కదలని దేహం 

 కదలని దేహం 

ల్లని నీడలలో
విరిగిన నవ్వొకటి
అమావాస్య చింతతో
రంగులన్నీ అదృశ్యమయ్యాయి
తోక తొక్కిన త్రాచులా
బుసలు కొడుతున్న కాలం ఇప్పుడు
కొండచిలువలా చుట్టేసిన
కలతలు కలవరపెడుతూ
ఇక అలా
కదలని దేహంతో నువ్వు.
**

2.

అలసిన అల

*
సృహలో లేని కలలు
తీరం చేరేది ఎప్పుడూ?
అలని బుజ్జగించలేని
తీరం.
*
అలసిన అల
తిరిగి చేరింది,
నీలోకి
కల,
అదృశ్యం అయ్యింది, మళ్ళీ.
*

లక్ష్మి కందిమళ్ళ

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు