ఏ దీపాన్ని వెలిగించినా…

నవ’ నానీలు 

1

చందమామ

నైటంతా

నిద్ర ఉండదీ

వాచ్ మాన్ కి

 

2

గూట్లొకి చేరుకున్న

పక్షి పాటలా

అస్తమయం !

రాత్రి కురిసి వెలిసిన

వాన మనసులా

ఉదయం !

 

3

జైల్లో ఖైదీ కొత్త పాట

ఏ దీపాన్ని వెలిగించినా

చీకటినే చిమ్ముతోంది

 

4

వాన మొదలైంది

స్కూలు నుంచి ఇంటికి తిరిగొచ్చిన

పసి పాపలా

విత్తు కేరింతలు

 

5

చెట్టు కింద పూలకుండీ

విరహంలో ఆకాశం

6

సూర్యుడి కంట్లో నలక

ఆ కొద్ది సేపైనా

ఆకాశంలో మేఘం అల్లరి

 

7

ఇసుక పడింది

కంటి నిండా కెరటాల్లేని సముద్రం

 

 

8

ఎండ పాట కచ్చేరీ కి

నిశ్శబ్దంగా ఊ  కొడుతోంది

నీడ

 

9

కాగితంతో

కలం ప్రణయం!

అణువణువూ

పులకింతల అక్షరాలే !

పులగం చిన్నారాయణ

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు