మరో ఘడియలో
తెల్లవారుతుందనగా
ఒక కల వచ్చి
నా కళ్లపై తచ్చాడి పోయింది
కనురెప్పలను మర్రి ఊడల్లే పట్టుకుని
ఉయ్యాలలూగి పోయింది
ఎండిన కన్నీటి చారికల్ని
ప్రేమగా తుడిచి పోయింది
దిగమింగిన దుఃఖాన్ని
కిటికీ బయటకు విసిరి పోయింది
గుప్పిట నిండా కొత్త జీవాన్ని
గొంతుకలో నింపి పోయింది
చీకటి అలుముకున్న గూట్లో
దీపం వెలిగించి పోయింది
దిగులు దొంతరలను
దొర్లించుకుంటూ పోయింది
అలసిన మనసుకు
జోలపాడి పోయింది
కలవరపడుతున్న కళ్ళను
కలలో నదిలో ఓలలాడించి పోయింది
కలగన్నానా?!
కలే నాకు కలగా వచ్చిందా??!
*
02.
మార్నింగ్ డెడ్ సోల్స్
ప్రతిరోజు ఉదయాన్నే
అతను రెండు కప్పుల
కాఫీ చేస్తాడు
ఒకటి తనకు,
ఒకటి ఆమెకు
రెండు కప్పులూ
ఒకదానికొకటి చూసుకుంటాయి
కాసేపు మాట్లాడుకుంటాయి
అప్పుడెప్పుడో
వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నట్లే
బతికే లేని మనిషికి
కాఫీ ఏంటి? కబుర్లు ఏంటి?
వాళ్ళెవరో తలుపు చాటున
నిలబడి గొణుగుతున్నారు
ప్రేమకు ప్రాణంతో సంబంధం ఏం ఉంటుంది?
ఊహ ఉదయాలకు
ఊపిరి పోస్తుంటే మంచిదేగా..
*
కలలో నదిలో ఓలలాడించి వెళ్ళి పోయింది
అక్క..కవితలు రెండూ బావున్నాయి..
మార్నింగ్ డెడ్ సోల్స్ కొత్తగా అనిపించింది.
శుభాకాంక్షలు అక్క..💐💐