ఒక ప్రాణం కథ

అనుకుంటాం గానీ

మరణం పెద్ద ప్రమాదమేమి కాదు

ఎన్ని ఆకులు మరణించడం లేదు

అంత్యక్రియలు లేని పూలమాటేమిటి

సముద్రతీర స్మశానం లో

విరుగుతున్న అలల విషయమేంటి

పడమర కిటికీ నుండి దూకే

సాయంత్రాల సంగతి?

ఆరిపోవడానికి సిద్ధం గా ఉన్న

దీపం చివరిమాట విను

గాయపడి అల్లాడుతున్న

కుందేటి కూన కంట్లోకి చూడు

ఎండిన నది పాడుతున్న

పొడిగొంతు రాగం ఆలకించు

ఎంత గుంజు కున్నా

తుపాను గాలికి

గొడుగు ఆగదు

ఎడతెరపి లేకుండా

లోన కురుస్తున్న వర్షం

తడుస్తున్న ఆత్మ

వికసిస్తూ పరిమళించే ప్రాణపుష్పం

రక్తం లో వెలిగే ఎర్రనికాంతి

చీకటి అలా పొంచి ఉంటుంది

అచ్చు నీడ లాగే

 

నువ్వెక్కిన పడవ

నీకు భయంలేని పగళ్లను

సంతోష ద్వీప శిబిరాలను

తెరచాప మీద జరిగే

బొమ్మలాటను చూపుతుంది

 

 

పడవ ఆగే రేవు వద్ద

ఎవరిమీదకో నెపాన్ని తోస్తావ్

ఆక్సిజన్ అందదు

కర్త కర్మ క్రియ

నువ్వే అని గ్రహించవ్.

*

చిత్రం: పఠాన్ మస్తాన్ ఖాన్ 

సుంకర గోపాలయ్య

పిఠాపురం రాజా డిగ్రీ కళాశాల లో తెలుగు అధ్యాపకులు. సొంత ఊరు నెల్లూరు.
సంపాదకుడిగా పిల్లల కవిత్వం రెండు పుస్తకాలు తెచ్చారు.రంజని కుందుర్తి,తానా, ఎక్సరే ,పాటూరి మాణిక్యమ్మ మొదలైన పురస్కారాలు అందుకున్నారు. రాధేయ కవితా పురస్కార నిర్వాకులలో ఒకరు.

43 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • ఎంతబాగుంది గోపాల్. మీరిలా నిరంతరం రాయమని నా కోరిక.

  • చాలా బాగుంది సార్ చాలాబాగా రాసారు

  • Super sir ohh bhavam e Kavitaa rupam rasindi pranaya kusumam. Bhavaniki andani bhava kavitvam rasaru sir !!!!!!

  • చాలా బాగుంది సార్ మీరు మరిన్ని పురస్కారాలు అందుకోవాలని కోరుకుంటున్నాం.

  • మిత్రమా విభిన్నమైన వ్యక్తీకరణ …చాలా బాగుంది

  • వాస్తవాలు అక్షరాలుగా రూపు దిద్దుకున్న వేళ

  • తాత్వికంగా మానవ సంబంధాల్ని విశ్లేషించారు .
    మంచి కవిత .
    అభినందనలు మిత్రమా ..
    పలమనేరు బాలాజీ
    9440995010

  • చక్కటి అభివ్యక్తి.. అభినందనలు గోపాల్ గారు.

  • I know you have wonderful thoughts in your mind but It’s quite genaral. To me this is Nice poetry , my suggestion take some action item of burning issue/need of this states or country and produce your thoughts like this to reach many.

  • మరణం పెద్ద ప్రమాద మేమీ కాదంటూనే ,
    ప్రకృతి ప్రాణస్పందనల్నీ,సాగరఘోషలో విరిగి పడే ఆలల్నీ,ఆత్మల తడితడి సంభాషనల్నీ లైవ్ క్యాస్ట్ లో విన్పించావ్.అభినందనలు గోపాల్

  • Marananiki bayapadaku adi maro janma ku swagatam lantidi ane satyani teliputundi sir mi e chakkani Kavita….

  • Nice one Gopal👏👌.. Happy to see more from you..!! Wishing you all the best for future ones

  • మీరు ఎం అనుకొని రాసరో ఏమో, కవిత చదివకా, నా ఆలోచనకు వచ్చిన ప్రశ్నలు…
    1.ప్రాణం ఉన్నదేది? లేనిదేదీ?
    2. కథలో నాయకులు, ప్రతినాయకులు లేకుండా మెప్పించడం అంత సులభం కాదు కదండీ.., మన కథలో మనం ఎప్పుడు నాయకులమే, అందుకే నెపాలు ప్రతినాయకులకేమో? ( ప్రతినాయకులే నెపాలా?)
    ‘అంత్యక్రియలు లేని పూలు’ అద్భుతంగా ఉంది సర్.

  • అనుకుంటాము కానీ ఇలాంటి కవిత్వం కేవలం మీ కలం నుండి జారి నిద్ర పోతున్న మమ్ములను తట్టిలేపి ఆలోచనలతో విహారాయత్రాలు చేఇస్తాయి…..సూపర్ సర్. మీ మరొక కవిత్వం కోసం ఎదురుచూస్తు ఉంటాం ..

  • కవిత్వం లో సునిశితత్వం, మృదువైన పదసంపద, పదునైన భావం ఇవన్నీ మా గోపాలయ్య మాస్టారు సొంతం.

    చాలా బాగుంది sir

  • చిన్నప్పుడు మీ క్లాసు కోసం ఎదురుచూసే వాళ్ళం సార్, ఇప్పుడు మీ కవితలు చదువు తు ఆ రోజులను గుర్తు తెచ్చుకుం టు న్నాను. ధన్యవాదాలు

  • Hi Gopal, I am so impressed the way you wrote it’s amazing…. It always make us to think ….we are so proud of you Gopal.

  • చాలా బావుంది సర్…
    వికసిస్తూ పరిమళించే ప్రాణ పుష్పమ్…
    నైస్ పోయం….

  • అధ్భుత పద ప్రయోగాల తోబాటు .. సముద్రం నేటివిటీని మిస్ కారు ..మా నెల్లూరి కవిగారు..అభినధనలు సర్

  • అద్భుతమైన భావ వ్యక్తీకరణ,భావ చిత్రాలు
    మనిషి మనస్తత్వాన్ని అద్దం పట్టే కవిత అన్నిటికీ తానే కారణం అని తెలిసిన నెపం వేరే వారి మీదకి తోస్తాడు. అదీ వీలు కాకపోతే కాలం పైకి తోస్తా డు.అదొక రక్షణ తంత్రం.
    మరణాన్ని గురించి బయపడకని చెబుతూ ప్రకృతి నుండి ప్రేరణ పొందాడం ఒక ఆశావహ దృక్పథం
    అద్భుతమైన కవిత మిత్రమా

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు