1 ముగింపు
చెరిపేసే అరచేతులు నీవైతే
తోడయ్యే చేతులు
నావి.
2.మధ్య
మనల్ని విడదీసిన
సుదీర్ఘమైన ఈ కంచెలకీవలా ఆవలా
పనప్తీ హుయీ జిందగీ హై
సౌదాగర్ లు తూస్తూన్న తక్కెడెల్లో
ఊగుతున్న గుండెబరువెత్తు మాంసపు ముద్దలం
బరాబర్ సహీ
యే దునియా బదల్తీ నహీ
నా దిన్ పూరా హై నా రాత్ పూరి
నా సాంస్ పూరి హై నా హై షాయరీ పూరీ
ఆధే మే ఆధా రెహ్ గయా చాంద్
ఆధే మే ఆధి హోగయి చాంద్నీ
మిట్టికీ రేత్ సీ చౌకటోంకే పీఛే
గుఠ్ రహీ హై జిందగీ
ఇధర్ భీ ఔర్ ఉదర్భీ
ఊపిర్లలోకీ సీతాకోకలా పయనిస్తున్న స్వేఛ్ఛాకాంక్షలు
ఒక రెక్క తెగిన అవిటితనంతోనైనా ఎగరాలిలే
అక్కడా ఇక్కడా అంతే అంతే
పలు టన్నుల కష్టకాలపు గాయభారం మోస్తూ భుజం
అక్కడా ఇక్కడా
నెత్తుటి ధార
ఒకటే వర్ణం…!
దేహాలు రెండు
ఒకటే దుఃఖం
- మొదలు
పక్క పక్కనే రెండు పూదోటలు మనలేవని వాళ్ళంటున్నారు
మన మధ్య ప్రేమా- అభిమానం, నవ్వూ-కరచాలనం వద్దని వారిస్తున్నారు
దుష్మనీ బరాబర్ పంచుతున్నారు.
వీచే గాలి మీద నా మాట పడవలో నీకోసం ఓ గుల్దస్తా పంపుతున్నాను
కాసిన్ని పూలు కాసిన్ని ముళ్ళతో భారభారంగా…
ముళ్ళు పక్కన తీసి పడేసి సగం వాడిన పూలేం పట్టుకుంటావు గానీ
ముళ్ళే పట్టుకో
కంచెల్ని తెగ్గొట్టాలంటే
ముళ్ళే సరైన ప్రత్యామ్నయం
- చివరి మొదలు
మధ్యే మార్గం లేదు
వాళ్ళు సైన్యాన్ని మోహరించే
ఉంటారు ఎప్పటికీ….!
ఆయుధాలు ఎక్కు పెట్టే
ఉంటారు పగలూ రేయీ…!!
ఇలాటి భీభత్స కాముకుల మధ్య
నొప్పి స్వేదమౌతున్న కండల మీద
ప్రియురాళ్ళ పేర్లను నెలవంక కలంతో
వెన్నెల సిరాతో పచ్చబొట్లుగా చెక్కించుకున్న గాతా రహే దిల్ గాళ్ళం
విధ్వంసం నీ పెరట్లోనో
నా పెరట్లోనో వాళ్ళు ఓ క్షిపణి రూపం లో జారవిడవక ముందే మేల్కొందాం
1947 ఖూన్కీ నదియోంకీ యాద్ అభీ తాజా హైనా….
దుఃఖ్భరే గీత్ తూ అభీ గాతా హైనా…
*
పెయింటింగ్: పఠాన్ మస్తాన్ ఖాన్
ఆధీ మే ఆధీ హోగయీ చాంద్నీ… బాగుంది సార్. దిల్ కో జోర్ సే లగీ !
నిర్మాణం కొత్తగా ఉంది
మీ పోయెమ్స్ లో ఒకానొక విలక్షణమైన , మంచి నైపుణ్యం కనిపించిన పోయెమ్ సర్..