రాత్రి నగరం నంజ ముండలా ఉంది అని నిజాలే వాగేయ్యొచ్చు
తాగాక ఏమైనా అనవచ్చు.
మన దమ్మంతా సిగరెట్టు పీల్చే దమ్ములో ఉంది
దారులు చూడు ముసలోడి దొడ్డి కాళ్ళలా ఉన్నాయి
ఇప్పుడో కుక్క మొరిగినా చెప్పిచ్చుకు కొడతా
ఎహే ఇదేంది..!?
తెల్లని చర్మం కోసం వాడమని
నగరం మధ్యలో పెద్ద హ్యాండ్సం, లవ్లీ క్రిమీ బోర్డూ
మాది నల్ల జాతి రా నాకొడకా…
అని గర్వంగా ఒక్క దళిత మేధావి దానిపై చెప్పు విసరని దొంగలు.
అమర వీరుల స్తూపం మీద పావురం రెట్ట.
ఆ తెలుపు చూపెట్టి అదే ఈ దేశపు శాంతిని
ఎవడైనా కుంటికాళ్ళ కాంగ్రెస్ వాడు అంటాడేమో చూడాలి…
ఈ దేశంలో విదేశీ పానీయాలు తాగే వాళ్ళున్నారు జాగ్రత్తా…
వాళ్ళంతా దేశ ద్రోహులు అని ఆకలితో ఉన్న కుక్కని తన్ని
కమలాకాయ రంగు జెండా ఎగరేసిన కుర్రాడు
ఇప్పుడు వాడు పుస్తకాలు చింపి ఈ దేశ సంస్కృతి గురించి మాట్లాడతాడు
వాడు రేపు తప్పకుండా స్టేజీల మీద లెక్చర్లు దంచే లీడరు
మనువుకి రాముడికి పుట్టిన అప్పయ్య
ఇక ఈ రాత్రి తాగుబోతు భాగవతంలో
నగరం ఒక రతి క్రీడ అంటే ఎవరు వింటారు…???
అసలు నగరానికి పగులేంది, రాత్రేంది
ఇక్కడ సూర్యుడు నడినెత్తిన ఉదయించి అన్ని దిక్కుల్లో అస్తమిస్తాడు
ఇలాంటి చోట ఒక సాయంత్రం కోసం వెతుకుతున్నాడు అంటే వాడు కవే.
తెలుగులో రాయకు…
ఇక్కడ పురస్కారాల పడుపు వృత్తి నడుస్తూంది
నీ పుస్తకాలు ఆదివారం రోడ్డు పక్కన
పేవుమెంట్ల మీద పాతోటిల్లో కూడా ఎవడూ కొండూ.
ఓ… గాలి!
ఇది ఎవడి నెత్తురు మీద నుంచి వస్తుందో
చల్లగా ముద్దగా ఉంది.
ఎవరమ్మా నువ్వూ..?
మానం పోయిందని ఏడుస్తున్నావా?!
ఎందుకు ఏడుపు ? నిన్ను ఎంత ఎక్కువ మంది రేప్ చేస్తే అంత మంచిది.
కొన్నాళ్ళు పత్రికలకు సరిపడా సరుకవుతావు.
రోడ్డు మీద ర్యాలీకి ప్లే కార్డ్ అవుతావు.
మనలో మాట ఒకరిద్దరు రేప్ చేసినా, పది మందని చెప్పు
లేకపోతే ఎవరూ పట్టించుకోరు ఇక్కడ.
ఏంటీ నువ్వు నిరుద్యోగివా..?
అయితే రాజకీయ నాయకుల సంక నాకు
చదువుకున్నోల్లకి కాంపిటీషన్ రేస్ పెట్టిన వాడి కాళ్ళు ఒత్తు
వాడి బాబు కార్పొరేటోడి గుద్ద కడుగు
అప్పుడే నువ్వు ఈ దేశంలో సరైన విద్యావంతుడివి అనిపించుకుంటావు.
బాబూ అగ్గిపెట్టె ఇవ్వా!
సిగరెట్టు అంటించుకోవాలి
మనంతట మనం బూడిదవ్వటానికి ఉత్తమమైన మార్గం ఇది.
కానీ ఇంత కటిక చీకటిలో
కనీసం సిగరెట్టు వెలిగించయినా వెలగనేది ఉందని చెప్పాలి.
*
అన్నిటా ఆశలు ,కలలు ద్వంసమై పోతున్న తరానికి,విద్వేషపు నిప్పులో తగలబడిపోతున్న కాలానికి అసలైన ప్రతునిదిగా ఉన్న వాడు ఏం మాట్లాడుతాడో నువ్వూ అదే మాట్లాడావు తమ్ముడు…
ఇది మూగకాలం.కాదు కాదు మూగగా నటిస్తున్న కాలం..నీ వాక్యాలు వర్తమానాన్ని కళ్ళకు కడుతున్నాయి…