కథకులు పెరిగారు, విమర్శకులు తగ్గారు!

కథకులు పెరిగారు, విమర్శకులు తగ్గారు!

కథకులకు, కథావిమర్శకులకు ఆహ్వానం

ఈ కింది ప్రశ్నలకు మీ సమాధానాలు కూడా పంపించండి. చర్చలో పాల్గొనండి. మీ సమాధానాలు పంపించాల్సిన ఈ-చిరునామా: editor@saarangabooks.com

ఈ సంచికలో సమ్మెట ఉమాదేవి సమాధానాలు చదవండి.

2010 నుంచి 2023 వరకు వచ్చిన కథల పై వస్తు పరంగా, శిల్ప పరంగా మీ అభిప్రాయాలు?

ఒకప్పటి మన తెలుగు సాహిత్యమంతా.. అక్కడొకటి ఇక్కడొకటి రాజకీయ సామాజిక అంశాలను స్పృశించినా.. మధ్యతరగతి ఆర్థిక సమస్యల సంఘర్షణ, ప్రేమలూ, వాటిని దక్కించుకోవడానికి పడే ఆరాటాలతో నిండిన సాహిత్యం ఎక్కువగా వుండేది. తరువాత ఇవే అంశాలతో అలవోకగా చదివించే నవల సాహిత్యం, (డిటెక్టివ్ నవలు) వచ్చింది. 80 దశకంలో.. సాహిత్య గమనం సామ్యవాదం, స్త్రీవాదాల వైపుకి మళ్ళింది. 2010 తరువాత కథా వస్తువు మారి.. సాహిత్యం సామాన్య పాఠకుల స్వంత వ్యాసంగమయ్యింది. కథాంశాలలో అనేక సామాజికాంశాలతో పాటు అస్తిత్వ వాదాలు చోటు చేసుకుని, మాండలిక కథలు కూడా వచ్చి, సాహిత్యాన్ని సామాన్య పాఠకునికి మరింత చేరువ చేసింది. కథాంశాలలో వున్న నేపథ్యం రచనా శైలిని, శిల్పాన్ని మార్చేసింది. కథా వస్తువు మారడంతో పాఠకులతో పాటు జన సామాన్య నేపథ్యాన్ని రచించగల కథకుల సంఖ్య పెరిగింది. పత్రికారంగం ప్రింట్ మీడియా నుండి అంతర్జాలానికి మళ్ళింది. పుస్తకం కొనుక్కుంటేనో.. లైబ్రరీకి వెళ్తేనో తప్ప సాహిత్య పఠనం చేయలేని పాఠకునికి సారంగ, మరి ఇతర వెబ్ మ్యాగజైన్ల వల్ల సాహిత్యం అరచేతికి చిక్కిన తాయిలమయ్యింది.

తెలుగు కథా సాహిత్యంలో గత రెండు దశాబ్దాలుగా వచ్చిన కథలు ఎలాంటి మార్పులని సూచిస్తున్నాయి? వ్యక్తిగతంగా, సాంఘికంగా, అంతర్జాతీయంగా వస్తున్న మార్పులని తెలుగు కథలు ఏమైనా స్పృశించ గలిగాయా?

తెలుగు కథా సాహిత్యంలో గత రెండు దశాబ్దాలుగా పాఠకులు కథలు చదివే ధోరణి మారింది. పెద్దకథల కంటే చిన్నకథలను, వస్తు వైవిధ్యం వున్న కథలను, అనువాద కథలను  వివిధ కథా ప్రక్రియలను ఆదరిస్తున్నారు.

గత రెండు దశాబ్దాలుగా వస్తున్న కథావిమర్శ- మీకు తృప్తినిచ్చిందా?

దురదృష్టవశాత్తు కథకుల సంఖ్య అయితే పెరిగింది కానీ, మనకు సాహిత్య విమర్శకులు చాలా తక్కువయ్యారు. చాలా పత్రికల్లో వీటికి సమాన ప్రాతినిధ్యం కల్పించే శీర్షికలు లేకపోవడం వలన.. పుస్తక పరిచయం, సమీక్ష, విమర్శ వీటిమధ్య వున్న తేడాల పట్ల కూడా అవగాహన లోపం కూడా కారణం కావొచ్చు. కానీ వున్నంత వరకు మనకు గొప్ప విమర్శకులు వున్నారు.

కథాసంకలనాలు తెలుగు కథా ప్రయాణానికి ఏవిధంగా దోహద పడుతున్నాయి?

అప్పుడొక కథ ఇప్పుడొక కథ రాసే రచయితలను.. పాఠకులు కానీ, సాహితీ వేత్తలుగానీ రచయితలను గుర్తు పెట్టుకోలేకపోవచ్చు. కథ సంకలనాలు, సంపుటాలు రచయితలకు ఒక చిరునామాని ఇస్తాయి. రచనలు సమర్థవంతంగా వుంటే మంచి సమాదరణ దొరుకుతుంది.

మీరు చదువుతున్న ఇతర భాషల కథలకు, తెలుగు కథలకు తేడా కనిపిస్తోందా? అయితే అది ఎలాంటి తేడా?

‘తెలుగు కథలు.. ఇతర భాష కథలకు వేటికీ తీసిపోవు అని, మన కథలు వేరే భాషాల్లోకి అనువాదం అయినప్పుడు తెలుగులో ఇలాంటి రచనలు.. ఇంతకు మించిన రచనలు అప్పటికీ ఇప్పటికీ వున్నాయని తెలుస్తుంది కదా’ అని

*

సమ్మెట ఉమాదేవి

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు