ఎవరితరం అవుతుంది వీళ్ళకి చెప్పడం?

ఇవి చరిత్రలేని శతాబ్దాల నుండీ

హ్యాంగ్ అయిన మస్తిష్కాల్రా నాయనా !

ఉచ్చు పెట్టినవాడు

లాలించే పెట్ ఓనర్ కాలేడు ?

ముగ్గు వేసి మాటు కాసిన నక్క

నువు చేజిక్కాక

అక్కున చేర్చుకోలేదు ?

 

నకిలీని నెత్తికెక్కించుని ,

సత్యాన్ని డిలీట్ చేసార్రా నాయనా !

సత్యం, చౌకబారు సెంట్ కాదు ,

‘యువర్ స్లాట్ ఈస్ ఓవర్ ,

ది నెక్స్ట్ వన్ ఈస్ వెయిటింగ్’ అనదు;

శ్వాస ఉన్నా , ఆగినా

నీతో ఉండే వారంటీ అది!

 

తిమింగలం వెన్ను పల్లకి పై

ఊరేగుతున్నార్రా నాయనా !

ఈ మగత నిద్రలో

ఒక రాక్షశ సుడిగాలిలోకి,

ఉరుల సుడిగుండం లోకి కూడా ,

ఒక విందు కి వెళ్లినట్టు

కాపరిని కాదని కబేళా లోకి

ఏమిటీ వీళ్ళ కదలికలు !

ఎవరితరం అవుతుంది వీళ్ళని ఆపడం?

*

అప్పలయ్య

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు