కొన్ని వేల సాగరాలని దాటాక అడిగిందామె
‘ఇంకా ఎంత దూరమా ద్వీపం’
తెడ్డు వేస్తూ అన్నా నేను…
మరి కాసేపు.
ఒడ్డు చేరతామని ఖచ్చితంగా తెలుసు
కానీ, ‘ఎంత సేపు?’
కాసేపేనమ్మా, ఇదిగో చుక్క-
ఇదే దారి.
‘త్వరగా….’
మౌనంగా తెడ్డు వేస్తున్నా
‘దారిదేగా,’ తెలుసు
‘భలే దాహంగా ఉంది’
చుట్టూ నీళ్ళు, కానీ తాగలేం.
పైన పక్షులు ఎగురుతోంటే
చికాగ్గా ఉంది, తుఫానా?
ప్చ్..
‘ఓ పాట పాడు తల పగిలి పోతోంది’
‘తీరం చేరాక ఇలా ఉండదుగా?’
లేదు! చాలా అద్భుతమైన లోకం అది
అక్కడ ఏ దిగులూ లేకుండా హాయిగా నిద్రపోవచ్చు
భలే చల్లగాలి, చెట్ల ఆకులు ఊగే చప్పుడు-
నీళ్ళలోంచి బుడుంగుమని పైకొచ్చింది ఏదో!
తెడ్డు చేతినుంచి జారిపోయింది
‘ఏంలేదు, ఏంలేదు…
ఏదైనా పాట పాడు…’
పాట సాగుతూనే ఉంది…
నెమ్మదిగా ఊగుతూ నావ
ఆకాశానికీ సముద్రానికీ మధ్య కరిగిపోయింది.
*
పెయింటింగ్: సత్యా బిరుదరాజు
కవిత బావుంది ..కరిగిపోయే కల .. త్రిశంకు స్వర్గపు సుఖంలా .. పెయింటింగ్ భలే ఉంది సత్య గారూ
థాంక్స్ అండి 🙂
nice andi
చాలా బాగా ఉంది.
కాసేపెందుకో అంటా సైలెంట్ అయినట్టు మనసంతా బేచైనీ అనిపించింది…