వెతుక్కొంటూ పోతుంటాం జీవితాన్ని ఖాళీ చేసి వెళ్లిన వాటికోసం పొలిమేర దాటి పొలాలు దాటి గాలివాటుగా కొట్టుకుపోతుంటాం ప్రహరీలు దాటి పట్టణాలు దాటి నీటికయ్యలా ప్రవహిస్తూ పోతుంటాం దారి పొడుగూతా బ్రహ్మాస్మి...
కవిత్వం
పుట్టినరోజున
1 ఇవాళ నీకు నువ్వే గుర్తుకు వస్తుంటావు ఉదయం పూలూ, చినుకులూ రాలినట్టు ఒకనాడు ఇక్కడికి రాలావు వాటికి కరిగి, మాయమైపోవటం తెలుసు మరి నీ సంగతి అంటారెవరో 2 తొలిసారి చుట్టూ చూసి వుంటావు కొంత ఆశ్చర్యంగా, కొంత భయంగా వాటి నుండి...
నీకు ఏమి కావాలి ?
నీకు ఏమి కావాలి ? అని ఎవరన్నా అడిగినప్పుడు ఆ సంగతే ఎరుగక జీవితపు చివరి కొసకు చేరుకున్న విషయం ఒక్కసారి నన్ను భయకంపితురాలిని చేస్తుంది. ఏమి కావాలని నీకు అని ఎప్పుడూ నాతో నేను అడగలేదు మన వాంఛితాలు, అవాంఛితాలు ఏవో అన్నీ...
నిశ్శబ్ద చిత్రం
కాస్త కాస్త కరిగే సమయం ఇంకా అంటిపెట్టుకుని వున్న జ్ఞాపకాలు తడిలేని కాలం – ఆవిరైపోయే ఆశలు పల్ పల్ మని శబ్దాలు బహుశా, అవి ఎండుటాకుల శబ్దాలు. ధ్యాసలన్నీ మరుగవుతున్న సంధ్యలలో దోసిట నుంచి జారిపోతున్న ఊసులు. మాటలన్నీ...
కన్నీటి రాళ్లు
అనంత శూన్య అంతరిక్షంలో ఆకాశానికి అన్నీ కళ్లే చెల్లా చెదురై ఘనీభవించిన వాటి కన్నీటి బొట్లేమో అన్నన్ని గ్రహాలు అవి దుఃఖాశ్రువులో ఆనందభాష్పాలో అవి ఎన్నెన్నో ఏ గణితాలూ చెప్పవు మిలమిలమెరిసే నక్షత్రాలన్నీ...
భయంగానే వుంది
ఎందుకో భయంగా వుంది. నేనెంతో ధైర్యవంతురాలిననుకున్నానే ఇదేమిటీ ఇంత బలహీనత పురుగులా ఎప్పుడు నాలో చేరింది ఎందుకో భయంగా వుంది పుట్టిన దగ్గర్నుంచి అబలను చేసేందుకు నా చుట్టూ ఎన్నెన్నో ప్రయత్నాలు అయితేనేం ఉక్కు సంకల్పంతో...
పగటి వేషగాడు
నెత్తురు పులుముకున్న గాయం లాంటి ఆకాశం మీద చీముగడ్డలా వివర్ణుడై కనిపిస్తాడు సూర్యుడు! తెల్లారుతుంది. అరచేతిలో శాశ్వతంగా ఇమిడిన పుండు.. గుండె గాయాన్ని రిపీటెడ్ గా గుచ్చుతుండే ముల్లు! పలకరింపు ఒక కత్తి తునక.. ‘ఇలా...
మెరుపుల వంతెన
దుఃఖమొక్కటే దేహమంతా వ్యాపిస్తూ నిలువునా దహించి వేస్తూంది తెగిపడ్డ అవయవాల చుట్టూ ముసురుకున్న ఈగలులా వాళ్ళు కేరింతలు కొడుతూ దేహము నుండి వేరుచేయబడ్డ మెదళ్ళు కోటి ఆలోచనలను వెదజళ్లుతూ చెట్టు మొదళ్లపై వేలాడుతూ మూయని కనురెప్పల...
పుస్తకాలు
నిరాశ పడను పుస్తకాలు చదవడం మానను రాయడమూ ఆపను. పుస్తకం చదవని నాడు నాకు పస్తులున్న రోజే కళ్ల నిండా పులుము కోక పోతే నా చూపుకు అర్థం లేదు. బయటి నుంచి ఇంట్లోకి రాగానే రెపరెపలాడుతూ ఆహ్వానిస్తాయి కరెంటు లేని నాడు కూడా మా...
అనివారిత…
వాగ్గల్పిత స్వప్నాగాధం స్వప్నాయుధం కలకత్తి కాళ్ళు పాతేసుకుని కలజువ్వని నింగికి సారించే ఎర్రచీమలపుట్ట ఈ బుర్ర పోగుల.. .. కల బొజ్జోని...
దొంగ
కవి ఇంట్లో ఓ దొంగ దోచుకోవడానికి వచ్చాడు కవి చనిపోయి పధ్నాలుగేళ్లయ్యింది. ప్రస్తుతం ఆ ఇంట్లో అతని కూతురు నివసిస్తుంది. ఆమె ఊరికెళ్లినప్పుడు దొంగ టీవి వగయిరాలు ఎత్తుక పోయాడు. తనివి తీరక మరుసటి రోజు మళ్లీ వచ్చాడు...
జమిలి యాత్ర
నువ్వొక కల కంటావు. నేనొక కల కంటాను. కలలో ఎక్కడో మనము కలుసుకుంటాము. అదొక యవ్వన వసంత కాలం *** నువ్వొక దారిన వెళ్తావు. నేనొక దారిన వెళ్తాను. ఏ కూడలిలోనో మనము కలుసుకుంటాము. అదొక జీవన శరత్తు కాలం. *** నువ్వొక మజిలీ చేస్తావు...
ఒంటరి సున్న
ప్రేమకు మూడు ముళ్ళు మొలకెత్తాయి నూరేళ్ల పంట చుట్టూ ఏడడుగుల ప్రదక్షిణాలు! కొస దొరకని మల్లె చెండు కోసం నిశివేళల అన్వేషణలు! ఏనాటికి తీరని దేహ దాహాలు పూలతోటలో ఎడబాటు పూసింది నిశ్శబ్దంగా ఘనీభవిస్తున్న ఒంటరితనం! *...
సంఘర్షణ
ఎక్స్ వై ల హోరాహోరీ యుద్ధంలో గెలుపెవరిది?! ఓటమి ఎవరిది?! చివరాఖరికి ఎక్స్ వై తో కూడుతుందా? ఎక్స్ ఎక్స్ సంధి కుదుర్చుకుని వై ని తరుముతుందా?! ఏదేమైనా ఏదో ఒకటి తప్పనిసరి ఆ పోరు ఎడతెగక తప్పదు సృష్ఠి పరంపరలో అబ్బాయో...
హోరుగాలి
1 హోరుగాలికి రాలిపోతాయేమోనని పువ్వుల్ని కోసి సజ్జలో వేసాను తలుపులు వేసే ఉన్నాయి పూరెక్కలు వడలి నేలరాలిపోయాయి ఏమీ పట్టని చెట్టు గాలికి ఊగుతూనే ఉంది *** హృదయం విరిగి ముక్కలయ్యిందా? అంతకంటే సంపూర్ణమయింది ఏమున్నట్లు! ***...
నగరానికీ ఒక కల వుంది..
1 ఎంతమంది కడుపు చేత పట్టుకొచ్చినా చేయి పట్టుకు చోటిస్తుంది నగరం. చెరువుల్ని, చెట్లనీ మింగేస్తున్నా కక్కలేక మింగలేక చూస్తుందీ నగరం. రోడ్ల మీద ఏరులై పారుతున్న వర్షానికి కన్నీరై పారుతున్న రోడ్డు మీద వ్యాపారికి నగరం బాధ్యత...
కుందుర్తి కవిత: రెండు కవితలు
1 అంకురం మారాకువేస్తున్న ఆకుల మీద ఏడు రంగుల నీటిచుక్కల్ని ఉదయింపజేసే రోజులు కొన్నుంటాయి అప్పుడే విచ్చుకున్న తెల్లటి పూవు వెచ్చగా పొదువుకున్న పుప్పొడిని చిరుగాలై వెదజల్లే రోజులవి పారుతూ అలసిన నదిని...