గదిలో
ఎవరూ లేకపోవడం ఏంటి
నేనున్నాను
చేతిలో పుస్తకం ఉంది
మిత్రుడి మీద చెయ్యి వేసినట్టు
పేజీ లు తిప్పుతున్నాను
పేజీలు పక్షిరెక్కాల్లా ఎగురుతున్నాయ్
నా చుట్టూ చాలా మంది తిరుగుతున్నారు
చెర్లో పడి మరణించిన మిత్రుడొకడు
కిటికీ దగ్గర నిలబడి ఉన్నాడు
నా చిన్నప్పుడు మరణించిన
మా ఊరి వాళ్ళు తలుపు తడుతున్నారు
గదిలో
ఒక్కడినే ఉన్నానా
నా మొదటి ప్రేయసి
కన్నుకొట్టి,గుండెమూలాల్నికదిలిస్తోంది
గది లో ఫ్యాన్
మూడు కత్తులతో గాలిని భయపెడుతోంది
గడియారం లోని
మూడు ముళ్ళు డిసిప్లిన్ తో ఉన్నాయ్
ప్రాణం పోయినట్టు
కరెంట్ పోయంది
పూలు రాలుతున్న చప్పుడు
నల్లగా నవ్వుతున్న చీకటి
బయట రెండు కుక్కలు
అధికార,ప్రతి పక్షల్లా అరుచుకుంటున్నాయ్
భయం భయం గా
ప్రవహిస్తున్న నెత్తురు
చీకటి ని తగలేసే
ఆయుధం ఒక్కటి కావాలి.
*
కవి మాట :
ఈ కవిత ఫోన్ కీ ప్యాడ్ పై 3 నిమిషాలలో టైప్ చేసిన కవిత.
టైపు చేశాక ఒకే ఒక్క మార్పు చేశాను. ఆ మధ్యాహ్నం గదిలో ఒక్కడినే ఉన్నాను. చిన్నప్పటి నుండి పెద్దలు భయపెట్టిన కారణంగా ఊరిలో ఎవరైనా మరణిస్తే
చూడటానికి వెళ్ళనిచ్చే వాళ్ళు కాదు.ఆ కారణం గా చనిపోయిన వారు పదే పదే గుర్తుకు వచ్చేవారు.అది ఇందులోకి వచ్చింది. అనివార్యం గా ఆ వాక్యాలు అడుగు పెట్టాయి.ఒంటరి గా ఉన్నప్పుడు ఎవరెవరో గుర్తుకు వస్తారు.ఐతే నా చేతిలో పుస్తకం ఉంది.గదిలో గడియారం ఉంది.బహుశా ఇది నాకు నేను చెప్పుకున్న ధైర్యం కావొచ్చు.ఫ్యాన్ రెక్కలను కొత్త గా చెప్పాలనుకున్నా.చీకటిని జయంచే ఆయుధం కావాలని రాశాను. ఇక్కడ చీకటి భయానికి ప్రతీక గా వచ్చి ఉంటుంది.గది లో ఒంటరి గా ఉన్నప్పుడు బయట కుక్క అరుపులు కూడా భయపెడతాయ్.
వ్యాఖ్య: గీత వెల్లంకి
ఏకాంత శిబిరం… అనే టైటిల్ చాలా వొద్దికగా కుదిరింది! పుస్తకం చదివేటపుడు ఎవరైనా అంతే! ఒక గదిలో ఒంటరిగా కూర్చుని పుస్తకం చదువుతుంటే మిత్రుడు తోడున్నట్లే!
మిత్రుడి మీద చెయ్యివేసినట్లు పేజీలు తిప్పడం అనేది చాలా బాగుంది. పేజీలు పక్షి రెక్కల్లా తిరుగుతుంటే రకరకాల జ్ఞాపకాలు… మరణించిన చిన్ననాటి మిత్రుడు, ఇంకా మిగతా ఊరి జనాలు తలుపు కొట్టినట్లు హృదయంలోకి చొచ్చుకువచ్చేస్తారు.. ఇంకా గదిలో ఏకాంతంగా ఉన్నపుడు గుర్తొచ్చే తొలి ప్రేయసి జ్ఞాపకం ఒక పక్క గుచ్చుతుంటుంది. ఫ్యాన్ రెక్కల్ని మూడు కత్తులుగా వర్ణించడం, అవి గాలిని భయపెట్టడం బాగుంది. వాన రాకడా ప్రాణం పోకడా తెలియదన్నట్లు.. కరెంటు పోవడం కూడా అంతే కదూ! అందుకే ప్రాణం పోవడంతో పోల్చినట్లున్నారు. నిశ్శబ్దంగా ఉందేమో..పూలు రాలుతున్నట్లుగా!
చీకటి నల్లగా నవ్వుతోంది.. వాహ్! కుక్కల్ని రాజకీయులతో పోల్చినందుకు అవి ఇంకొంచెం మొరుగుతాయేమో! నెత్తురు భయం భయంగా ప్రవహిస్తోందనడం.. కొంచెం అస్పష్టంగా ఉంది. అది మనిషి ఒంట్లోనా లేక ఇంకెక్కడైనానా అన్నది ఇంకొంచెం స్పష్టంగా ఉంటే బాగుండేది. చీకటిని తగలేసే ఆయుధం ఒక్కటి కావాలి. అది బహుశా పుస్తకమేనేమో! పుస్తకం… తానొక ఏకాంత శిబిరమై అజ్ఞానతిమిరాన్ని తోలి మనిషి మనసును వెలిగిస్తుంది!
పెయింటింగ్: సత్యా బిరుదరాజు
Super sir
చాలా మంచి అభివ్యక్తులతో కొనసాగిన చిక్కని కవిత అభినందనలు గోపాల్ గారు
మంచి కవిత
Prathi line adhbuthanga undhi sir,meru super👌
Really it’s awesome heartly congratulations sir…
ఏకాంతం గా ఉన్నప్పుడు
మనిషిలో కలిగే భావాలను
బాగా చెప్పారు.కొత్త ప్రయోగం
కవి కి అభినందనలు
Nice poet and good explanation sir…we want to see more than this types from you sir tqq
ఏకాంత శిబిరం కవిత చాలా బాగుంది.
Andharu anubhavinche jeevitham
Kondhare abhivarninchagalaru.
Idhi chadhuvuthunnapudu oo kavitha la kaaka yeppudo nenu pondhina vyaktha parachaleni anubhoothila anipinchindhi.
Varnanaathetham ane padham oo kavi ki anirvachaneyam.
Meeru varnichaleni sthithi undadhemo.
“Veedhi lo arusthunna kukkalu adhikaara-prathipakshala la unai” ani anadam vaari sthithi ni kallaku kanabadettu chesindhi. Goppa polika chesaru.
Dhanyavadhamulu.
Okaru unna onetari kadhu. Chuttu manaki chala mandi thoduga untaru ani chala baga cheparu .sir.
Pustakam loni aksharalu bhagavanthudu ichina muthyalu
Miru rasina pustakam loni ii Kavitha akasam Loni nakshatralu lantivi.
ఏకాంతం లో ఉన్న వేళ
నేను న్నానంటూ….
భుజము తట్టి
భరోసా ఇచ్చినట్లు గా
ఉంది.
మీ రచన.
అద్భుతమైన రచన
అభినందనలు సార్.
చాలా బాగుంది..
చాలా బాగుంది మీ కవితా వస్తువు
మీ భావుకత అద్భుతం
కవి గారికి అభినందనలు
Excellent sir.congratulations to you sir.
Very innovative sir.
‘భయం భయంగా ప్రవహిస్తున్న నెత్తురు’ అంటూ
‘ఏకాంత శిబిరం’ కవితను మూడు నిమిషాలలో ముచ్చటగా మలచిన మిత్రుడు సుంకర గోపాలయ్యకు హృదయపూర్వక అభినందనలు …..
ఈ కవితలో ‘నెత్తురు’… జ్ఞానానికి ప్రతీకగా అనిపిస్తోంది. భయం , బిడియం , నిరుత్సాహం …. ఇత్యాది నకారాత్మక లక్షణాలన్నీ జ్ఞానసముపార్జనకు ఇబ్బంది కలిగించేవిగా పరిగణింపబడుతాయి.
ఒక్కమాటలో చెప్పాలంటే ‘నెత్తురు’ అనబడిన జ్ఞానాన్ని ‘పుస్తకం’ అనే ప్రపంచంనుండి గ్రహించడానికి ‘భయం’ అనే నకారాత్మక లక్షణం ఆటంకపరుస్తుందని , చీకటి తొలగి భయం అదృశ్యమైతే ‘నెత్తురు ధారాళంగా ప్రవహిస్తుంది’ (జ్ఞాన సముపార్జన సజావుగా సాగుతుంది) అనే భావాన్ని మిత్రుడు వ్యక్తపరచినట్లుగా నా భావన.
మంచి అభివ్యక్తికరణ….
ఫ్యాన్ గురించి చెప్పినవిధానం బాగుంది.
కుక్కల.అరుపులు రాజకీయ నాయకులు తో పోల్చటం బాగుంది. కొసమెరుపు బాగుంది.
Tq, all
Super sir…chalabagundi mi ee Maro nuthana Kavitha….
ఏకాంతం స్వాంతనం, gopalayy భాష్యo. అంతరంగం భావన బాసట కు అభినందనలు. డా. శిరీష
నల్లగా నవ్వుతున్న చీకటి……చీకటిని తగలేసే ఆయుధం ఒక్కటి కావాలి……సూపర్ సర్…చాల బాగుంది…చాలచాల బాగుంది..మరో కవిత కోసం ఎదురుచూస్తు..అభినందనలు సర్.
Super Sir
ఈ శీర్షిక వినూత్న0 గా ఉంది.
కవిత అభివ్యక్తి బాగుంది.
గోపాల్ సార్ రాసిన ‘ఏకాంత శిబిరం’ ప్రతి పాఠకుని హృదయాన్ని స్పృశించగలదు. ఇందులోని ఒకటి అరా ఉపమానములు నేటి సమాజ పరిస్థితులకు అద్దం పడుతున్నవి. కవిత చదువుతూ నేను తన్మయత్వం చెందాను…..
Tq
Supper sir
చీకటి ని తరిమేసే ఆయుధం జ్ఞానం లోనే వెదుక్కోవాలి అనే అర్థాన్ని చెప్పే కవిత … మన బాల్యం లో చీకటికి అందరమూ బయపడుతూనే వుం డే లక్షణాన్ని తెలిపారు.
ఇప్పటికీ ఒంటరిగా గదిలో ఉంటే చీకటి వెంటాడే జ్ఞాపకం
Very nice Mithrama!
చెరువులో పడ్డ మిత్రుడు… 🙏👍
ఏకాంత శిబిరం చిక్కటి అభివ్యక్తి లతో కూడుకున్న అద్భుతమైన కవిత. ఒంటరిగా ఉన్న ఏ వ్యక్తి నిజానికి ఒంటరి కాదు. నిజానికి ఎక్కడ లేని ఆలోచనలు మనిషిని అప్పుడే చుట్టుముడతాయి ఏకాంత శిబిరంలో మనిషి తనను తాను నిర్మించుకుంటాడు విశ్లేషించుకుంటారు పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటాడు మొత్తంగా తనలాగ తన ఉంటాడు ఇక్కడ ముసుగులు ఉండవు.
కుక్కలు మొరగడం ని అధికార ప్రతిపక్షాలతో పోల్చడం నేడు అసెంబ్లీలో జరుగుతున్న అర్థం లేని వ్యర్థ వాదనలకు ప్రతీక.
నెత్తురు భయంభయంగా ప్రవహించడం ఫ్యాను గాలిని కత్తిరించడం కొత్తపోలికలు
అభినందనలు మిత్రమా ఇది అనుభవాల లోనుంచి పుట్టిన కవిత.