జీవి కాస్త నీ బాంచన్ జీవి గా మారిన పరిణామ క్రమం .
నియాండ ర్ లోయ ఇపుడొక
తల దించుకొని అనవసరంగా ఎదిగానేమొనని
చింతిస్తూన్న  న్యూ థింకింగ్ ( మ్యాన్) Others .
5.
నువ్వూ, నేనూ
ఎపుడు మేము, వాళ్ళు గా మారామో ,
Others జాబితాలో మన వాళ్ళెవరో ,
పరాయి రాళ్ళు ఎవరిపై విసరాలో తేల్చుకోలేని
సామాజిక మాధ్యమాల హోరు లో
మూగ బోయిన మనసులు ,మనుష్యులు ,
మిగిలింది ఇప్పటికిహా అంతే .
6.
కమ్యూనిటీలు మాత్రమే వాస్తవమైన ప్రపంచంలో
Damn it ! Communication is nothing but a myth.
Empathy is the ability to crucify clear conscious,
And finally compassion is larger than life trade secret .
‘చే ‘ నీ కో కొత్త పోటీ  కాస్కో.
 అర్డువేరియస్ :ఆర్యభట్టు
చిత్రం: రాజశేఖర్ చంద్రం

బ్రెయిన్ డెడ్

6 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • కంపాషన్ ఇప్పుడో దిక్సూచి కరువైన కంపాస్

  • Very post modern satairical expression on human market attitude of life. Felt glad to transform into it.

  • Quite apt and a power packed contemporary poem. As usually your movement between the lines made the reader read in between them. Kudos! Gave the feel that read a poem after a long gap.

    • You are always kind with your words and gestures sir , thanks a million for understanding the difference between reading the lines and reading between the lines . It’s tough to get a ‘ good’ reader these days . Writers tho bahuth hogayee !

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు