అది పన్నెండో శతాబ్దం, సనాతన కర్ణాటక నేల మీద బసవడు దున్నిన నాగేటి చాళ్లు,అనుభవ మంటపాలు, వైదిక క్రతువుల పట్ల నిరసన కు వ్యతిరేకంగా ఆవిర్భవించిన ఒక మిలిటెంట్ కల్ట్ .
చరిత్ర పట్ల ఆశక్తి ఉంటె జీవితానికి సరిపడ సాహిత్యం ఉంది.
ఆ కాలాన ఒక చారిత్రక విస్మృత బ్రతుకులు హరలయ్య – మధవయ్య లవి.
పుట్టుక రిత్యా ఒకరు బాపన మరొకరు మాదిగ. బాపనాయన తన బిడ్డను మాదిగ అబ్బాయికి ఇచ్చి లగ్గం జేయాలి అనే ఆలోచన. బసవడి అనుభవ మంటపం లో వివాహం. జంగమ శరణులు నిర్ణయించిన ఈ సంకర వివాహం నాటి అగ్రకుల సమాజం ను అల్లకల్లోలం చేసింది.
ఈ లాగ్గాన్ని కర్ణాటక రాజు , బసవడి మావ బిజ్జలుడి తో సహా వ్యతిరేకించారు. శరణుల్లో రెండు వర్గాలుగా విడిపోయాయి. కులం గీతలు చెరిపేసుకున్న జంగములు మొత్తానికి ఆ లగ్గం చేశారు.
దేశం మొత్తం అట్టుడికింది. బసవడి పని పట్ల నిరసన.
చివరికి ఆ ఇద్దరి జంట కళ్లను పీకేసి ఘోరంగా చంపేసారు.
ఆ రెండు హత్యలు చిలికి చిలికి గాలి వానగా మారి పెళ్లిని వ్యతిరేకించిన రాజు అయిన బిజ్జలుణ్ణి సింహాసనం మీదనే నరికి చంపారు.
ఆ హత్య వీరశైవం మీద దాడి దిశగా మారింది. రక్తం ఏరులై పారింది. బసవడు దేశం వదిలి మాయం అయ్యాడు.
నాడు ఒక కులాంతర వివాహం జాతి రెండుగా విడిపొయేలా చేసింది.
అవసరం అయితే రాజుని అయినా నరికేస్తాం అని నిరూపించింది .
ఈ దేశం బాబ్రీ విషాద కాలాన గిరీష్ కర్నాడ్ వందల ఏళ్ళు మారినా కుల అంతరాలు రాజేసిన నిప్పు సెగలు పునరావృత్తం అవుతూనే ఉంటాయి అని ఆ విషాద కథను ‘తిలదండ’అనే చారిత్రక నాటకం గా రాసాడు. ఒక రకంగా ఆ నాటకం హిందూ మతోన్మాదం ముందు ముందు లేవనెత్త బోయే ఉత్పాతాలను ముందే ఊహించి చేసిన రచన అది. మధ్య తరగతి బుద్ది జీవులకు ఒక హెచ్చరిక అది.ఆ వికృత రూపాలు ఇవ్వాళ దేశ వ్యాప్తంగా ఒక భయోత్పాతాన్ని కలిగిస్తున్నాయి. గోవింద్ పన్సారే,దబోల్కర్,కల్బురిగి,గౌరీ
ఆ విషాదం మంథని మధుకర్,ప్రణయ్ దాకా వెంటాడుతూనే ఉంది.
గిరీష్ కర్నాడ్ మతం యొక్క క్రూరత్వం కులాల మధ్య కుంపటి ఎలా రాజెసి , నిప్పుల వాగును ఊరిమధ్య ఉంచగలదో చెబుతుంది. అది ఒక కవి బుద్ది జీవి రచనా ఒరవడికి ఉన్న శక్తి. గిరీష్ కర్నాడ్ విద్వత్ ఆ ఒక్క చారిత్రక నాటకం చదివితే అర్ధం అవుతది.
1938 లో కృష్ణ బాయి,డా.రఘునాథ్ అనే ప్రేమికుల కలల పంట. గిరీష్ తల్లి అప్పటికే పెళ్లి అయి ఒక కొడుకుతో రఘునాథ్ జీవితం లోకి మారుమనం బోయింది.ఆరేళ్ల సహజీవనం తర్వాత ఆర్య సమాజ్ లో పెళ్లి చేసుకున్న ఆ జంట ఆదర్శ వివాహాన్ని స్వీకరించే దశలో లేదు లోకం. అయినా కాలానికి ఎదురీది తన బ్రతుకు నావను మొదలు పెట్టారు. ఆనాటికి వాళ్ళది కులాంతర వివాహం, వాస్తవానికి గిరీష్ పుట్టుక ఒక యాదృచ్ఛికం.
గిరీష్ కర్నాడ్ కడుపులో ఉండగానే వాళ్ళ అమ్మ అబార్షన్ చేయించుకో డానికి డాక్టర్ దగ్గరకు పోయిందట. ఆరోజు డాక్టర్ కలవక పోవడం మూలంగా కర్నాడ్ పుట్టాడు.
అరవయ్యో దశకం లో oxford లో చదువు స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్,
చికాగో విశ్వవిద్యాలయం లో అధ్యాపన, పూణే,నాటక అకాడమీ,అనేక నాటకాలు, సినిమాలు,ఇతర ప్రజాసంఘాల సంఘీభావం. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ అన్యాయం జరిగినా గొంతెత్తిన ఆ గొంతు ఈ ఉదయం మూగ బోయింది.
మొదటి నుండి కర్ణాటక ప్రత్యామ్నాయ సాంస్కృతిక విప్లవాలకు పునాది. బసవేశ్వరుని వీరశైవ వ్యాప్తి, అక్క మహాదేవి తత్వాలు, కందుకూరి వీరేశ లింగం చే అన్యాయాంగా అమానవీయంగా ఈసడింపుల మధ్య ధిక్కార స్వరాన్ని వినిపించిన బెంగళూరు నాగరత్నమ్మ సాని బ్రతుకు, సాకేత రాజన్ అలయాస్ సాకి తిరగ రాసిన ఆధునిక కన్నడ చరిత్ర,
దేశ వ్యాప్తంగా స్వాభిమాన ఉద్యామాలకు పునాది వేసిన బసవలింగప్ప రాజెసిన అస్థిత్వ ఉద్యమాలకు పునాదిగా నిలిచిన ‘బూస’ ప్రభావం చిన్నది కాదు. కథ,కవిత్వం,నవల,నాటకం, చరిత్ర రచన, అన్ని ప్రక్రియల లో కన్నడ సాహిత్య లోకం టార్చ్ బేరర్ లా ముందుండి నడిచింది. దానికి గిరీష్ కర్నాడ్ తరం వేసిన ప్రత్యామ్నాయ పునాదులు ఉన్నాయి.
కన్నడ సాహిత్య లోకంలో పురాణ రచనలను వినిర్మాణం చేస్తూ ఆధునిక నాటకం, నవల మిగతా ప్రపంచానికి కొత్త దారులు చూపింది. అనేక ప్రయోగాత్మక సాహిత్య ఒరవడికి కర్ణాటక సమాజం స్ఫూర్తిదాయక మైన పాత్ర పోషించింది.
గిరీష్ కర్నాడ్ నేర్చుకున్న ఆధునిక విద్య సాహిత్యం లో ,సినిమాలో ,నాటక రచన లో మిగతా వాల్లకన్నా భిన్నమైన ఒరవడిగా సాగింది.
మన పీడేల్ రాగాల డజన్ తిక్కవరపు పట్టాభిరామి రెడ్డి దర్శకత్వంలో రూపు దిద్దుకుంన్న స్నేహలతా రెడ్డి నటించిన సంస్కార సినిమాకు స్క్రీన్ ప్లే రాయడం తోబాటు ప్రధాన పాత్ర పోషించి భారతీయ సినిమా ప్రపంచ వేదిక మీద నిలబెట్టిన చరిత్ర మన కళ్ళముందే ఉంది.
ఆయన దర్శకత్వం వహించిన వంశ వృక్షం.
విష్ణువర్ధన్,శంకర్నాగ్,అమ్రేష్ పురి,ఓంపురి,సోనాలి కులకర్ణి, రాజీవ్ మీనన్ ,లాంటి ఎన్నో అరుదైన వ్యక్తిత్వాలు ఆయన మార్గదర్శకత్వం లో రూపు దిద్దుకున్నాయి.
అవే కాకూండా ఉత్సవ్, చెలువి,కాడు, నిశాంత్,మంథన్, లాంటి ఎన్నో సినిమాలు.
యయాతి,తుగ్లక్,నాగమండల, హయవదన లాంటి ప్రజా రంజక రచనలు. ముఖ్యంగా గౌరీ లంకేశ్ హత్య సందర్భం లో జేబులో ఆక్సిజన్ సిలెండర్ పెట్టుకొని బెంగుళూర్ నగరం లో ‘అవును నేను అర్బన్ నక్సల్ నే’ దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయండి అని నినదించిన గొంతు మూగబోయింది.
కర్ణాటక సాహిత్య లోకం లో నవ్య సాహిత్య వాదాన్ని బలంగా ముందుకు తెచ్చిన వాడు కర్నాడ్. అపారమైన జ్ఞానం ఉన్నవాడు, అన్నిటికన్నా ప్రజలన్నా , ప్రజా ఉద్యమాలు అన్నా అంతులేని మమేకత చూపిన వాడు. ఆయన లేని లోటు ఎవరు పూడ్చగలరు ? మోడీత్వ నాజీ నమూనాను తుత్తినియలు చేసి ప్రాణం గడ్డి పూచలా భావించిన ఆయన గురించి మాట్లాడుకోవడం అంటే భారత దేశ యాభై ఏళ్ళ సాహిత్య,సాంస్కృతిక ఉద్యమాన్ని అద్దం లో చూడడం అన్నమాట.
అటువంటి మనిషి మన నుండి మాయం అవడం పూడ్చలేని లోటు. గిరీష్ రచనలు చదవడం మూలంగా ఆంగ్లం లో ఉన్న అనేక కన్నడ సాహిత్యం చదివేలా ఆశక్తి కలిగించినవాడు కర్నాడ్.
రెస్ట్ ఇన్ పవర్ కామ్రేడ్.
నువ్వు నమ్మిన మార్గం మంచిది అయితే రాసే రాతలో చండ్ర నిప్పులు కురుస్తాయి.
దానికి కర్నాడ్ రాజేసిన రచనలు సాక్ష్యం. కత్తుల వంతెన మీద నడిచిన ఈ కాలపు మనిషిగా ఆయన ఆచరణను ఈ లోకం ఎన్నటికీ మర్చి పోదు.
*
గిరీష్ కర్నాడ్ గురించి మంచి విషయాలు తెలియజేశారు. థాంక్స్ అన్నా!
చక్కని వ్యాసం. ప్రయత్నించి దీన్ని ఇంకా విస్తృతం
గా రాస్తే బాగుంటుంది.
It felt the same. The tribute could be extended. For the completeness I copied well written tribute on Grirish Karnad shared by a friend.
https://indianexpress.com/article/express-sunday-eye/defence-against-the-dark-arts-girish-karnad-5388686/?fbclid=IwAR3nKSjsx_S6UdCBSOH6O7qWBysEM_1FFiRltI7VHQCyXqD7Fl2ukvEajUw
రాయవలసింది మరెంతో ఉన్నా ఉన్న సమయంలో చిన్ని అద్దంలో కొండని చూపించేవ్ సీతా. యవ్వనం లోకి ప్రవేశించే సమయంలోనే ఆయన సినిమా రంగ ప్రవేశం వల్లననుకుంటా మాఆలోచనా రీతుల్లో అపారమైన ముద్రవేశాడు. ఆరోజుల్లో సంస్కార చూసి అల్లాడి పోయాం. వంశవృక్ష చూసి కకావికలమయ్యాము. అప్పుడు నాటుకున్న ఆ ధిక్కార బీజాలు ఇప్పటి మా ఆలోచనల్లో వట వృక్షాలై ఉడ లేశాయి. 81 ఏళ్ళ సంపూర్ణ జీవితం, తను నమ్మిన దారిలోనే చివరిదాకా నడవడం అతనికి లభించిన ఓ గొప్ప వరం.
సీతారాములు గారూ…
గిరీష్ కర్నాడ్ గురించి మీరు రాసినది బాగున్నది.కర్ణాటక సాహిత్యం ,సాంస్కృతిక వికాసము ,ప్రతిఘటన చరిత్ర,లోతును తెలియచేసారు .అభినందనలు.
Thank you very much Ranganna..పెద్దగా ఆలోచించలేదు,వ్యాసం గా రాయాలి అను కోలేదు.ఎక్కువ మంది చదువుతున్నారు. సంతోషం. నిర్మాణాల లో ఉండి అందునా నక్సల్ సాయుధపోరాటం లో పాల్గొని అమరుడు అయిన కిషన్ జీ అంత్యక్రియలు. నిర్మాణాల గోల లేకుండా లిబరల్ డెమొక్రాట్ గా ఉంటూ. జ్ఞానపీఠ అవార్డు విన్నర్ కనుక కర్నాటక ప్రభుత్వం లాంచనాల తో అంతిమ యాత్ర నడపడానికి ముందుకు వచ్చినా అదేమీ వద్దు. అని నిరాడంబరంగా మాయం అయిన గిరీష్ అంతిమ గడియల లోనూ పోరాట స్పూర్తిని మిగిల్చిన ఆ కుటుంబ స్ఫూర్తి గొప్పది.ఆయన నెహ్రూ ప్రభుత్వాన్నే వదల లేదు.ఆయన ప్రతి రచన ఒక మాస్టర్ పీస్.
‘అవును నేను అర్బన్ నక్సల్ నే’ దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయండి అని నినదించిన ప్రగతిశీల సాంస్కృతిక సైనికుడు గిరీష్ కర్నాడ్ గొంతు మూగపోదు ప్రియమైన డా. గుర్రం సీతారములు గారూ! అది ప్రగతిశీల భావి తరాలలోనూ నినదిస్తుంది!!
Karnad has been a bitter critic in recent years of the rise of religious fundamentalism in India. He publicly condemned the destruction of the Babri Masjid in 1992; he uses all public platforms to warn of the threat Hindutva poses to secularism, multi-culturalism and the freedom of expression.
నటుడు, చిత్ర దర్శకుడు, నాటక రచయిత, జ్ఞానపీఠ్ పురస్కార విజేత. అంతేకాక జ్ఞానపీఠ పురస్కారంపొందిన ఇద్దరు కన్నడ కవుల కావ్యాలను చలనచిత్రాలుగా వెండితెరకెక్కించిన కీర్తి కూడా ఈయన స్వంతం ( Kanuru Subbamma Heggadathi written by Kuvempu ( K.V. Puttappa ) the first Jnanpith awardee from Karnataka; Samskara movie in 1970 based on a novel by U.R. Ananthamurthy; documentary on D. R. Bendre )
తనకు జ్ఞానపీఠ అవార్డు లభించినప్పుడు, అందరు అభినందించగా వారితో సౌమ్యంగా, వినయంగా -“ఈ పురస్కారం నాకన్నా మరాఠి సహిత్యంలో నాకన్నా నాటకసాహిత్యంలో విశేషకృషి సల్పిన విజయ తండూర్ గారి కిచ్చిన మిక్కిలి సంతోషించి వుండేవాడిని” అని చెప్పడంద్వారా తనకన్న పెద్దవారైన, అనుభవంవున్న, సమకాలీన సాహితివేత్తలమీద గిరీష్ కర్నాడ్ కున్న గౌరవం, అణకువ, అభిమానం కొట్టవచ్చినట్లు కానవచ్చున్నది.
Girish Karnad’s best loved play Tughlaq ( 1964 ) is a compelling allegory on the Nehruvian era, was performed by the National School of Drama. It reflects as no other play perhaps does the political mood of disillusionment which followed the Nehruvian era of idealism in the country.
Karnad himself has commented on this :
“What struck me absolutely about Tughlaq’s history was that it was contemporary. The fact that here was the most idealistic, the most intelligent king ever to come on the throne of Delhi…and one of the greatest failures also. And within a span of twenty years this tremendously capable man had gone to pieces. This seemed to be both due to his idealism as well as the shortcomings within him, such as his impatience, his cruelty, his feeling that he had the only correct answer. And I felt in the early sixties India had also come very far in the same direction “
బాగా రాశారు, సర్!మీ వ్యాసం వల్ల, వారిగురించిపూర్తిగా తెలిసింది!గిరీష్ కర్నాడ్ గారికి,నివాళి!
సంక్షిప్తంగా ఉన్నా మంచి వ్యాసం గిరీష్ కన్నాడ్ పై .Thank you
గిరీష్ కర్నాడ్ మేధావిగా, రచయితగా ఎదిగి వచ్చిన నేపధ్యాన్ని బాగా చెప్పావ్ సీతా, అవును ఆయన కత్తుల వంతెనపై నడిచిన ధీశాలి . నీ మాటలు కర్నాడ్ గారి వ్యక్తిత్వాన్ని పట్టి ఇచ్చాయి.
బాగా రాశారు.
ఆ నాటకం పేరు “తిలదండ” అన్నారు?
నేను ఇన్నాళ్ళూ “తలదండ” అనుకున్నాను. దీన్ని తెలుగులోకి పి. భార్గవీరావు గారు తర్జుమా చేసిన జ్ఞాపకం.
Very well written sir thank you.
గొరుసన్నా!
నువ్వన్నట్లుగా గిరీష్ కర్నాడ్ గారి నాటకం పేరు “తల దండ” ( తిల దండ కాదు ) తలకు దండన అంటే శిరచ్చేదనం అనే అర్ధం లో గామోల్సు.
In his play Tale-Danda ( literally means death by beheading ) Girish Karnad successfully reveals the evils of the caste ridden Indian society with vulgar political intrigues. Written in 1989 in the backdrop of mandir-mandal conflict, the drama draws parallel between the Socio-Religious, Political and Economic conditions of existing times and southern India in the 12th century AD during Sharana’s Movement / Virasaiva Bhakti Movement of Karnataka.
In 12th century A.D. there happened a great social religious revolution. The revolutionaries under the head of Basavanna the finance minister of the king Bijjal assembled a congregation of poets, mystics, social revolutionaries and philosophers, unmatched for their creativity and social commitment. This congregation, sprung from a variety of backgrounds and social strata, displayed a marvellous egalitarian, liberal, modern soul. They opposed idolatry, rejected temple worship, upheld equality of sexes, condemned the caste system and advocated the theory “work is worship ” .
In an attempt to make a dramatic, logical statement of their beliefs, they embarked on the marriage of a ‘ low caste’ cobbler’s son with the daughter of a Brahmin. It sparked off a violent upheaval that resulted in widespread bloodshed, and the end of both Basavanna and his wonderful movement. The anger of Society, unwilling to abandon the safety net of the caste system turns to frenzy and the couple are lynched. The movement ended in bloodshed .
Karnad’s play Tale-Danda ( Rakt Kalyan ) deals with a few weeks during a vibrant, prosperous and intellectually alive society plunged into anarchy and terror.
నాటక రంగంలో సాహిత్య సేవకు 1998లో జ్ఞానపీఠ్ అందుకున్న ( ఏకైక రచయిత ) గిరీశ్ కర్నాడ్ … ‘నాటకం నా ఆత్మ’ అని చెప్పుకునే గిరీష్ కర్నాడ్ తుగ్లక్ (1964), హయవదన (1972), అంజుమల్లిగె (1977), హిట్టిన హుంజ (1980), నాగమండల (1988), తలదండ (1990), అగ్ని మత్తు మాలే (1995), మదెవె ఆల్బం (2006), ఫ్లవర్, బెంద కల్లు అన్‌టోన్డ్ (2012) లాంటి నాటకాలను వెలువరించి విశేషంగా ఆకట్టుకున్నారు.
రచయితగా, దర్శకుడిగా, నటుడిగా రాణిస్తున్నా, ఎనిమిది పదుల వయసు దాటినా దేశవ్యాప్తంగా హేతువాదులు, లౌకిక వాదులు చేపట్టే ఆందోళనల్లో పాల్గొన్నారు ( లంకేశ్ హత్య తర్వాత మత ఛాందసంపై సాహితీవేత్తలంతా సాగించిన ప్రతి పోరాటంలోనూ తన గొంతు వినిపించారు ).
రామన్నా థాంక్స్ నాకన్నా నీదగ్గరే ఎక్కువ సమాచారం ఉంది. గొరుసు అన్నా బార్గవీ పి రావు నిజాం కళాశాల లో ఇంగ్లీష్ అధ్యాపకురాలిగా పనిచేసారు నాకు టీచర్ కూడా.అనేక కన్నడ రచనలను తెలుగు లోకి పరిచయం చేసారు. మీరు అన్నట్టు ఆ నాటకం పేరు ‘తల(లె)దండ’ ‘దండె’ అని కూడా రాస్తారు. గిరీష్ గురించి ఎన్ని వందల పేజీలు అయినా రాయొచ్చు. కొందరికి ఆయనకు వస్తున్న ఫేం పట్ల భిన్నాభిప్రాయం ఉంది.ఉండొచ్చు కూడా. ఆయన బ్రతికినంత కాలం రాజ్యం తో మమేకత తోనే ఉన్నాడు ఒక్క నెహ్రూ మీద తుగ్లక్ నాటకం రాయడం మినహా మిగతా జీవితం అంతా తాను నేపథ్యం కులం సామాజిక గౌరవం, మేదో శ్రమ ఇవన్నీ ఆయనకు రక్షణగా పనిచేశాయి. ఇన్ని వైరుధ్యాలు ఉన్నా తన రచన లలో నిష్కర్షగా ఉన్నాడు . అనేక ప్రయోగాత్మక ప్రక్రియలకు ఆద్యుడు అయ్యాడు. చివరి దశలో యావత్ భారత దేశం లోనే కన్నడ మేధో సమాజం ఎలుగెత్తి మాట్లాడడం మనం చూసాం గౌరీ ఆమె తండ్రి లంకేష్, అనంత మూర్తి, సాకేత్,రాజి, ఎంతో మంది తిరుగుబాటుకు చిరునామా గా మారారు.