జ్ఞానం, నాలుకలు, నడతలు పుస్తకాల నుండి కాకుండా ఆత్మల నుండి, ఆత్మలకి సోల్‌ఫుల్‌గా సోసైటీకి హృదయాలు వెలిగించిన మర్మజ్ఞానంగా ప్రవహించడం చూసారా? పోనీ, రాత్రుళ్ళు అనామక నక్షత్రాలు అక్కడక్కడా మిణుక్కుమంటూ అక్షరాలై కాంతి రుచి చూపడం ఎలా ఉంటుందో తెలుసా? ‘Don’t you know yet , It is your light that lights the worlds’ అనే రూమి మాటలు అర్థమైన రచయితలు ఎవరన్నా ఉన్నారూ అంటే వాళ్ళు మాత్రమే సాహిల్ గురించి ప్రపంచానికి చెప్పగలరు చూడండి , సరిగ్గా అలా ఉంటుంది అఫ్సర్ గారి కథలు చదవడం.
అయితే , నిజానికి కథలే జీవితానికి సమీక్ష అయినప్పుడు కథల పుస్తకాలపై సమీక్షలు పాలపుంతల్లోకి కొత్త నక్షత్రాలు కనిపెట్టి విసిరెయ్యడంలాంటిది అని ఎప్పుడూ ఉన్న ఫీలింగే.. కాని సాహిల్ వచ్చాక నాదంటూ ఒక నక్షత్రాన్ని ఈ యుద్ధంలో వంటరిగా అనిపిస్తుందని అలసటపడే యోధుడి భుజంపై చిన్నశభాష్‌గా You have done it , finally you made Telugites (Indians ) hug pathetic debilitated faqir Saahil అంటూ చేర్చడం సర్వసత్తాక రాజ్యాంగం ఒకటి దేశంలో పని చేస్తుంది అని నమ్మలేని కాఫిర్‌గా అవసరం అనిపించింది.
నమ్మకం, నమ్మకం.. నమ్మకమే కదా ‘చమ్కీ పూలగుర్రం’లో మున్నీ మనిషితనంలో వెతుక్కుంది. నమ్మకమే కదా అన్వర్ కోసం ఈ ఫైజ్ ప్రేమికుడు ” కొంత సమయం నీకు నాకు , కొంత సమయం వంద అనిశ్చితాలకి, ఇంకొంత సమయం కొన్ని వెలుగులకి’ అని అంత అస్పష్టతలోనూ స్పష్టంగా రాసుకుంది . ఆ నమ్మకం కోల్పోయిన సాహిల్ తత్తరపాటునే కదా , మనలోని ప్రతి ఆత్మా తనలో తరచి తరచి వెతుక్కున్నది. పెళ్లి వ్యవస్థ మీద కోల్పోయినా అదే నమ్మకం కదా ఆపా.. ‘ఈ పెళ్లి చట్రంలో ఇరుక్కొని బతికితే మంచి ఆడది.. నేను అలాంటి ఆడదాన్ని కాలేను’ అనగలిగింది . ఆ నమ్మకమే కదా లస్ట్ ఫర్ లైఫ్ తాలుక ఆమె, కవిత్వం, రంగులు , రంగుల్లాంటి శిథిలాలు , శిథిల్లాల్లాంటి జీవితంగా అతనికి ఎదురొచ్చింది. కవులు కవిత్వ ప్రక్రియలో ముసాఫిర్లుగా మారినప్పుడు వ్యక్తీ , కుటుంబం నుండి అంచెలంచెలుగా సమాజం వరకు ఎదిగిన వ్యవస్థల మీద కోల్పోయిన నమ్మకమే కథల రూపంలో ఇంకొంచం తేటగా, ఇంకొంచం తేలిగ్గా జనసామాన్యం చెవులు మనసూ నింపుకునేలా అందిస్తారని “సాహిల్ వస్తాడు” మళ్ళీ మరోసారి ఇలా నమ్మకాలు, అపనమ్మకాల పులిమేక ఆటై ప్రూవ్ చేస్తున్నది. అస్తిత్వాలను నాశనం చెయ్యడానికి పూర్వకాలపు తల్వార్లొక ఏజోల్డ్ ఫ్యాషనైపోయి, సరికొత్త అవతల పెట్టే విద్యలు రుధిరదుర్గానికి దారులు వేస్తున్నప్పుడు పీలగానైనా వినిపించే ఆవాజ్‌ను దోసిళ్లలో ఎత్తుకుని ఓదార్చడానికి ఏ కర్ణుడూ లేడిక్కడ మరి.
అఫ్సరం అంటే అక్షరం అంటుంది తెలుగు సాహిత్యం. కాని అందీ అందని పర్సనల్ శాంతి, అగమ్యగోచర ప్రపంచ శాంతి రెండూ అక్షరంలోనే వెతుక్కొనే Nomadic wordsmith అంటాను నేను. ముందు తరానికి ప్రెజెంట్ చేసిన “అడవి” దగ్గర నుండి ఈ తరానికి అందించిన “వచ్చే పోయే వానల్లో ” వరకు కనిపించే evolution, దాదాపు ఈ పాతికేళ్ళలో పర్సనల్, ప్రొఫెషనల్ గ్రోత్ తన చేతికి ఇచ్చిన ప్రతి మలుపు, రిలేషన్షిప్స్ తాలుక రోలర్ కోస్టర్ రైడ్, స్నేహాలు, అందులోనే అస్నేహాలు, వేకువ ప్రేమలు, రాత్రి తాపాలు, అంతర్జాతీయ ఆకర్షణ వికర్షణ సిద్ధాంతాల ఆటుపోట్లు, వ్యక్తిగత నష్టాలు, వ్యవస్థాగత వేదనలు.. అంతలోనే ఆలోచన అక్షరంగా సమాజాన్ని సమసమాజంగా చేస్తుందన్న సోషల్ బీభత్స కాఫిరానాతనం.. హతవిధీ, ఆ కురిసిన వానచినుకులే తలముత్యాలు చేసుకొని సంబర పడాలో, ఇంతకీ పడ్డ నాలుగు చినుకులూ ఈ బీడు సమాజంలో పిచ్చివో పచ్చివో మొలకలవుతాయో లేదోనన్న వేదనా శంకలో, కథలు ఇంతింత కవిత్వమంత మృదువుగానే చదివిస్తూ గుండెకి అడ్డు, నిలువు కోతలెందుకు పెడుతున్నాయో అర్థంకానితనంలో మిగిలిపోయే రీడరుడిగా మేము!!
ఇది కథల పుస్తకం అంటోంది దిక్కూదివాణం లేకుండా తాడుతెగిన ఈ సబ్ సే బహుత్ దునియాకీ నారాజ్ పతంగ్. ఇదొక్కటేనా? రియాల్టీలోకి వస్తే.. భుజాన ఇంత తిండిని చీమల్లా మోసుకపోయే ప్రాణులను బార్ బార్ దేఖో హజార్ బార్ దేఖో అనే అనుమాన శూలాలు గుచ్చుకున్న ప్రతి మానవుడిది, మానవిది కథకాకుండా పోతుందా భయ్యా. అక్షరానికెక్కని కోట్ల కథల్లోని సారం సాహిల్‌లో ఇసుక తడిలా తగిలి రివ్వుజవ్వుమనే స్పర్శావసర దుఖ్కంలో పక్కన మనుషున్నా, పశువున్నా ఒక కౌగిలింత అంతే. Judging someone and looking at them reveals more about your character than theirs అని నారికేళాలంత సైజులో రాసిపెట్టుకుందాం బిడ్డా..
నిజానికి ప్రతి కథకీ ఒక పీహెచ్‌డీ థీసిస్ రాయడం అవసరం అయిన అనవసరం. ఎందుకంటే , ముందే అనుకున్నట్లు కథలు జీవితాలకి సమీక్షలు అయితే “సాహిల్ వస్తాడు” ఇండో పాక్ భాయిభాయి అవుతూనే ఎందుకు కాకుండా పోతుందో రాసిన ఒక లైఫ్ టైం డాక్యుమెంట్. అంతేకాదు అక్షరాలు పూర్తిగా దిద్దుకోవడమే రాదుకాని సోషల్ మీడియా పుణ్యమా అని పుస్తకాల అచ్చులు పేరు ప్రఖ్యాతులు అంటూ వెంపర్లాడే పొద్దెరుగని మాలాంటి కొత్తబిచ్చగాళ్ళకి ఒకో స్వేచ్ఛాగీతాన్ని కాశ్మీర్ రగ్గుల్లో పక్షి రూపంలోనో పాదరసంలా మనసులోకి జారిపోయే పలుకు రూపంలోనో అల్లడానికి టైం అండ్ పేషన్స్ రెంటితో పాటు కూసంత జీవిత, లోకజ్ఞానం సైతం కావాలని ఈ పుస్తకం చెప్పకనే చెప్తుందని చెప్తూ, Here I am, with a smirk on my face typing “Yes Afsar sir .. the peace dove of words, You have done it , finally you made Telugites( Indians ) hug pathetic debilitated faqir Saahil.”
*
వాహ్.అద్భుతమైన ఆలోచనల ప్రవాహంలో మననూ నెట్టుకుపోయే కథల గురించి ఎంతో ఇష్టంగా ఇదే నేనూ చెప్పాలనుకున్నది అనిపించేలా రాసిన నిశీధి గారూ…రాసేలా చేసిన అఫ్సర్ గారు మీకూ….ధన్యవాదాలు.
సాహిల్ వస్తాడు కథలు చదివాను, కానీ 3d సినిమాను 3d గ్లాస్సెస్ లేకుండా చూస్తే ఎలాగుంటుంది?? అనుభూతి ఉండదు. ఇప్పుడు నిశీధి గారి సమీక్ష చదివింతర్వాత.. కథల్ని ఎలా అర్థం చేసుకోవాలో అన్నది తెలిసింది
మంచి సమీక్ష ఇరువురికీ అభినందనలు💐💐💐
Excelent review, nomorewords 👌👍. Afsarji,గురించిన,మీ,భావనలే మావికూడా!ధన్యవాదాలు, బ్రెయిన్ డెడ్ ji.💐