ఏం సాధించావ్…?! హిందీ అనువాదంలో ..

సీదు మీద మందిరం మీద వాలుతున్న
ఆ పావురాల గుంపును చూసావా
ఈ లోకాన శాంతి దూతలు కదా
వలవేసి పట్టి వాటి తలలు తుంచి
నీవు ఏం సాధించావ్…

ఈ మంచు శిఖరాలు
అందాల లేక్ దాల్ సరస్సులు
కుంకుమపూల వనాలు

కాశ్మీర్ యాపిల్ పండ్ల తోటలు ఆకుపచ్చ లోయలు
ఈ అందాల ప్రకృతిని విధ్వంసం చేసి
ఇంతకీ నీవు ఏం సాధించావ్…

ఆ మంచు పూల పల్లకీ ఎక్కి
అందాల లోయల్లో ఆనందంగా
విహరిస్తున్న విహారయాత్రికులను

మతోన్మాదం మత్తులో క్రూరంగా చంపి
ఏం సాధించావ్…

జీవనదులు పుట్టిన పుణ్యభూమిలో
నెత్తుటి నదులను పారించి
నీవు ఏం సాధించావ్…

ఈ మానవతాశకలాల నడుమ
ముక్కలైన పవిత్ర గ్రంధాల వాక్యాలు

తుపాకీ పట్టిన వాడి ప్రాణం

తుపాకీతూటాలోనే వుంటుంది అన్నట్టు
నువ్వు ఒక యుధ్ధభూమిని నిర్మించావు

ఒక శవాలతో నిండిన శ్మశానాన్ని
నీ దేశానికి కానుకగా ఇచ్చావు
అందులోనే నీవు సైతం
సాతానుగా కప్పబడ్డావు

సోదరుడా
నీవు ఒక ప్రేమ మందిరాన్ని
నిర్మించి చూడు
అందులో నీవు దైవంగా
ప్రతిష్టించ బడతావు.

సరికొండ నరసింహ రాజు

 

 

क्या झख मार दिया था तू ने?
~~~~~~~~~~~~~~~

मंदिर मस्जिदों पर बैठते
उन कबूतरों का झुंड देखा था क्या?
इस दुनिया में अमन चैन के हूर हैं न वे!
जाल में फंसाकर उन के गर्दन तोड़कर
क्या झख मार दिया था तू ने?

बर्फ से ढके ये टीले
डल झील का निसर्ग सौंदर्य
केसर के फूलों के बागान कश्मीरी सेबों के बाग बगीचे
हरी भरी वादियों को तहस नहस कर
तू ने क्या झख मार दिया था!?

बर्फीले फूलों की पालकी में बैठ कर हसीन वादियों

में हँसी खुशी विचरनेवाले सैलानियों को

मजहब के नशे में मार काटकर
क्या झख मार दिया था तू ने?

सदा नीरा झरनों के जन्मे सर जमीं पर
खून की नदियाँ बहाकर
क्या झख मार दिया था तू ने?

इस हैवानियत के दौरान
ध्वस्त पावन पुनीत ग्रंथों के सूरा श्लोक
तू ने एक जंगे मैदान को जनाया है!

मुर्दों से भरे शमशान अपने मुल्क को भेंट किया
उसी में शैतान की मानिंद दफना गया है।

भाई जान!
तू भी एक ताज महल बनाकर देख
उसमें तेरी मूर्ति देवता समान खड़ी की जाती है।

हिंदीकरण – डॉक्टर गणेश राम अनुवेदी

గణేశ్ రామ్ అనువేది

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు