తెలుగు కవిత్వంలో కవిత్వం రాస్తూ జీవిస్తున్న కవులందరికీ చేస్తున్న విన్నపం. ఇప్పటిదాకా ఏ పత్రికల్లో, ఏ సంకలనంలో, ఏ సామాజిక మాధ్యమాల్లోను ప్రచురించని మీ కవితలు నాలుగు పంపండి. అందులోంచి ఒక కవితను మేమే ఎన్నుకుంటాం. సిద్ధాంతాలకు, స్టేట్ మెంట్స్కి, జెండాలకు, రంగులకు, సకల వివక్షలకి , ఉత్త అభిప్రాయాలకి, సకల రాజకీయాల ప్రాపకాలకి, వైయుక్తిక, సామూహిక తత్వజ్వర పీడన పీడితులకూ లొంగిపోకుండా వాటినే లొంగదీసే బలమైన కవిత్వం కావాలి. ఇప్పుడు ఇదే ప్రాణవాయువు. పాఠకులుగా సంపాదకులు మీ కవితలను ఎంపిక చేసి ‘తీవ్ర మధ్యమం’ సంకలనంగా వెలువరిస్తారు. సంపాదకులదే తుది నిర్ణయం. మీ కవితలు పంపుటకు చివరి తేది 31/10/2021. కవితలు పంపాల్సిన చిరునామా : oddirajupk@gmail.com .
“కవిత్వం ఇది. ఖబర్దార్”.
– సిద్ధార్థ
– ఎం.ఎస్. నాయుడు
– ఒద్దిరాజు ప్రవీణ్ కుమార్
తోలు చెప్పులు//దండు వెంకట్ రాములు
—————————————-
ఇయ్యాల నేను
మందను అడివిదాంక తోలిన
పెద్దకట్యోంత నాల్గు పొట్టేల్లకు
బ్యారం కుదిరి బయాన ఇయ్యగానే
చెప్పులులేని కాళ్లు గుర్తోచ్చినయి…..
గొర్రెలకు గెట్కేలు ఉసినట్లు
నా అరికాళ్ళు ఎన్నో దినాలసంది
నేర్రెలు వారినయి..
మందను పిల్లలకు సూపి
అంగడిదాంక పోయిన…..
నాలుగు సార్లు అంగడంత తిరిగిన కాని
యాడనా కంటికి కాన్రాలే..
తల్లి దప్పిన గొర్రె పిల్లల అడ్కియిడ్కి
అంగడంతా చుట్టిసేంది కాని
తోలు చెప్పులే కన్పియ్యలేవు….
ఎప్పుడు పోయిన
అంగడిములమలుపు కాడనే ఉంటుండ్రి
అట్లకెల్లే పానం పగటేల్లదాంక దిరిగింది
అయినోడు కానోడు అంగట్ల కనిపిస్తే
పానం చిట్టుమంటుంది
ఎన్నడు కాళ్లుగాలని నాకు పాత సుట్టం
కనబడితే నడిరోడ్డు మీద కాళ్లు కాలి కోతిల బిత్తిరి మొఖంతో
ఎండకు అట్లే దిరిగిన….
ఎన్నడు చెప్పుకేడ్వని నా పాదాలు
ఇయ్యాల అంగడంతా ఆర్భాటంగ
తిరగాలంటే అలోచన చేసినయి
పానం ఉకే నిలవడక మళ్ళీ
అంగడిలకు కాళ్లు పెట్టిన…
నా నడక
దొంగ కోడిపిల్లల గబ్బగబ్బ ముందుకు సాగి
ఎవ్వరు లేని కూర దుకాణం కాడ ఆగి
కిల బోటి రూమాలులో కట్టుకున్న…..
ఇంటి తొవ్వ నాకే కొత్తగా కనబడుతుంది
లబ్బరి చెప్పులు ఎన్ని వచ్చిన
నాల్గు దినాలు నాతో నడిసే
తోలు చెప్పులకే ఆరాట పడిన
ఎన్నడు లేని ఈ సిగ్గు ఇయ్యాల
తోక్కిపడేసే చెప్పుల కాడ
పాదం కరిగె పసిగూనైంది…..
ఈ దినంకి కూడ పాత చెప్పులు
దొరికిన బంగారం దొర్కినట్ల
ఏస్కునేటోల్లు అంగట్లో
నాతో పాటు శానమంది కనిపించిండ్రు….. వాళ్లకు
చెప్పులు లేని పాదాలే కాదు
కంటికి కనబడని మనసు కూడ
లోలోపల ఎంత కరుగుతుందో……
ఇగో.. నిన్నే కూర దించెటప్పుడు
నాలుగు రాళ్ల ఉప్పు దిసెయ్యీ
నా కాళ్లును చూసి ఎన్నో రంగు రంగుల
చెప్పులు నవ్వుకుంటా పొయినయి
మందకాడికి చీకటైతుంది
పిల్లలు కడ్పుకు ఆకలి గొన్నరు
నాలాగ కాళ్ళకు గాదు…
పోతా ఈ అంగడి కాకపోతే ఇంకోటి
నాతోనే నా నీడై నడిసే
ముళ్ళ తోవ్వనుతట్టుకునే తోలు చెప్పులకే మళ్ళంగడి మళ్లీ పోతా…..
(అంటు భార్యతో పసిగూనలా వాదిస్తూ మందకాడికి బోటి కూర సద్ది తీసుకోని గొల్ల కురుమ తాతా పయనం)
కవిత చాలా చాలా బావుంది సార్… వాళ్ళు ఇచ్చిన మెయిల్ ఐడీ కి పంపండి… ఆల్ ది బెస్ట్…
<emసారంగ పత్రిక సంపాదక మహాశయులు శుద్ధ కవిత్వాన్ని ఆహ్వానించి సంకలనంగా ప్రచురించడం చరిత్రక సందడి
అభినందనలు
– కందాళై రాఘవాచార్య